Monday, 14 September 2026 09:08:27 PM
# బిజెపి సీనియర్ నాయకుడు శ్రీనాథ్ రెడ్డి మృతి పార్టీకి తీరని లోటు # అన్నగారిన వర్గాల అభ్యున్నతికి బిజెపి తోనే సాధ్యం - బిజెపి జాతీయ కో కన్వీనర్ విష్ణువర్ధన్ రెడ్డి. # మట్టి వినాయక ప్రతిమలే పర్యావరణానికి శ్రేయస్కరం - వాసవి క్లబ్ అధ్యక్షులు వివి కృష్ణారావు # వినాయక చవితి వేళ ప్రతి ఇంట ఆనందం వెల్లివిరియాలి - కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత ఎస్.రెడ్డి సాహెబ్ ఆకాంక్ష # పర్యావరణ ప్రేమికుడు పఠాన్ ఖాదర్ ఖాన్ - టిడిపి రాష్ట్ర కార్యదర్శి పచ్చిపాల తులసి,శ్రీరామ్ చినబాబు ప్రశంసలు # స్థానిక సంస్థల ఎన్నికల్లో చరిత్ర సృష్టిద్దాం - జనసేన శ్రేణులకు రాందాస్ చౌదరి పిలుపు # గణనాధుడి ఆశీస్సులతో రాష్ట్రం సుభిక్షంగా మారాలి - చంద్రబాబు పాలనలో ఏపీ సస్యశ్యామలం కావాలి - తెలుగుదేశం యువనేత నాగూర్ వలి ఆకాంక్ష # సర్వ విఘ్నాలు తొలగిపోయి జిల్లా సమగ్రాభివృద్ధి సాధించాలి - ప్రజలకు వినాయక చవితి శుభాకాంక్షలు తెలిపిన జిల్లా కలెక్టర్ # మిట్స్‌లో ఆకట్టుకున్న ఎకో బప్పా మోరియా 3.0 వేడుకలు - పర్యావరణ ఆవశ్యకతను తెలియజేసిన విద్యార్థులు # టిడిపిలో డైనమిక్ లీడర్ ఎమ్మెల్యే కిషోర్ కుమార్ రెడ్డి - తెలుగుదేశం సీనియర్ నేత ఆర్.జె వెంకటేష్ # మిట్స్‌లో ‘ఎకో బప్పా మోరియా 3.0’ వినాయక చవితి వేడుకలు. # మట్టి వినాయక విగ్రహాలు, మొక్కల పంపిణీ # వివాహా నిశ్చితార్థ వేడుకల్లో శ్రీరామ్ చినబాబు # పుంగనూరు లో అసూరి బాలాజీ ఆధ్వర్యంలో ఘనంగా మాజీ సీఎం నల్లారి కిరణ్ కుమార్ రెడ్డి బ్రదర్స్ లకు జన్మదిన వేడుకలు # తక్షణమే స్పందించి ఆత్మహత్య చేసుకోవాలి అనుకొన్న యువతి ని కాపాడిన పోలీసులు # జాతీయ లోక్అదాలతో 71 కేసులు పరిష్కారం # తంబళ్లపల్లెలో 'విఘ్నం'లఘు చిత్రం ప్రారంభం # వినాయక చవితి పండుగ నేపథ్యంలో సోమవారం గ్రీవెన్స్ రద్దు - జిల్లా ఎస్పీ ధీరజ్ కునుబిల్లి # మట్టి వినాయక విగ్రహాలను పూజిద్దాం - సబ్ కలెక్టర్ చల్లా కల్యాణి # ట్రాక్టర్ ఢీకొని ఇద్దరికి తీవ్ర గాయాలు

