Sunday, 13 September 2026 01:45:10 PM
# తక్షణమే స్పందించి ఆత్మహత్య చేసుకోవాలి అనుకొన్న యువతి ని కాపాడిన పోలీసులు # జాతీయ లోక్అదాలతో 71 కేసులు పరిష్కారం # తంబళ్లపల్లెలో 'విఘ్నం'లఘు చిత్రం ప్రారంభం # వినాయక చవితి పండుగ నేపథ్యంలో సోమవారం గ్రీవెన్స్ రద్దు - జిల్లా ఎస్పీ ధీరజ్ కునుబిల్లి # మట్టి వినాయక విగ్రహాలను పూజిద్దాం - సబ్ కలెక్టర్ చల్లా కల్యాణి # ట్రాక్టర్ ఢీకొని ఇద్దరికి తీవ్ర గాయాలు # తంబళ్లపల్లె సమస్యల పై అధికారులు దృష్టి సారించండి-ప్రజా దర్బార్ లో మాజీ ఎమ్మెల్యే జి శంకర్ యాదవ్ # ప్రజల సమస్యల పరిష్కారానికి ఐకమత్యంతో పనిచేయండి - మాజీ ఎమ్మెల్యే జి.శంకర్ యాదవ్ # మిట్స్ లో హెచ్‌ఆర్ కెరీర్స్ & ఏఐ ఆధారిత డిజిటల్ మార్కెటింగ్ ట్రెండ్స్ పై అతిధి ఉపన్యాస # వినాయక మండపాల నిర్వహణ పై సూచనలు -- డి.ఎస్పీ. బుచ్చిరాజు # ఎంపీ మిథున్ రెడ్డిపై ఉప్పొంగిన అభిమానం - యువనేత హర్షవర్ధన్ రెడ్డి ఆధ్వర్యంలో సేవా కార్యక్రమాలు # పఠాన్ ఖాదర్ ఖాన్ సేవలు స్ఫూర్తిదాయకం - టిడిపి రాష్ట్ర కార్యదర్శి పచ్చిపాల తులసి రామకృష్ణ హర్షం # మంచి చేయడమే కానీ మోసం చేయడం తనకు తెలియదు # ప్రజా శ్రేయస్సుకై పరితపించే నేత ఎంపీ మిథున్ రెడ్డి - వైకాపా రాష్ట్ర కార్యదర్శి ఎస్.ఏ కరీముల్లా ప్రశంసలు # రాష్ట్రంలో తీవ్ర కరువు ను కేంద్ర విపత్తుగా పరిగణిస్తూ కరువు ప్యాకేజీని ప్రకటించాలి - BKMU జిల్లా కార్యదర్శి తోపు కృష్ణప్ప # హ్యూమన్ రైట్స్ ముసుగు లో ఘరానా మోసాలు # విబిజి రాంజీ నీటి సంరక్షణ లో సప్లై చానల్స్ ఆదర్శవంతం - డ్వామా పీడీ వెంకటరత్నం # వీధిలైట్లు లేక అంధకారంలో కొటాల # ప్రకృతి సేద్యంలో నాలుగు పంటలతో నాలుగు రకాల ఆదాయం # ఏ.ఆర్ మొబైల్స్ వారి ఆకర్షణీమైన పండుగ ఆఫర్లు

విద్యార్థులు ప్రణాళికతో చదివి లక్ష్యాలను అధిగమించాలి - బ్రిలియంట్ కరస్పాండెంట్ మొరుంపల్లి సహదేవరెడ్డి సూచనలు

Date : 20 April 2026 08:33 PM Views : 1418

నమిత న్యూస్ - Andhra Pradesh / Annamayya : విద్యార్థులు ప్రణాళికతో చదివి లక్ష్యాలను అధిగమించాలి - బ్రిలియంట్ కరస్పాండెంట్ మొరుంపల్లి సహదేవరెడ్డి సూచనలు - ఘనంగా పాఠశాల 26 వార్షికోత్సవ వేడుకలు మదనపల్లె : విద్యార్థులు ప్రణాళికతో చదివి లక్ష్యాలను అధిగమించాలని పట్టణంలోని బ్రిలియంట్ ఇంగ్లీష్ మీడియం పాఠశాల కరస్పాండెంట్ మొరుంపల్లి సహదేవరెడ్డి సూచించారు.రింగ్ రోడ్డులోని శ్రీ చౌడేశ్వరి దేవి కళ్యాణ మండపము నందు పాఠశాల 26వ వార్షికోత్సవ వేడుకలు ఎంతో అట్టహాసంగా జరిగాయి.కరస్పాండెంట్ మొరుంపల్లి సహదేవ రెడ్డి,ప్రధానోపాధ్యాయురాలు మొరుంపల్లి రజనిల ఆధ్వర్యంలో సంబరాలు అంబరాన్నంటాయి.ఈ సందర్భంగా సహదేవరెడ్డి మాట్లాడుతూ విద్యార్థులు చిన్నతనం నుండి క్రమశిక్షణను అలవర్చుకోవాలన్నారు.ఉన్నత చదువులకు పోయే కొద్దీ ఒక సరైన ప్రణాళికను రూపొందించుకొని ముందుకు సాగితే తాము అనుకున్న లక్ష్యాలను చేరుకోవడం సులభతరమవుతుందన్నారు.తమ పాఠశాలలో నాణ్యమైన విద్యతోపాటు సామాజిక స్పృహ,దేశభక్తి,క్రీడలు,సాంస్కృతిక కార్యక్రమాలు,యోగ వంటి అంశాలపై విద్యార్థులకు ప్రత్యేక శిక్షణ ఇస్తున్నామన్నారు.సీనియర్ విద్యార్థులు జూనియర్ విద్యార్థులకు ప్రేరణగా నిలవాలన్నారు.చెడు వ్యసనాలకు దూరంగా ఉండి ఉపాధ్యాయులు బోధించే పాఠాలను చక్కగా అలవర్చుకొని,తల్లిదండ్రులు సూచనలు పాటించి బంగారు భవిష్యత్తుకు బాటలు వేసుకోవాలని సూచించారు.అదేవిధంగా మంచి ఫలితాలు సాధించి పాఠశాలకు,తల్లిదండ్రులకు మంచి పేరు తీసుకురావాలన్నారు.గత 25 సంవత్సరాలుగా తమ పాఠశాలలో చదువుకున్న ఎంతోమంది విద్యార్థులు ఉన్నత స్థానాల్లో స్థిరపడడం గర్వంగా ఉందన్నారు.మా సుదీర్ఘ ప్రయాణంలో పాఠశాల అభివృద్ధికి సహకరిస్తున్న తల్లిదండ్రులకు,కృషి చేస్తున్న ఉపాధ్యాయినీ,ఉపాధ్యాయులకు పేరుపేరునా కృతజ్ఞతలు తెలియజేస్తున్నామన్నారు.అనంతరం విద్యార్థినీ,విద్యార్థులచే ప్రదర్శించబడిన సాంస్కృతిక కార్యక్రమాలు ఉర్రూతలూగించాయి.సహదేవ రెడ్డి,రజనిలు అద్భుత నృత్యంతో విద్యార్థుల్లో ఉత్తేజాన్ని నింపారు.ఈ కార్యక్రమంలో పాఠశాల విద్యార్థిని,విద్యార్థులు తల్లిదండ్రులు పాల్గొన్నారు.

B.MANI KUMAR

Reporter

Namitha News

మరిన్ని వార్తలు

Copyright © Namitha News 2026. All right Reserved.



Developed By :