Sunday, 13 September 2026 09:57:24 PM
# మిట్స్‌లో ‘ఎకో బప్పా మోరియా 3.0’ వినాయక చవితి వేడుకలు. # మట్టి వినాయక విగ్రహాలు, మొక్కల పంపిణీ # వివాహా నిశ్చితార్థ వేడుకల్లో శ్రీరామ్ చినబాబు # పుంగనూరు లో అసూరి బాలాజీ ఆధ్వర్యంలో ఘనంగా మాజీ సీఎం నల్లారి కిరణ్ కుమార్ రెడ్డి బ్రదర్స్ లకు జన్మదిన వేడుకలు # తక్షణమే స్పందించి ఆత్మహత్య చేసుకోవాలి అనుకొన్న యువతి ని కాపాడిన పోలీసులు # జాతీయ లోక్అదాలతో 71 కేసులు పరిష్కారం # తంబళ్లపల్లెలో 'విఘ్నం'లఘు చిత్రం ప్రారంభం # వినాయక చవితి పండుగ నేపథ్యంలో సోమవారం గ్రీవెన్స్ రద్దు - జిల్లా ఎస్పీ ధీరజ్ కునుబిల్లి # మట్టి వినాయక విగ్రహాలను పూజిద్దాం - సబ్ కలెక్టర్ చల్లా కల్యాణి # ట్రాక్టర్ ఢీకొని ఇద్దరికి తీవ్ర గాయాలు # తంబళ్లపల్లె సమస్యల పై అధికారులు దృష్టి సారించండి-ప్రజా దర్బార్ లో మాజీ ఎమ్మెల్యే జి శంకర్ యాదవ్ # ప్రజల సమస్యల పరిష్కారానికి ఐకమత్యంతో పనిచేయండి - మాజీ ఎమ్మెల్యే జి.శంకర్ యాదవ్ # మిట్స్ లో హెచ్‌ఆర్ కెరీర్స్ & ఏఐ ఆధారిత డిజిటల్ మార్కెటింగ్ ట్రెండ్స్ పై అతిధి ఉపన్యాస # వినాయక మండపాల నిర్వహణ పై సూచనలు -- డి.ఎస్పీ. బుచ్చిరాజు # ఎంపీ మిథున్ రెడ్డిపై ఉప్పొంగిన అభిమానం - యువనేత హర్షవర్ధన్ రెడ్డి ఆధ్వర్యంలో సేవా కార్యక్రమాలు # పఠాన్ ఖాదర్ ఖాన్ సేవలు స్ఫూర్తిదాయకం - టిడిపి రాష్ట్ర కార్యదర్శి పచ్చిపాల తులసి రామకృష్ణ హర్షం # మంచి చేయడమే కానీ మోసం చేయడం తనకు తెలియదు # ప్రజా శ్రేయస్సుకై పరితపించే నేత ఎంపీ మిథున్ రెడ్డి - వైకాపా రాష్ట్ర కార్యదర్శి ఎస్.ఏ కరీముల్లా ప్రశంసలు # రాష్ట్రంలో తీవ్ర కరువు ను కేంద్ర విపత్తుగా పరిగణిస్తూ కరువు ప్యాకేజీని ప్రకటించాలి - BKMU జిల్లా కార్యదర్శి తోపు కృష్ణప్ప # హ్యూమన్ రైట్స్ ముసుగు లో ఘరానా మోసాలు

