నమిత న్యూస్ - Andhra Pradesh / Annamayya : ఉజ్వల్ కృష్ణారెడ్డి–తేజస్విని ఆర్యరెడ్డి వివాహ రిసెప్షన్‌కు హాజరైన వైఎస్సార్‌సీపీ అగ్రనేతలు , మదనపల్లి: మదనపల్లె నియోజకవర్గ వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ పరిశీలకురాలు శ్రీమతి ఎన్. అనుషా రెడ్డి, ఎన్. శ్రీనాథ్ రెడ్డి దంపతుల కుమారుడు చిరంజీవి ఎన్. ఉజ్వల్ కృష్ణారెడ్డి, సౌభాగ్యవతి తేజస్విని ఆర్యరెడ్డి వివాహ రిసెప్షన్ మదనపల్లెలోని "ఆర్" కన్వెన్షన్ హాల్‌లో వైభవంగా జరిగింది. ఈ కార్యక్రమానికి వైఎస్సార్‌సీపీ రీజినల్ కోఆర్డినేటర్ పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, రాజంపేట పార్లమెంట్ సభ్యుడు పెద్దిరెడ్డి మిథున్ రెడ్డి, మాజీ శాసన సభ్యుడు గడికోట శ్రీకాంత్ రెడ్డి, మదనపల్లె నియోజకవర్గ ఇన్‌చార్జి ఎస్. నిసార్ అహ్మద్, మాజీ పార్లమెంట్ సభ్యుడు రెడ్డెప్ప, రాష్ట్ర యాదవ సంఘం అధ్యక్షుడు తుర్లు ఆనంద యాదవ్, తదితర పార్టీ అగ్రనేతలు హాజరై నూతన వధూవరులను ఆశీర్వదించి శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు పెద్ద సంఖ్యలో పాల్గొని సందడి చేశారు. మదనపల్లె నియోజకవర్గంలో పార్టీ పరిశీలకురాలిగా సమర్థవంతంగా బాధ్యతలు నిర్వహిస్తున్న అనుషా రెడ్డి కుటుంబంలో జరిగిన ఈ శుభకార్యానికి పార్టీ నాయకులు, ప్రజాప్రతినిధులు, కార్యకర్తలు హాజరై తమ ఆత్మీయతను చాటుకున్నారు. ఈ కార్యక్రమంలో మాజీ మున్సిపల్ చైర్మన్ వి. మనుజా రెడ్డి, పరిశీలకులు జింకా చలపతి, బాబ్జాన్, ఎస్‌ఈసీ సభ్యురాలు షమీమ్ అస్లాం, వైఎస్సార్‌సీపీ మేధావుల ఫోరం రాష్ట్ర కార్యదర్శి వి.ఎస్. రెడ్డి, జడ్‌పీటీసీ సీహెచ్. రామచంద్రారెడ్డి, రాష్ట్ర మైనారిటీ విభాగ కార్యదర్శులు కరీముల్లా, ఎస్‌కే ఇర్ఫాన్, నాయకులు కేశవ రెడ్డి, వెంకట రమణారెడ్డి, బుద్ధారెడ్డి ప్రసాద్ బాబు, శ్రీనివాసులు, ఎన్. ఇర్ఫాన్ ఖాన్, ఈశ్వర్ నాయక్, చిప్పిలి మల్లికార్జున రెడ్డి, శీలం రమేష్, కొత్తపల్లి మహేశ్, బండపల్లి వెంకట రమణ, యూనస్, బయ్యా రెడ్డి, నాగరాజ రెడ్డి, వడిగల శ్రీకాంత్, చరణ్, షేక్ జబి, మజ్జిగ కేశవ యాదవ్, మహేశ్ పాల్గొన్నారు.
Reporter
Namitha News