Sunday, 13 September 2026 06:55:04 PM
# మిట్స్‌లో ‘ఎకో బప్పా మోరియా 3.0’ వినాయక చవితి వేడుకలు. # మట్టి వినాయక విగ్రహాలు, మొక్కల పంపిణీ # వివాహా నిశ్చితార్థ వేడుకల్లో శ్రీరామ్ చినబాబు # పుంగనూరు లో అసూరి బాలాజీ ఆధ్వర్యంలో ఘనంగా మాజీ సీఎం నల్లారి కిరణ్ కుమార్ రెడ్డి బ్రదర్స్ లకు జన్మదిన వేడుకలు # తక్షణమే స్పందించి ఆత్మహత్య చేసుకోవాలి అనుకొన్న యువతి ని కాపాడిన పోలీసులు # జాతీయ లోక్అదాలతో 71 కేసులు పరిష్కారం # తంబళ్లపల్లెలో 'విఘ్నం'లఘు చిత్రం ప్రారంభం # వినాయక చవితి పండుగ నేపథ్యంలో సోమవారం గ్రీవెన్స్ రద్దు - జిల్లా ఎస్పీ ధీరజ్ కునుబిల్లి # మట్టి వినాయక విగ్రహాలను పూజిద్దాం - సబ్ కలెక్టర్ చల్లా కల్యాణి # ట్రాక్టర్ ఢీకొని ఇద్దరికి తీవ్ర గాయాలు # తంబళ్లపల్లె సమస్యల పై అధికారులు దృష్టి సారించండి-ప్రజా దర్బార్ లో మాజీ ఎమ్మెల్యే జి శంకర్ యాదవ్ # ప్రజల సమస్యల పరిష్కారానికి ఐకమత్యంతో పనిచేయండి - మాజీ ఎమ్మెల్యే జి.శంకర్ యాదవ్ # మిట్స్ లో హెచ్‌ఆర్ కెరీర్స్ & ఏఐ ఆధారిత డిజిటల్ మార్కెటింగ్ ట్రెండ్స్ పై అతిధి ఉపన్యాస # వినాయక మండపాల నిర్వహణ పై సూచనలు -- డి.ఎస్పీ. బుచ్చిరాజు # ఎంపీ మిథున్ రెడ్డిపై ఉప్పొంగిన అభిమానం - యువనేత హర్షవర్ధన్ రెడ్డి ఆధ్వర్యంలో సేవా కార్యక్రమాలు # పఠాన్ ఖాదర్ ఖాన్ సేవలు స్ఫూర్తిదాయకం - టిడిపి రాష్ట్ర కార్యదర్శి పచ్చిపాల తులసి రామకృష్ణ హర్షం # మంచి చేయడమే కానీ మోసం చేయడం తనకు తెలియదు # ప్రజా శ్రేయస్సుకై పరితపించే నేత ఎంపీ మిథున్ రెడ్డి - వైకాపా రాష్ట్ర కార్యదర్శి ఎస్.ఏ కరీముల్లా ప్రశంసలు # రాష్ట్రంలో తీవ్ర కరువు ను కేంద్ర విపత్తుగా పరిగణిస్తూ కరువు ప్యాకేజీని ప్రకటించాలి - BKMU జిల్లా కార్యదర్శి తోపు కృష్ణప్ప # హ్యూమన్ రైట్స్ ముసుగు లో ఘరానా మోసాలు

లోక కల్యాణం కోసం ఆత్మార్పణం చేసిన త్యాగమూర్తి శ్రీ కన్యకా పరమేశ్వరి అమ్మవారు - జిల్లా అదనపు ఎస్పీ వెంకటాద్రి

Date : 20 January 2026 01:36 PM Views : 172

నమిత న్యూస్ - Andhra Pradesh / Annamayya : రాయచోటి - జనవరి 20 : సమాజ శ్రేయస్సు కోసం, ధర్మ రక్షణ కోసం అహింసా మార్గంలో అగ్ని ప్రవేశం చేసిన త్యాగమూర్తి శ్రీ కన్యకా పరమేశ్వరి అమ్మవారి ఆత్మార్పణ దినోత్సవాన్ని (మాఘ శుద్ధ విదియ) పురస్కరించుకుని, అన్నమయ్య జిల్లా పోలీస్ ప్రధాన కార్యాలయంలో మంగళవారం అమ్మవారికి ఘన నివాళులు అర్పించారు. జిల్లా ఎస్పీ శ్రీ ధీరజ్ కునుబిల్లి ఐపీఎస్ గారి ఆదేశాల మేరకు, అదనపు ఎస్పీ (పరిపాలన) శ్రీ యం. వెంకటాద్రి గారు అమ్మవారి చిత్రపటానికి పూలమాలలు వేసి భక్తిశ్రద్ధలతో అంజలి ఘటించారు

ఈ సందర్భంగా అదనపు ఎస్పీ గారు మాట్లాడుతూ.. అమ్మవారి ఆత్మార్పణ వెనుక ఉన్న పురాణ విశిష్టతను మరియు ఆమె త్యాగాన్ని కొనియాడారు. పురాణాల ప్రకారం, పార్వతీ దేవి పరమశివుడిని వివాహం చేసుకోవడానికి కన్యగా ఉండి ఘోర తపస్సు చేశారు. అయితే లోక కంటకుడైన బాణాసురుడిని సంహరించడం కోసం తన తపస్సు పూర్తి కాకముందే, భక్తుల కోరిక మేరకు శివకళ్యాణం జరగకుండా ఆగిపోయి, అమ్మవారు కన్యా రూపంలోనే ఉండిపోయారు. వివాహం పూర్తి కాకపోయినా, తపస్సు అసంపూర్తిగా ఉన్నా, తన భక్తుల రక్షణ కోసం అక్కడే కొలువై ఉండాలని నిర్ణయించుకున్న ఆ మహా తల్లిని మనం పూజిస్తున్నాము. ఆమె ఆత్మార్పణకు గుర్తుగా కన్యకా పరమేశ్వరి రూపంలో వెలసి నేటికీ కోట్లాది మందికి స్ఫూర్తిగా నిలుస్తున్నారు. "అహింసా పరమోధర్మః" అనే నినాదంతో సమాజ హితం కోసం ప్రాణత్యాగం చేసిన ఆమె మార్గం నేటి మహిళా సాధికారతకు, సామాజిక బాధ్యతకు దిక్సూచి అని అదనపు ఎస్పీ గారు పేర్కొన్నారు. ప్రతి ఒక్కరూ ఉన్నతమైన విలువలతో కూడిన సమాజ నిర్మాణానికి తోడ్పడాలని, జిల్లా ప్రజలందరికీ అమ్మవారి ఆశీస్సులు ఉండాలని ఆయన ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో ఆర్ఐ యం.పెద్దయ్య, మహిళా పోలీస్ స్టేషన్ ఇన్స్పెక్టర్ జి. శంకర మల్లయ్య, డిసిఆర్బి ఇన్స్పెక్టర్ ఏ. ఆదినారాయణ రెడ్డి, పలువురు ఎస్ఐలు, ఆర్ఎస్ఐలు, డిపిఓ సిబ్బంది, పోలీసు సిబ్బంది, మహిళా పోలీసులు మరియు హోంగార్డులు పాల్గొని అమ్మవారికి నివాళులర్పించారు

RAVI KUMAR REDDY

Admin

Namitha News

మరిన్ని వార్తలు

Copyright © Namitha News 2026. All right Reserved.



Developed By :