Wednesday, 29 July 2026 08:22:22 AM
# మదనపల్లి లో మానవీయ ఘటన # పంచాయతీల విద్యుత్ బిల్లులు చెల్లింపుకు సహకరించండి - విద్యుత్ ఏ .ఈ సురేంద్ర # కడ పల్లి లో ఘోర రోడ్డు ప్రమాదం, ముగ్గురు మృతి, 5 గురికి గాయాలు # మదనపల్లె డీఎస్పీ గా బాధ్యతలు చేపట్టిన బుచ్చిరాజు # "ఇంటింటికి తెలుగుదేశం" కార్యక్రమానికి ఘన శ్రీకారం చుట్టిన పల్లా శ్రీనివాసరావు # భవన నిర్మాణ కార్మికులు సంక్షేమ బోర్డు కార్డులు రెన్యువల్ చేసుకోండి # ఈవీఎం గోడౌన్ల వద్ద పటిష్టమైన భద్రత ఉండాలి - జిల్లా కలెక్టర్ నిశాంత్ కుమార్ # అన్నమయ్య జిల్లా ను వెంటనే కరవు జిల్లాగా ప్రకటించాలి – సిపిఐ # విజయవంతంగా వ్యవసాయ కార్మిక సంఘం సమావేశం # మల్లయ్య కొండలో వైభవంగా తొలి ఏకాదశి పూజలు # ఉపాధి హామీ లో కొబ్బరి మొక్కలు నాటుకోండి - ఎంపీడీవో ఉషారాణి # తొలి ఏకాదశి పూజ కార్యక్రమం లో పాల్గొన్న కార్ల మల్లికార్జు # ATM ను ఎత్తుకువెళ్లిన దొంగలు # ఉచిత ఎముకల శాంధ్రత పరీక్ష శిభిరం ను ప్రజలు సద్వినియోగం చేసుకోండి # విజవంతం గా మెగా పేటీఎం 4.ఓ సమావేశం.. # ప్రతి విద్యార్థిని ఉన్నతంగా తీర్చిదిద్దడమే ప్రభుత్వ ధ్యేయం # కుక్కరాజుపల్లి డంపింగ్ యార్డ్ ను తనిఖీ చేసిన ఎంపిడిఓ. # పెద్దేరు ప్రాజెక్టును సందర్శించిన హైడ్రాలజీ అధికారులు. # వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా సర్వసభ్య సమావేశాన్ని జయప్రదం చేయండి - జిల్లా కార్యదర్శి కృష్ణప్ప # ఆత్మకూరులో డాక్యుమెంట్ రైటర్స్ ఆందోళన

మూడు గ్రామాలలో పిచ్చికుక్క వీరంగం @ 22 పశువులకు తీవ్ర గాయాలు

ముమ్మరంగా పశువైద్య సేవలు

Date : 10 June 2026 10:48 PM Views : 76

నమిత న్యూస్ - Andhra Pradesh / Annamayya : తంబళ్లపల్లె - జూన్ 10 : పిచ్చి కుక్క వీరంగం సృష్టించి మూడు గ్రామాల ప్రజలు ముప్పు తిప్పలు పెట్టి గ్రామాలలోని 22 పశువులను గాయపరిచి సంచలనం సృష్టించి బెంబేలెత్తించిన సంఘటన కోసువారి పల్లి పంచాయతీలో వెలుగు చూసింది. పంచాయతీలోని దేవరబురుజు, సి కె దయ్యాలవారిపల్లి, మేకల వారి పల్లె గ్రామాలలో బుధవారం తెల్లవారుజామున ఓ పిచ్చి కుక్క వీరంగం సృష్టించి కనపడిన పశువులను విచక్షణ రహితంగా కరచి తీవ్రంగా గాయపరిచింది. తొలుత దేవరబురుజులో రెడ్డప్ప రెడ్డి కి చెందిన రెండు పశువులతో పాటు గ్రామంలో ఆరుబయట గల పలు పాడి ఆవులు, దూడలను గాయపరగా స్థానికులు తరిమికొట్టగా అదే ఊపులో పక్కనే గల సీ.కే దయ్యాలవారిపల్లి లో సైతం పలువురు రైతులకు చెందిన పాడియావులు దూడలను గాయపరిచి చివరిగా మేకల వారి పల్లెలో మరోసారి విజృంభించి పాడి పశువులను గాయపరిచింది. మొత్తంగా మూడు గ్రామాలలో 16 పాడి ఆవులు, ఆరు పాడి దూడలను గాయపరిచింది.విషయం తెలుసుకున్న గ్రామస్తులు మూకుమ్మడిగా పిచ్చి కుక్కను వెంటాడి చంపేశారు. పిచ్చికుక్క కాటుకు గురైన పశువుల రైతులు ఆందోళనతో లబోదిబోమంటూ పశువుల డాక్టర్ కు ఫోన్లో ఫిర్యాదు చేశారు. మండల పశువైద్యాధికారి విక్రం రెడ్డి యుద్ధ ప్రాతిపదికన పశు వైద్య సిబ్బందిని పై మూడు గ్రామాలకు పంపించి కుక్క కాటు పశువులకు ర్యాపిడ్ టీకాలను వేయడానికి పురమయించారు. పశు వైద్యాధికారి ఇందు, సిబ్బంది రమేష్, నాయక్ లు కుక్క కాటు బారిన పడిన పశువులకు ర్యాపిడ్ టీకాలు వేసి నెలరోజుల పాటు వర్షానికి తడవరాదని వైద్య సిబ్బంది సూచనలు, సలహాలు పాటించాలని రైతులకు సూచనలు ఇచ్చారు. కుక్క కాటు రైతులు లక్షలాది రూపాయల వ్యయంతో కొని వాటి పాల దిగుబడితో జీవనోపాధి సాగిస్తున్నామని పశువులకు ప్రాణాపాయం జరిగితే వాటినే నమ్ముకున్న మేము ఎలా బతకాలని రైతులు ఆందోళన చెందుతున్నారు. పిచ్చికుక్క పశువులపై పడటం జరిగిందని అదే చిన్నారులు, మనుషులపై విజృంభిస్తే పరిస్థితి ఏంటని తలచుకొని భయాందోళనలు వ్యక్తం చేస్తున్నారు. అధికారులు వెంటనే స్పందించి కుక్కల స్వైర విహారం పై దృష్టి సారించి కుక్క కాటు పశువుల రైతులను ఆదుకోవడానికి అండగా నిలవాలని స్థానిక ప్రజలు కోరుతున్నారు

SREEVANI

Reporter

Namitha News

మరిన్ని వార్తలు

Copyright © Namitha News 2026. All right Reserved.



Developed By :

A PHP Error was encountered

Severity: Core Warning

Message: Module 'igbinary' already loaded

Filename: Unknown

Line Number: 0

Backtrace: