నమిత న్యూస్ - Andhra Pradesh / Annamayya : మదనపల్లి - మే 18 : మదనపల్లె సమీపంలోని అంగళ్ళు వద్ద గల మిట్స్ డీమ్డ్ టు బి యూనివర్సిటీ నందు ఎం.సి.ఏ. ద్వితీయ సంవత్సరం చదువుతున్న విద్యార్థులకు సీతారాం జిందాల్ ఫౌండేషన్, బెంగుళూరు వారి స్కాలర్‌షిప్ పథకం ద్వారా ఉపకారవేతనాలు లభించాయని వైస్ ఛాన్సల్లర్ డాక్టర్ సి యువరాజ్ తెలిపారు. ఈ పథకం ద్వారా ఎంపికైన 42 మందిలో 17మందికి 51వేల రూపాయలు మరియు 25 మంది విద్యార్థులకు 33వేల రూపాయలు చొప్పున మొత్తం 16,92,000 /- అక్షరాలా పదహారు లక్షల తొంభై రెండువేల రూపాయలు స్కాలర్‌షిప్ పొందడం గర్వకారణం అని అన్నారు. మంచి మార్కులు మరియు ఆర్థికంగా వెనుక బడిన విద్యార్థులకు ఈ పథకం ద్వారా ఉపకారవేతనాలు లభించాయని తెలిపారు. ఉపకారవేతనాలు పొందిన విద్యార్థులను మిట్స్ ఫౌండర్ అండ్ ఛాన్సల్లర్ డాక్టర్ యెన్ విజయ భాస్కర్ చౌదరి, ప్రో- ఛాన్సల్లర్ యన్ ద్వారకానాథ్, ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ కీర్తి నాదెళ్ళ, వైస్ ఛాన్సల్లర్ డాక్టర్ సి యువరాజ్, సీనియర్ మేనేజర్-స్టూడెంట్ అఫైర్స్ డాక్టర్ అథాహర్ సమీనా, సురేష్ మరియు అధ్యాపకులు అభినందనలు తెలియజేశారు
Reporter
Namitha News