నమిత న్యూస్ - Andhra Pradesh / Annamayya : కడప - సెప్టెంబర్ 03 : కడప సెంట్రల్ జైలు వద్ద పారిపోయిన రిమాండ్ ఖైదీ ని తిరుపతి పోలీసులు అరెస్టు చేసి రాయచోటి పోలీసులకు అప్పగించిన తిరుపతి ఈస్ట్ పోలీసులు. కడప సెంట్రల్ జైలు నుంచి బుధవారం రిమాండ్ ఖైదీ పరార్ ఆయన విషయం తెలిసిందే. దొంగతనం కేసులో రిమాండ్ లో ఉన్న అన్నమయ్య జిల్లా గాలివీడు మండలానికి చెందిన వీరారెడ్డి కడప సెంట్రల్ జైలులో రిమాండ్ ఖైదీ గా ఉండగా మరో దొంగతనం కేసుకు సంబంధించి PT వారెంట్ తో రాయచోటికి తీసుకొచ్చిన పోలీసులు. విచారణ అనంతరం తిరిగి వీరారెడ్డిని రాయచోటి కోర్టులో హాజరుపరిచి తిరిగి కడప సబ్ జైలు వద్దకు తీసుకువచ్చిన పోలీసులు. జైలు లోపలికి వెళ్లే క్రమంలో తప్పించుకొని పారిపోయిన వీరారెడ్డి. తిరుపతికి చేరుకున్న వీరారెడ్డి ని తిరుపతి ఈస్ట్ పోలీసులు అదుపులోకి తీసుకొని రాయిచోటి పోలీసులకు సమాచారం. రాయచోటికి చెందిన ఏఎస్ఐ చంద్రశేఖర్ కానిస్టేబుల్ అయాన్ భాష హోంగార్డు మధు బాబుకు పోలీసులు అప్పగించడంతో రాయచోటికి తీసుకెళ్లిన పోలీసులు. ఖైదీ పరార్ అయినప్పుడు వీధుల్లో ఉన్న పోలీసులపై వేటు తప్పదన్న అయోమయంలో పోలీసులు.
Reporter
Namitha News