మిట్స్ లో ముందోస్తు సంక్రాతి సంబరాలు

ఆర్ట్స్ & కల్చరల్, ఫిల్మ్ మేకర్స్ క్లబ్ ఆధ్వర్యంలో సంబరాలు

Date : 12 January 2026 06:23 PM Views : 303

నమిత న్యూస్ - Andhra Pradesh / Annamayya : మదనపల్లి - జనవరి 12 : అంగళ్ళు సమీపంలో గల మిట్స్ డీమ్డ్ టు బీ యూనివర్సిటీ నందు ఆర్ట్స్ అండ్ కల్చరల్ క్లబ్ మరియు ఫిలిమ్ మేకర్స్ క్లబ్ వారి ఆధ్వర్యంలో పల్లె వాతావరణంలో ఘనంగా సంక్రాంతి ముందస్తు సంబరాలు చేసుకున్నారు. యూనివర్సిటీ ఫౌండర్ & ఛాన్సలర్ డాక్టర్ యెన్. విజయభాస్కర్ చౌదరి, ప్రో ఛాన్సలర్ యెన్. ద్వారకానాథ్ మరియు వైస్ ఛాన్సలర్ డాక్టర్ సి. యువరాజ్ లు విద్యార్థులు చేసిన సంక్రాంతి వేడుకలను వీక్షించి అభినందనలు తెలియజేసారు. ఫౌండర్ & ఛాన్సలర్ డాక్టర్ యన్. విజయభాస్కర్ చౌదరి మాట్లాడుతూ ప్రజలు ఆనందోత్సవాలతో 3 రోజులపాటు జరుపుకునే తెలుగు పండుగ సంక్రాంతి అని అన్నారు. విద్యార్థులకు మరియు వారి తల్లితండులకు యూనివర్సిటీ తరుపున మరియు సిబ్బంది తరుపున మంచి జరగాలని కోరుతున్నానని అన్నారు. 'మకర సంక్రాంతి' పండుగ అందమైన ముగ్గులకు, గొబ్బెమ్మలకు, హరిదాసు పాటలకు, బసవన్నల ఆటలకు, గాలిపటాలు ఎగురవేయటానికి, మరెన్నో సంబరాలకు ప్రసిద్ధి చెందింది అని, అందరూ ఉత్సాహం తో పండుగ జరుపుకోవాలని ఆయన అన్నారు. తెలుగుదనం ఉట్టిపడేలా గ్రామీణ సంస్కృతి, రైతు జీవితానికి సంబంధించిన అంశాలను ప్రతిబింబించే కార్యక్రమాలు విద్యార్థుల్లో భారతీయ సంప్రదాయాల పట్ల గౌరవాన్ని పెంపొందిస్తాయని ఈ సందర్బంగా తెలియజేశారు. ఈ కార్యక్రమం ద్వారా భారతీయ సంప్రదాయాల ప్రాముఖ్యతను నేటి యువతకు అవగాహన కల్పిస్తూ, సాంకేతిక విద్యతో పాటు సాంస్కృతిక విలువలకు మిట్స్ యూనివర్సిటీ ప్రాధాన్యతను చాటిచెప్పుతున్నదని తెలిపారు. మిట్స్ యూనివర్సిటీ అయిన తరువాత మొదటి సంవత్సరంలో మొదటి సంక్రాంతి వేడుకలో భాగంగా విద్యార్థులకు ఉద్యోగ అవకాశాలు మెరుగుపరచడంలో తమ వంతు కృషి చేయాలని అధ్యాపకులకు తెలిపారు. విద్యార్థులకు నిర్వహించిన పోటీలలో గెలుపొందినవారికి బహుమతులు అందజేశారు. కార్యక్రమం లో యూనివర్సిటీ రిజిస్ట్రార్ డాక్టర్ డి.ప్రదీప్ కుమార్, డీన్, విభాగాధిపతులు, సిబ్బంది మరియు విద్యార్థులు పాల్గొన్నారు. విద్యార్థులు భోగి మంటల చుట్టూ కోలాటాలు, నృత్యాలు చేస్తూ అలరించడమే కాకుండా గాలిపటాలు ఎగరేస్తూ యూనివర్సిటీ లో సందడి చేశారు.

Sri Hari B

Reporter

Namitha News

మరిన్ని వార్తలు

Copyright © Namitha News 2026. All right Reserved.



Developed By :

A PHP Error was encountered

Severity: Core Warning

Message: Module 'igbinary' already loaded

Filename: Unknown

Line Number: 0

Backtrace: