Monday, 14 September 2026 08:53:57 PM
# బిజెపి సీనియర్ నాయకుడు శ్రీనాథ్ రెడ్డి మృతి పార్టీకి తీరని లోటు # అన్నగారిన వర్గాల అభ్యున్నతికి బిజెపి తోనే సాధ్యం - బిజెపి జాతీయ కో కన్వీనర్ విష్ణువర్ధన్ రెడ్డి. # మట్టి వినాయక ప్రతిమలే పర్యావరణానికి శ్రేయస్కరం - వాసవి క్లబ్ అధ్యక్షులు వివి కృష్ణారావు # వినాయక చవితి వేళ ప్రతి ఇంట ఆనందం వెల్లివిరియాలి - కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత ఎస్.రెడ్డి సాహెబ్ ఆకాంక్ష # పర్యావరణ ప్రేమికుడు పఠాన్ ఖాదర్ ఖాన్ - టిడిపి రాష్ట్ర కార్యదర్శి పచ్చిపాల తులసి,శ్రీరామ్ చినబాబు ప్రశంసలు # స్థానిక సంస్థల ఎన్నికల్లో చరిత్ర సృష్టిద్దాం - జనసేన శ్రేణులకు రాందాస్ చౌదరి పిలుపు # గణనాధుడి ఆశీస్సులతో రాష్ట్రం సుభిక్షంగా మారాలి - చంద్రబాబు పాలనలో ఏపీ సస్యశ్యామలం కావాలి - తెలుగుదేశం యువనేత నాగూర్ వలి ఆకాంక్ష # సర్వ విఘ్నాలు తొలగిపోయి జిల్లా సమగ్రాభివృద్ధి సాధించాలి - ప్రజలకు వినాయక చవితి శుభాకాంక్షలు తెలిపిన జిల్లా కలెక్టర్ # మిట్స్‌లో ఆకట్టుకున్న ఎకో బప్పా మోరియా 3.0 వేడుకలు - పర్యావరణ ఆవశ్యకతను తెలియజేసిన విద్యార్థులు # టిడిపిలో డైనమిక్ లీడర్ ఎమ్మెల్యే కిషోర్ కుమార్ రెడ్డి - తెలుగుదేశం సీనియర్ నేత ఆర్.జె వెంకటేష్ # మిట్స్‌లో ‘ఎకో బప్పా మోరియా 3.0’ వినాయక చవితి వేడుకలు. # మట్టి వినాయక విగ్రహాలు, మొక్కల పంపిణీ # వివాహా నిశ్చితార్థ వేడుకల్లో శ్రీరామ్ చినబాబు # పుంగనూరు లో అసూరి బాలాజీ ఆధ్వర్యంలో ఘనంగా మాజీ సీఎం నల్లారి కిరణ్ కుమార్ రెడ్డి బ్రదర్స్ లకు జన్మదిన వేడుకలు # తక్షణమే స్పందించి ఆత్మహత్య చేసుకోవాలి అనుకొన్న యువతి ని కాపాడిన పోలీసులు # జాతీయ లోక్అదాలతో 71 కేసులు పరిష్కారం # తంబళ్లపల్లెలో 'విఘ్నం'లఘు చిత్రం ప్రారంభం # వినాయక చవితి పండుగ నేపథ్యంలో సోమవారం గ్రీవెన్స్ రద్దు - జిల్లా ఎస్పీ ధీరజ్ కునుబిల్లి # మట్టి వినాయక విగ్రహాలను పూజిద్దాం - సబ్ కలెక్టర్ చల్లా కల్యాణి # ట్రాక్టర్ ఢీకొని ఇద్దరికి తీవ్ర గాయాలు

ఎస్సి,ఎస్టీ సంక్షేమ పథకాలను పునరుద్దించాలంటూ మంత్రి కి వినతిపత్రం సమర్పించిన శ్రీచందు