8 గంటల పని దినాన్ని కాపాడుకుందాం

ఘనంగా మే డే సంబరాలు

Date : 01 May 2026 11:18 AM Views : 436

నమిత న్యూస్ - Andhra Pradesh / Annamayya : . కొత్తకోట - మే 01 : నాలుగు లేబర్ కోర్టులను రద్దు చేయాలి అని అన్నమయ్య జిల్లా ఉప ప్రధాన కార్యదర్శి ఎస్ సలీం భాష రాష్ట్ర ప్రభుత్వం కేంద్ర ప్రభుత్వం తక్షణమే రద్దు చేయాలని అన్నారు *140 ప్రపంచ కార్మిక దినోత్సవం మేడే ను తంబళృపల్లి నియోజకవర్గం బి .కొత్తకోట లో దిగువ బస్టాండ్ నందు ఏఐటీయూసీ జెండాను ఎగరవేసి మేడేను కార్మికులతో కలిసి ఘనంగా నిర్వహించుకున్నారు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా ఏఐటియుసి తంబళృపల్లి నియోజకవర్గం అధ్యక్షులు బి వేణుగోపాల్ రెడ్డి ఏఐటీయూసీ అన్నమయ్య జిల్లా ఉప ప్రధాన కార్యదర్శి ఎస్ సలీం భాష పాల్గొన్నారు వారు మాట్లాడుతూ కార్మికుల,పేదల పక్షాన నిలబడి వారి హక్కుల సాధనకై పాలకులను నిలదీసే బలమైన గొంతుక ఎర్ర జెండా అని "మేడే స్ఫూర్తితో కార్మిక చట్టాల పరిరక్షణకు ఉద్యమ కార్యాచరణ దిశగా జరుపుకోవాలని 1986లో అమెరికాలోని చికాగో నగరంలో ఎనిమిది గంటల పనివిధానంకోసం జరిగిన సమ్మె ఉద్యమంలో పాలకులు, అంతర్జాతీయ కార్మిక దినోత్సవం అని కూడా పిలుస్తారు. అమెరికాలో మాత్రం ప్రస్తుతం దీన్ని ‘లాయల్టీ డే’గా వ్యవహరిస్తున్నారు. చాలా దేశాల్లో మే డే ని సెలవు దినంగా పాటిస్తారు. ఈ కార్మిక దినోత్సవ ఆవిర్భావాన్ని ఏ ఒక్క దేశానికో, సంఘటనకో ముడిపెట్టలేం. కానీ 1886లో షికాగోలోని హే మార్కెట్‌లో జరిగిన కార్మికుల ప్రదర్శనే ఈ మేడే పుట్టుకకు పునాది వేసిందని కార్మికులకు ఎనిమిది గంటల పని విధానం గురించి నినదిస్తూ 1886, మే1న చాలామంది కార్మికులు పోరాటం చేపట్టారు. దానికి మద్దతుగా నాలుగు రోజుల తరవాత షికాగోలోని హే మార్కెట్‌లో చాలామంది ప్రదర్శన నిర్వహించారు. కానీ ఆ ప్రదర్శన ఉద్రిక్తంగా మారడంతో పోలీసులు జరిపిన కాల్పుల్లో కొందరు కార్మికులు చనిపోయారు.ఆ సంఘటన అనంతరం 1889 నుంచి 1890 వరకు అనేక దేశాల్లో కార్మికుల ఉద్యమాలూ, నిరసన ప్రదర్శనలూ చోటు చేసుకున్నాయి.1890, మే 1న బ్రిటన్‌లోని హైడ్ పార్క్‌లో చేపట్టిన ప్రదర్శనకు దాదాపు 3 లక్షల మంది కార్మికులు హాజరయ్యారు. రోజులో కేవలం 8 గంటలు మాత్రమే పనివేళలు ఉండాలన్నదే ఆ ప్రదర్శనలో పాల్గొన్న వారి ప్రధాన డిమాండ్.ఆ పైన అనేక యూరోపియన్ దేశాల్లో ఇదే నినాదంతో ప్రదర్శనలు జరిగాయి. క్రమంగా షికాగోలో జరిగిన కార్మిక ప్రదర్శనలో చనిపోయిన వారికి గుర్తుగా మే 1ని కార్మిక దినోత్సవంగా జరుపుకోవాలన్న ఒప్పందం కూడా కుదిరింది. ఆపై ప్రపంచవ్యాప్తంగా మే డే స్వరూపం మారుతూ వచ్చింది. అని అన్నారు ఈ కార్యక్రమంలో ఏఐటీయూసీ అనుబంధ సంఘాల నాయకులు రామాంజనేయులు గఫూర్ కే బాలకృష్ణ మహమ్మద్ మాలిక్ సలీం శివశంకర్ చౌడప్ప సీనియర్ నాయకులు నరసింహులు బాబు లక్ష్మన్న పెద్ద రాయుడు శంకర బాబాజాన్ షఫీ సద్దాం జె గోపాల్ సాదిక్ బాలు కలందర్ ఖాదర్ వలీ ఆది భాష నర్సింహులు నసీబ్ భాష ఆటో సంఘం నాయకులు మరియు అన్ని కార్మిక సంఘాల నాయకులు కార్మికులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు

SREEVANI

Reporter

Namitha News

మరిన్ని వార్తలు

Copyright © Namitha News 2026. All right Reserved.



Developed By :