Monday, 14 September 2026 08:01:04 PM
# బిజెపి సీనియర్ నాయకుడు శ్రీనాథ్ రెడ్డి మృతి పార్టీకి తీరని లోటు # అన్నగారిన వర్గాల అభ్యున్నతికి బిజెపి తోనే సాధ్యం - బిజెపి జాతీయ కో కన్వీనర్ విష్ణువర్ధన్ రెడ్డి. # మట్టి వినాయక ప్రతిమలే పర్యావరణానికి శ్రేయస్కరం - వాసవి క్లబ్ అధ్యక్షులు వివి కృష్ణారావు # వినాయక చవితి వేళ ప్రతి ఇంట ఆనందం వెల్లివిరియాలి - కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత ఎస్.రెడ్డి సాహెబ్ ఆకాంక్ష # పర్యావరణ ప్రేమికుడు పఠాన్ ఖాదర్ ఖాన్ - టిడిపి రాష్ట్ర కార్యదర్శి పచ్చిపాల తులసి,శ్రీరామ్ చినబాబు ప్రశంసలు # స్థానిక సంస్థల ఎన్నికల్లో చరిత్ర సృష్టిద్దాం - జనసేన శ్రేణులకు రాందాస్ చౌదరి పిలుపు # గణనాధుడి ఆశీస్సులతో రాష్ట్రం సుభిక్షంగా మారాలి - చంద్రబాబు పాలనలో ఏపీ సస్యశ్యామలం కావాలి - తెలుగుదేశం యువనేత నాగూర్ వలి ఆకాంక్ష # సర్వ విఘ్నాలు తొలగిపోయి జిల్లా సమగ్రాభివృద్ధి సాధించాలి - ప్రజలకు వినాయక చవితి శుభాకాంక్షలు తెలిపిన జిల్లా కలెక్టర్ # మిట్స్‌లో ఆకట్టుకున్న ఎకో బప్పా మోరియా 3.0 వేడుకలు - పర్యావరణ ఆవశ్యకతను తెలియజేసిన విద్యార్థులు # టిడిపిలో డైనమిక్ లీడర్ ఎమ్మెల్యే కిషోర్ కుమార్ రెడ్డి - తెలుగుదేశం సీనియర్ నేత ఆర్.జె వెంకటేష్ # మిట్స్‌లో ‘ఎకో బప్పా మోరియా 3.0’ వినాయక చవితి వేడుకలు. # మట్టి వినాయక విగ్రహాలు, మొక్కల పంపిణీ # వివాహా నిశ్చితార్థ వేడుకల్లో శ్రీరామ్ చినబాబు # పుంగనూరు లో అసూరి బాలాజీ ఆధ్వర్యంలో ఘనంగా మాజీ సీఎం నల్లారి కిరణ్ కుమార్ రెడ్డి బ్రదర్స్ లకు జన్మదిన వేడుకలు # తక్షణమే స్పందించి ఆత్మహత్య చేసుకోవాలి అనుకొన్న యువతి ని కాపాడిన పోలీసులు # జాతీయ లోక్అదాలతో 71 కేసులు పరిష్కారం # తంబళ్లపల్లెలో 'విఘ్నం'లఘు చిత్రం ప్రారంభం # వినాయక చవితి పండుగ నేపథ్యంలో సోమవారం గ్రీవెన్స్ రద్దు - జిల్లా ఎస్పీ ధీరజ్ కునుబిల్లి # మట్టి వినాయక విగ్రహాలను పూజిద్దాం - సబ్ కలెక్టర్ చల్లా కల్యాణి # ట్రాక్టర్ ఢీకొని ఇద్దరికి తీవ్ర గాయాలు

పేదల పొట్టకొడితే సహించేది లేదు - ఏపీ వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా ఉపాధ్యక్షులు శ్రీనివాసులు