సబ్ ప్లాన్ మరియు ఎస్సీ, ఎస్టీ కార్పొరేషన్ రుణాలు సత్వరమే మంజూరు చేయాలి

Date : 20 January 2026 11:09 AM Views : 194

నమిత న్యూస్ - Andhra Pradesh / AMARAVATHI : అమరావతి - జనవరి 20 : ఆంధ్రప్రదేశ్ రాష్ట్రములో ఎన్నికలకు ముందు హామీ ఇచ్చిన, గత ప్రభుత్వం రద్దు చేసిన ఎస్సీ ఎస్టీ సంక్షేమ పథకాలను తిరిగి పునరుద్ధరించాలని, కూటమి ప్రభుత్వం ఏర్పాటుఅయి 20 నెలలు కాలం గడుస్తున్న ఈ సంక్షేమ పథకాల ఊసే ఎత్తకపోవడం విచారకరమని ఆవేదన చెందుతున్నామన్నారు. దళితులకు 50 సంవత్సరాలకే పెన్షన్, జీవో నెంబర్ 3, సబ్ ప్లాన్ నిధుల పంపిణీ, గత ప్రభుత్వం రద్దు చేసిన 20 సంక్షేమ పథకాలను పునరుద్ధరణ చేయాలని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర సచివాలయంలో సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి డాక్టర్ డోలా బాల వీరాంజనేయులు గారిని బహుజనసేన రాష్ట్ర అధ్యక్షుడు శ్రీ చందు కలిశారు. రాష్ట్రంలో ఎస్సీ ఎస్టీల పట్ల జరుగుతున్న అన్యాయాలపై, ఒక వినతి రూపంలో ఆయన కందించారు. మంత్రి సానుకూలంగా స్పందిస్తూ త్వరతిగతిన పరిష్కరిస్తామని తెలిపారు. ఎస్సి, ఎస్టీ అట్రాసిటీ కేసుల పరిష్కారముకు ముందు ఏర్పాటు చేసిన" స్పెషల్ డియస్పీ" విధానం బాగా పనిచేయడం వల్ల సత్ఫలితాలు వచ్చాయని, కానీ ఇప్పుడు ఎస్సి, ఎస్టీ అట్రాసిటీ కేసులలో పై విధానం లేక సాధారణ డి.ఎస్. పి లు పని వత్తిడితో పరిమితి సమయంలో చార్జ్ షీట్ దాఖలు చేయలేక సుప్రీం కోర్టులు తీర్పులు ఉన్నా అట్రాసిటీ కేసుల్లో 41నోటిస్లు ఇస్తూ అట్రాసిటీ చట్టం యొక్క ఉద్దేశ్యంను పరోక్షంగా దెబ్బతీసేలా ఉందని ఆవేదన చెందారు. ఎస్సి, ఎస్టీ అట్రాసిటీ కేసుల్లో 6సాంఘిక సంక్షేమ శాఖ మరియు రెవెన్యూ శాఖ సంయుక్తముగా పనిచేసి ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ బాధితులకు న్యాయం చేయాలి కానీ అందుకు భిన్నముగా బాధితులకు కాంపొజిషన్ ఫండ్ ఇవ్వకుండా కాలయాపన చేయడమే కాక అట్రాసిటీ కేసుల్లో బాధితులు చనిపోతే వారి కుటుంబంలో ఒకరికి ప్రభుత్వ ఉద్యోగాన్ని భర్తీ చేయడంలో చాలా అలసత్వం చూపిస్తున్నారు. రాష్ట్రంలో చాలా జిల్లాలలో ఎస్సీ ఎస్టీ వాడలకు స్మశానాలు ఉన్న ఆ స్మశానాలకు దారి సమస్యలు చాలా ఉన్నాయి. స్మశానాలు లేని వాడలకు స్మశానం కల్పించి, దారి సమస్య ఉన్న వాళ్లకు ప్రజా ప్రయోజనాల నిమిత్తం భూమి చట్టం ప్రకారం దారులను ఏర్పాటు చేసి శాశ్వత పరిష్కారం కు చర్యలు తీసుకోవాలని , రాష్ట్రంలో మరియు టీటీడీ సంస్థలో పెండింగ్లో ఉన్న బ్యాక్ లాగ్ పోస్టులను వెంటనే భర్తీ చేస్తూ రూల్ ఆఫ్ రిజర్వేషన్ల విధానం ను పాటించాలని, ఎస్సీ ఎస్టీ కార్పొరేషన్ నిధులు మంజూరు చేసి సూక్ష్మ ఎస్సి, ఎస్టీ పారిశ్రామికు లకు సబ్సిడీ రుణాలు అందించాలని, పై సమస్యల పట్ల రాష్ట్ర ప్రభుత్వం స్పందించేలా తమరు చర్య తీసుకుని ఎస్సీ ఎస్టీ ప్రజలకు మరియు భాధితులకు న్యాయం చేయాలని కోరామని తెలిపారు

RAVI KUMAR REDDY

Admin

Namitha News

మరిన్ని వార్తలు

Copyright © Namitha News 2026. All right Reserved.



Developed By :