Saturday, 12 September 2026 07:22:13 PM
# వినాయక చవితి పండుగ నేపథ్యంలో సోమవారం గ్రీవెన్స్ రద్దు - జిల్లా ఎస్పీ ధీరజ్ కునుబిల్లి # మట్టి వినాయక విగ్రహాలను పూజిద్దాం - సబ్ కలెక్టర్ చల్లా కల్యాణి # ట్రాక్టర్ ఢీకొని ఇద్దరికి తీవ్ర గాయాలు # తంబళ్లపల్లె సమస్యల పై అధికారులు దృష్టి సారించండి-ప్రజా దర్బార్ లో మాజీ ఎమ్మెల్యే జి శంకర్ యాదవ్ # ప్రజల సమస్యల పరిష్కారానికి ఐకమత్యంతో పనిచేయండి - మాజీ ఎమ్మెల్యే జి.శంకర్ యాదవ్ # మిట్స్ లో హెచ్‌ఆర్ కెరీర్స్ & ఏఐ ఆధారిత డిజిటల్ మార్కెటింగ్ ట్రెండ్స్ పై అతిధి ఉపన్యాస # వినాయక మండపాల నిర్వహణ పై సూచనలు -- డి.ఎస్పీ. బుచ్చిరాజు # ఎంపీ మిథున్ రెడ్డిపై ఉప్పొంగిన అభిమానం - యువనేత హర్షవర్ధన్ రెడ్డి ఆధ్వర్యంలో సేవా కార్యక్రమాలు # పఠాన్ ఖాదర్ ఖాన్ సేవలు స్ఫూర్తిదాయకం - టిడిపి రాష్ట్ర కార్యదర్శి పచ్చిపాల తులసి రామకృష్ణ హర్షం # మంచి చేయడమే కానీ మోసం చేయడం తనకు తెలియదు # ప్రజా శ్రేయస్సుకై పరితపించే నేత ఎంపీ మిథున్ రెడ్డి - వైకాపా రాష్ట్ర కార్యదర్శి ఎస్.ఏ కరీముల్లా ప్రశంసలు # రాష్ట్రంలో తీవ్ర కరువు ను కేంద్ర విపత్తుగా పరిగణిస్తూ కరువు ప్యాకేజీని ప్రకటించాలి - BKMU జిల్లా కార్యదర్శి తోపు కృష్ణప్ప # హ్యూమన్ రైట్స్ ముసుగు లో ఘరానా మోసాలు # విబిజి రాంజీ నీటి సంరక్షణ లో సప్లై చానల్స్ ఆదర్శవంతం - డ్వామా పీడీ వెంకటరత్నం # వీధిలైట్లు లేక అంధకారంలో కొటాల # ప్రకృతి సేద్యంలో నాలుగు పంటలతో నాలుగు రకాల ఆదాయం # ఏ.ఆర్ మొబైల్స్ వారి ఆకర్షణీమైన పండుగ ఆఫర్లు # మారుమూల గ్రామాల్లో ఎయిడ్స్ పై అవగాహన పెంచాలి - ఎంపీడీవో ఉషారాణి. # సిబిఎన్ చీకటి రోజులు దూరమై మూడేళ్ల # సాంకేతిక పరిజ్ఞానంతో నేరస్థుల ఆటకట్టిస్తున్న జిల్లా పోలీసులు -

మిట్స్ డీమ్డ్ టు బీ యూనివర్సిటీ లో అవుట్‌ కమ్ బేస్డ్ ఎడ్యుకేషన్ పై జాతీయ వర్క్ షాప్

Date : 05 December 2025 08:51 PM Views : 186

నమిత న్యూస్ - Andhra Pradesh / Annamayya : మదనపల్లె సమీపంలోని మిట్స్ డీమ్డ్ టు బీ యూనివర్సిటీ నందు ప్రభుత్వ మరియు ప్రైవేట్ పాలిటెక్నిక్ కాలేజీల అధ్యాపకుల కోసం “అవుట్‌కమ్ బేస్డ్ ఎడ్యుకేషన్ (OBE)” పై రెండు రోజుల జాతీయ స్థాయి వర్క్‌షాప్‌ ను యూనివర్సిటీ వైస్ ఛాన్సలర్ డాక్టర్ సి యువరాజ్, రిజిస్ట్రార్ డాక్టర్ డి.ప్రదీప్ కుమార్, ప్రిన్సిపాల్ డాక్టర్ పి.రామనాథన్ మరియు పాలిటెక్నిక్ అధ్యాపకులు జ్యోతి ప్రజ్వలనతో కార్యక్రమాన్ని ప్రారంభించారు. కార్యక్రమంలో డాక్టర్ సి.యువరాజ్ మాట్లాడుతూ పాలిటెక్నిక్ కళాశాలల విద్యా నాణ్యతను పెంపొందించడంలో ఎన్.బి.ఏ మరియు న్యాక్ గుర్తింపు ఎంతో కీలకమని, ఎన్.బి.ఏ ప్రధానంగా టెక్నికల్ ప్రోగ్రామ్‌లకు అక్క్రిడిటేషన్ ఇస్తూ, కోర్సులు అవుట్‌కమ్ బేస్డ్ ఎడ్యుకేషన్ విధానంలో నడుస్తున్నాయా అనే అంశంపై దృష్టి పెడుతుంది అని అన్నారు. న్యాక్ గుర్తింపు మాత్రం మొత్తం సంస్థ పనితీరును అంచనా వేసి, పాఠ్య ప్రణాళిక, బోధన-అభ్యాసం, పరిశోధన, మౌలిక వసతులు, విద్యార్థి సేవలు వంటి అంశాలను పరిశీలించి రేటింగ్ ఇవ్వడం ద్వారా అక్క్రిడిటేషన్ పొందిన కళాశాలలకు పరిశ్రమలతో అనుబంధం పెరగడం, ఉద్యోగావకాశాలు మెరుగు పడడం, ప్రభుత్వ నిధులు పొందే అవకాశం పెరగడం వంటి ప్రయోజనాలు లభిస్తాయని అన్నారు. కార్యక్రమంలో డాక్టర్ ప్రదీప్ కుమార్ మాట్లాడుతూ అధ్యాపకులు పాఠాలు బోధించడమే కాకుండా విద్యార్థులు ఎంతవరకు అర్థం చేసుకున్నారో తెలియడం ద్వారా బోధనా నాణ్యతను మెరుగుపరుచుకోవచ్చని అన్నారు. కార్యక్రమంలో పాల్గొన్న అధ్యాపకులకు బోధనా విధానాల్లో నూతన ఆవిష్కరణలు, విద్యార్థుల నేర్పుదల పద్ధతులు, కోర్స్ అవుట్‌కమ్, ప్రోగ్రామ్ అవుట్‌కమ్ రూపకల్పన, అకడమిక్ అక్వాలిటీ మెరుగుదల వంటి అంశాలపై వివరించారు. కార్యక్రమంలో వివిధ రాష్ట్రాల ప్రభుత్వ మరియు ప్రైవేట్ కళాశాలల నుండి 80 మందికి పైగా అధ్యాపకులు పాల్గొన్నారు.

Sri Hari B

Reporter

Namitha News

మరిన్ని వార్తలు

Copyright © Namitha News 2026. All right Reserved.



Developed By :