Sunday, 13 September 2026 11:05:01 PM
# మిట్స్‌లో ‘ఎకో బప్పా మోరియా 3.0’ వినాయక చవితి వేడుకలు. # మట్టి వినాయక విగ్రహాలు, మొక్కల పంపిణీ # వివాహా నిశ్చితార్థ వేడుకల్లో శ్రీరామ్ చినబాబు # పుంగనూరు లో అసూరి బాలాజీ ఆధ్వర్యంలో ఘనంగా మాజీ సీఎం నల్లారి కిరణ్ కుమార్ రెడ్డి బ్రదర్స్ లకు జన్మదిన వేడుకలు # తక్షణమే స్పందించి ఆత్మహత్య చేసుకోవాలి అనుకొన్న యువతి ని కాపాడిన పోలీసులు # జాతీయ లోక్అదాలతో 71 కేసులు పరిష్కారం # తంబళ్లపల్లెలో 'విఘ్నం'లఘు చిత్రం ప్రారంభం # వినాయక చవితి పండుగ నేపథ్యంలో సోమవారం గ్రీవెన్స్ రద్దు - జిల్లా ఎస్పీ ధీరజ్ కునుబిల్లి # మట్టి వినాయక విగ్రహాలను పూజిద్దాం - సబ్ కలెక్టర్ చల్లా కల్యాణి # ట్రాక్టర్ ఢీకొని ఇద్దరికి తీవ్ర గాయాలు # తంబళ్లపల్లె సమస్యల పై అధికారులు దృష్టి సారించండి-ప్రజా దర్బార్ లో మాజీ ఎమ్మెల్యే జి శంకర్ యాదవ్ # ప్రజల సమస్యల పరిష్కారానికి ఐకమత్యంతో పనిచేయండి - మాజీ ఎమ్మెల్యే జి.శంకర్ యాదవ్ # మిట్స్ లో హెచ్‌ఆర్ కెరీర్స్ & ఏఐ ఆధారిత డిజిటల్ మార్కెటింగ్ ట్రెండ్స్ పై అతిధి ఉపన్యాస # వినాయక మండపాల నిర్వహణ పై సూచనలు -- డి.ఎస్పీ. బుచ్చిరాజు # ఎంపీ మిథున్ రెడ్డిపై ఉప్పొంగిన అభిమానం - యువనేత హర్షవర్ధన్ రెడ్డి ఆధ్వర్యంలో సేవా కార్యక్రమాలు # పఠాన్ ఖాదర్ ఖాన్ సేవలు స్ఫూర్తిదాయకం - టిడిపి రాష్ట్ర కార్యదర్శి పచ్చిపాల తులసి రామకృష్ణ హర్షం # మంచి చేయడమే కానీ మోసం చేయడం తనకు తెలియదు # ప్రజా శ్రేయస్సుకై పరితపించే నేత ఎంపీ మిథున్ రెడ్డి - వైకాపా రాష్ట్ర కార్యదర్శి ఎస్.ఏ కరీముల్లా ప్రశంసలు # రాష్ట్రంలో తీవ్ర కరువు ను కేంద్ర విపత్తుగా పరిగణిస్తూ కరువు ప్యాకేజీని ప్రకటించాలి - BKMU జిల్లా కార్యదర్శి తోపు కృష్ణప్ప # హ్యూమన్ రైట్స్ ముసుగు లో ఘరానా మోసాలు

మిట్స్ డీమ్డ్ యూనివర్సిటీ లో ఆపర్చునిటీస్ అండ్ ఛాలెంజెస్ ఫర్ యంగ్ మైండ్స్ పై అవగాహన

ముఖ్య అతిధిగా హైదరాబాద్ యూనివర్సిటీ అసిస్టెంట్ ప్రొఫెసర్ కృష్ణారెడ్డి చిట్టెడి

Date : 11 December 2025 06:31 PM Views : 234

నమిత న్యూస్ - Andhra Pradesh / Annamayya : మదనపల్లె - డిసెంబర్ 11 : అంగళ్ళు సమీపంలో గల మిట్స్ డీమ్డ్ టు బీ యూనివర్సిటీ నందు స్కూల్ ఆఫ్ మేనేజ్మెంట్ విభాగం వారు ఎంట్రప్రెన్యూర్ షిప్ ఇన్ ఇండియా ఆపర్చునిటీస్ అండ్ ఛాలెంజెస్ ఫర్ యంగ్ మైండ్స్ అనే అంశంపై అతిధి ఉపన్యాస కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిధిగా హైదరాబాద్ యూనివర్సిటీ లో స్కూల్ ఆఫ్ ఎకనామిక్స్ విభాగం నందు అసోసియేట్ ప్రొఫెసర్ గా పనిచేస్తున్న డాక్టర్ క్రిష్ణారెడ్డి చిట్టెడి పాల్గొన్నారు. కార్యక్రమం లో ఆయన మాట్లాడుతూ ఒక వ్యక్తి పారిశ్రామిక వేత్తగా ఎదగడానికి ఉన్న మెళకువలను మరియు ప్రాముఖ్యతను వివరించారు. టెక్నాలజీ పురోగతి, డిజిటల్ సేవలు, ఈ-కామర్స్, ఫిన్‌టెక్, కృత్రిమ మేధస్సు , ఇంటర్నెట్ ఆఫ్ థింగ్స్ వంటి రంగాల్లో కొత్త వ్యాపారాలు స్థాపించేందుకు విస్తృత అవకాశాలు పెరుగుతున్నాయని అన్నారు . భారతదేశంలో యువ పారిశ్రామిక వేత్తలకు లభిస్తున్న అవకాశాలు, స్టార్టప్ ఎకోసిస్టమ్‌లో ఉన్న వనరులు, ప్రభుత్వ ప్రోత్సాహక పధకాలు, డిజిటల్ యుగంలో వచ్చే కొత్త వ్యాపార మార్గాలు గురించి సమగ్రంగా వివరించారు. అలాగే యువత ఎదుర్కొనే సవాళ్లు, మార్కెట్ పోటీ, ఆర్థిక వనరుల సమీకరణ, సాంకేతిక పరిజ్ఞానం వినియోగం, రిస్క్ మేనేజ్‌మెంట్ వంటి అంశాలపై విలువైన సూచనలు అందించారు. పరిశ్రమలను అభివృద్ధి చేయడానికి రాష్ట్ర మరియు కేంద్ర ప్రభుత్వాలు ఎంతో సహాయ సహకారాలను అందిస్తున్నాయని, వాటిని విద్యార్థులు ఏవిధంగా అందిపుచ్చుకోవాలో తెలియజేశారు. ఇప్పటికే ప్రభుత్వ మరియు ప్రైవేట్ విశ్వవిద్యాలయాలలో అందుబాటులో ఉన్న NBMSME , KVIC , NSIC , NSIEDB వంటి పథకాల గురుంచి తెలియజేశారు. విద్యార్థులకు ఎన్నో ఆలోచనలు ఉంటాయని, ఆ ఆలోచనల నుండి వాస్తవికతకి ఎలా తీసుకెళ్లాలో ముందుగా తెలుసుకోవాలని ఆయన అన్నారు. దేశం ప్రగతి పధంలో ముందుకెళ్లాలంటే పరిశ్రమలను అభివృద్ధి చేయడం చాలా ముఖ్యమని తెలిపారు. కార్యక్రమం లో ప్రిన్సిపాల్ డాక్టర్ పి.రామనాథన్ , ప్రొఫెసర్ అండ్ డీన్ డాక్టర్ భాను శ్రీ రెడ్డి , కో ఆర్డినేటర్ కె ఎలియ్య మరియు విద్యార్థులు పాల్గొన్నారు.

Sri Hari B

Reporter

Namitha News

మరిన్ని వార్తలు

Copyright © Namitha News 2026. All right Reserved.



Developed By :