ఉపాధి హామీ నిధుల కోతకు వ్యతిరేకంగా ఎంపీడీఓ కార్యాలయం ముందు ఆందోళన

Date : 01 June 2026 10:56 PM Views : 115

నమిత న్యూస్ - Andhra Pradesh / Annamayya : మదనపల్లి - జూన్కేం 01 : కేంద్రం లోని బీజేపీ, రాష్ట్రంలోని కూటమి ప్రభుత్వాలు మహాత్మా గాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకానికి భారీగా నిధులు తగ్గించి, గ్రామీణ పేద కార్మికుల పొట్టకొడుతున్నాయని ఆంధ్రప్రదేశ్ వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా ఉపాధ్యక్షులు పి.శ్రీనివాసులు తీవ్రంగా ధ్వజమెత్తారు. నిధుల కోతను నిరసిస్తూ, ఫేస్ యాప్ విధానాన్ని తక్షణమే రద్దు చేయాలని డిమాండ్ చేస్తూ బుధవారం ఏపీ వ్యవసాయ కార్మిక సంఘం ఆధ్వర్యంలో మదనపల్లి మండల పరిషత్ అభివృద్ధి అధికారి కార్యాలయం ముందు ఉపాధి హామీ కూలీలతో కలిసి ధర్నా నిర్వహించారు. అనంతరం ఎంపీడీఓ కార్యాలయం సూపరింటెండెంట్ కు వినతిపత్రం అందజేశారు. ఈ ధర్నాను ఉద్దేశించి జిల్లా ఉపాధ్యక్షులు పి.శ్రీనివాసులు మాట్లాడుతూ, గత 20 ఏళ్ల ఉపాధి హామీ చట్ట చరిత్రలో ఎన్నడూ లేని విధంగా ఈ ఏడాది ఉపాధి హామీ నిధులకు అత్యంత దారుణంగా కోత విధించారని మండిపడ్డారు. ప్రతి సంవత్సరం సుమారు రూ. 9,346 కోట్ల నుండి రూ. 10,648 కోట్లు కేటాయించే స్థానంలో, ఈ ఏడాది కేవలం రూ. 738 కోట్లకే పరిమితం చేసి పేదలకు తీవ్ర ద్రోహం చేశారని విమర్శించారు. గతంలో జిల్లాకు లక్ష కుటుంబాలకు పని కల్పిస్తే, ఈ నిధుల కోత వల్ల ఇప్పుడు జిల్లాకు కేవలం 9,461 కుటుంబాలకు మాత్రమే పని దొరికే దుస్థితి ఏర్పడిందన్నారు. అంటే గతంలో ఒక మండలానికి కేటాయించిన నిధులు కూడా నేడు జిల్లా మొత్తానికి ఇవ్వకపోవడం కూటమి ప్రభుత్వాల దుర్మార్గానికి అద్దం పడుతోందని ఆగ్రహం వ్యక్తం చేశారు. సరికొత్తగా తెచ్చిన ‘ఫేస్ యాప్’ (Face App) విధానం గ్రామీణ కూలీలకు శాపంగా మారిందని, ఇంటర్నెట్ సిగ్నల్ సరిగ్గా లేకపోవడం, గంటల తరబడి హాజరు నమోదు కాకపోవడంతో వేలాది మంది కార్మికులు పని ప్రదేశాల నుండి ఉసూరుమంటూ వెనుతిరుగుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. కేంద్రం 60 శాతం నిధులు ఇస్తామని చెప్పినా, రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు తన వాటాగా ఇవ్వాల్సిన రూ. 4,000 కోట్లు మా దగ్గర లేవని చెప్పడంతో పేదలకు నిధులు అందకుండా పోయాయని విమర్శించారు. వ్యవసాయ పనులు లేని ఈ వేసవి కాలంలో కూలీలకు పనులు కల్పించకపోవడం వల్ల గ్రామాల్లో ప్రజలు బ్రతుకలేక పట్టణాలకు వలసలు పోతున్నారని ఆందోళన వ్యక్తం చేశారు. ఇప్పటికైనా ప్రభుత్వం కళ్లు తెరిచి పాత పద్ధతిలోనే నిధులు కేటాయించి, ప్రతి కుటుంబానికి 125 రోజుల పని దినాలు గ్యారెంటీగా కల్పించాలని, లేనిపక్షంలో ఉద్యమాన్ని మరింత ఉధృతం చేస్తామని హెచ్చరించారు. ఉపాధి హామీ పథకానికి మన రాష్ట్రానికి తక్షణమే రూ. 10,000 కోట్ల నిధులు కేటాయించాలని, కూలీల ఉపాధిని దెబ్బతీస్తున్న ఫేస్ యాప్ విధానాన్ని మరియు రెండు పూటల పని పద్ధతిని పూర్తిగా రద్దు చేయాలని, ప్రతి కుటుంబానికి 200 రోజులు పని కల్పించాలని, కనీస వేతనాన్ని రూ. 700 లకు పెంచాలని, కూలీలకు పెండింగ్‌లో ఉన్న వేతన బకాయిలను విడుదల చేయాలి. పని ప్రదేశాలలో తాగునీరు, నీడ వంటి కనీస వసతులు ఏర్పాటు చేయాలను, పనిముట్లు ఇవ్వాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో వ్యవసాయ కార్మిక సంఘం నాయకులు నాగరాజు, శ్రీనివాసులు, నారాయణ, అనురాధ సంఖ్యలో గ్రామీణ మహిళలు, కూలీలు మరియు వ్యవసాయ కార్మికులు పాల్గొన్నారు

SREEVANI

Reporter

Namitha News

మరిన్ని వార్తలు

Copyright © Namitha News 2026. All right Reserved.



Developed By :