Monday, 14 September 2026 08:00:52 PM
# బిజెపి సీనియర్ నాయకుడు శ్రీనాథ్ రెడ్డి మృతి పార్టీకి తీరని లోటు # అన్నగారిన వర్గాల అభ్యున్నతికి బిజెపి తోనే సాధ్యం - బిజెపి జాతీయ కో కన్వీనర్ విష్ణువర్ధన్ రెడ్డి. # మట్టి వినాయక ప్రతిమలే పర్యావరణానికి శ్రేయస్కరం - వాసవి క్లబ్ అధ్యక్షులు వివి కృష్ణారావు # వినాయక చవితి వేళ ప్రతి ఇంట ఆనందం వెల్లివిరియాలి - కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత ఎస్.రెడ్డి సాహెబ్ ఆకాంక్ష # పర్యావరణ ప్రేమికుడు పఠాన్ ఖాదర్ ఖాన్ - టిడిపి రాష్ట్ర కార్యదర్శి పచ్చిపాల తులసి,శ్రీరామ్ చినబాబు ప్రశంసలు # స్థానిక సంస్థల ఎన్నికల్లో చరిత్ర సృష్టిద్దాం - జనసేన శ్రేణులకు రాందాస్ చౌదరి పిలుపు # గణనాధుడి ఆశీస్సులతో రాష్ట్రం సుభిక్షంగా మారాలి - చంద్రబాబు పాలనలో ఏపీ సస్యశ్యామలం కావాలి - తెలుగుదేశం యువనేత నాగూర్ వలి ఆకాంక్ష # సర్వ విఘ్నాలు తొలగిపోయి జిల్లా సమగ్రాభివృద్ధి సాధించాలి - ప్రజలకు వినాయక చవితి శుభాకాంక్షలు తెలిపిన జిల్లా కలెక్టర్ # మిట్స్‌లో ఆకట్టుకున్న ఎకో బప్పా మోరియా 3.0 వేడుకలు - పర్యావరణ ఆవశ్యకతను తెలియజేసిన విద్యార్థులు # టిడిపిలో డైనమిక్ లీడర్ ఎమ్మెల్యే కిషోర్ కుమార్ రెడ్డి - తెలుగుదేశం సీనియర్ నేత ఆర్.జె వెంకటేష్ # మిట్స్‌లో ‘ఎకో బప్పా మోరియా 3.0’ వినాయక చవితి వేడుకలు. # మట్టి వినాయక విగ్రహాలు, మొక్కల పంపిణీ # వివాహా నిశ్చితార్థ వేడుకల్లో శ్రీరామ్ చినబాబు # పుంగనూరు లో అసూరి బాలాజీ ఆధ్వర్యంలో ఘనంగా మాజీ సీఎం నల్లారి కిరణ్ కుమార్ రెడ్డి బ్రదర్స్ లకు జన్మదిన వేడుకలు # తక్షణమే స్పందించి ఆత్మహత్య చేసుకోవాలి అనుకొన్న యువతి ని కాపాడిన పోలీసులు # జాతీయ లోక్అదాలతో 71 కేసులు పరిష్కారం # తంబళ్లపల్లెలో 'విఘ్నం'లఘు చిత్రం ప్రారంభం # వినాయక చవితి పండుగ నేపథ్యంలో సోమవారం గ్రీవెన్స్ రద్దు - జిల్లా ఎస్పీ ధీరజ్ కునుబిల్లి # మట్టి వినాయక విగ్రహాలను పూజిద్దాం - సబ్ కలెక్టర్ చల్లా కల్యాణి # ట్రాక్టర్ ఢీకొని ఇద్దరికి తీవ్ర గాయాలు

మిట్స్ లో ఘనంగా అల్యూమ్ని మీట్

Date : 25 June 2026 05:38 PM Views : 145

నమిత న్యూస్ - Andhra Pradesh / Annamayya : మదనపల్లి - జూన్ 25 : మదనపల్లి సమీపంలోని అంగళ్ళు వద్ద నున్న మిట్స్ డీమ్డ్ టు బి యూనివర్సిటీలోని స్కూల్ ఆఫ్ మేనేజ్‌మెంట్ స్టడీస్ (ఎం.బి.ఏ) విభాగం ఆధ్వర్యంలో, మిట్స్ అల్యూమ్ని రిలేషన్స్ సెల్ సహకారంతో అల్యూమ్ని మీట్ కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన రిజిస్ట్రార్ డాక్టర్ డి. ప్రదీప్ కుమార్ మాట్లాడుతూ, విద్యాసంస్థల అభివృద్ధి, ప్రతిష్ఠ మరియు సమాజంలో వాటి గుర్తింపును పెంపొందించడంలో పూర్వ విద్యార్థులు కీలక పాత్ర పోషిస్తారని అన్నారు. అల్యూమ్ని నెట్‌వర్క్ ద్వారా ప్రస్తుత విద్యార్థులకు పరిశ్రమల అవసరాలపై అవగాహన, కెరీర్ మార్గదర్శకత్వం, ఇంటర్న్‌షిప్‌లు మరియు ఉపాధి అవకాశాలు మరింత విస్తృతంగా లభిస్తాయని పేర్కొన్నారు. ప్రిన్సిపాల్ డాక్టర్ పి. రామనాథన్ మాట్లాడుతూ, పూర్వ విద్యార్థుల విజయాలే విద్యాసంస్థలకు నిజమైన గుర్తింపని పేర్కొన్నారు. విద్యార్థులు విద్యా ప్రతిభతో పాటు కమ్యూనికేషన్, నాయకత్వ లక్షణాలు, సమస్య పరిష్కార నైపుణ్యాలను కూడా పెంపొందించుకుని పరిశ్రమల అవసరాలకు అనుగుణంగా తమను తాము తీర్చిదిద్దుకోవాలని సూచించారు. స్కూల్ ఆఫ్ మేనేజ్‌మెంట్ స్టడీస్ డీన్ డాక్టర్ భానుశ్రీ రెడ్డి మాట్లాడుతూ, విద్యాసంస్థ మరియు పూర్వ విద్యార్థుల మధ్య బలమైన అనుబంధం సంస్థ అభివృద్ధికి బలమైన పునాదిగా నిలుస్తుందని తెలిపారు. పరిశ్రమల అవసరాలకు అనుగుణంగా విద్యార్థులను తీర్చిదిద్దడంలో పూర్వ విద్యార్థుల భాగస్వామ్యం ఎంతో ఉపయోగకరమని పేర్కొన్నారు. అల్యూమ్ని రిలేషన్స్ ఆఫీసర్ డాక్టర్ జి. నాగశ్వేత మాట్లాడుతూ, పూర్వ విద్యార్థులు మెంటరింగ్, గెస్ట్ లెక్చర్లు, ఇంటర్న్‌షిప్‌లు, ప్లేస్‌మెంట్లు, పరిశ్రమల అనుసంధాన కార్యక్రమాలు మరియు కెరీర్ మార్గదర్శకత్వంలో చురుకుగా పాల్గొని తమ అనుభవాలను విద్యార్థులతో పంచుకోవాలని కోరారు. అల్యూమ్ని నెట్‌వర్క్‌ను మరింత బలోపేతం చేసి విద్యార్థుల వృత్తి అభివృద్ధికి తోడ్పడాలని పిలుపునిచ్చారు. ఈ సందర్భంగా పూర్వ విద్యార్థులు జి. అనిల్ దత్, దుర్గా చప్పల, అజయ్ నక్కల, శ్రవంతి. ఎస్ లు తమ వృత్తి ప్రయాణంలో ఎదురైన అనుభవాలు, పరిశ్రమలలో ఉన్న అవకాశాలు, అవసరమైన నైపుణ్యాలు మరియు ఉద్యోగ రంగంలో విజయానికి అవసరమైన అంశాలపై విద్యార్థులకు విలువైన సూచనలు అందించారు. అలాగే భవిష్యత్తులో ఇంటర్న్‌షిప్‌లు, కెరీర్ మార్గదర్శకత్వం, పరిశ్రమల పరిచయాలు మరియు ప్లేస్‌మెంట్ అవకాశాల కల్పనలో తమవంతు సహకారం అందిస్తామని హామీ ఇచ్చారు. కార్యక్రమంలో విద్యార్థుల ఉపాధి అవకాశాలు, పరిశ్రమల అవసరాలకు అనుగుణమైన నైపుణ్యాభివృద్ధి, మెంటరింగ్ కార్యక్రమాలు మరియు భవిష్యత్ సహకార అవకాశాలపై విస్తృతంగా చర్చించారు. 2007 నుండి 2025 వరకు వివిధ బ్యాచ్‌లకు చెందిన పూర్వ విద్యార్థులు ఈ సమావేశంలో పాల్గొని తమ విద్యా జీవితంలోని మధుర స్మృతులను గుర్తు చేసుకుంటూ, ప్రస్తుత విద్యార్థులతో తమ అనుభవాలను పంచుకున్నారు. ఈ కార్యక్రమంలో రిజిస్ట్రార్ డాక్టర్ డి. ప్రదీప్ కుమార్, ప్రిన్సిపాల్ డాక్టర్ పి. రామనాథన్, స్కూల్ ఆఫ్ మేనేజ్‌మెంట్ స్టడీస్ డీన్ డాక్టర్ భానుశ్రీ రెడ్డి, అల్యూమ్ని రిలేషన్స్ ఆఫీసర్ డాక్టర్ జి. నాగశ్వేత, కోఆర్డినేటర్ డాక్టర్ కె. వెంకటేశ్వర్లు, అధ్యాపకులు, పూర్వ విద్యార్థులు మరియు విద్యార్థులు పాల్గొన్నారు

SREEVANI

Reporter

Namitha News

మరిన్ని వార్తలు

Copyright © Namitha News 2026. All right Reserved.



Developed By :