నమిత న్యూస్ - Andhra Pradesh / Annamayya : మదనపల్లి - నవంబర్ 28 : బీసీ హక్కుల పోరాట సమితి రాష్ట్ర అధ్యక్షులు బోడెం రాజశేఖర్ ఆధ్వర్యంలో మహాత్మా జ్యోతిరావు పూలే వర్ధంతి కార్యక్రమం ఘనంగా నిర్వహించడం జరిగింది. అదే విధంగా మార్కెట్ యార్డ్ వద్ద గల అన్న క్యాంటీన్ ఎదుట పేదలకు అన్నదాన కార్యక్రమం నిర్వహించారు. శుక్రవారం బిసి హక్కుల పోరాట సమితి రాష్ట్ర అధ్యక్షులు బోడెం రాజశేఖర్ ఆధ్వర్యంలో బీసీ హెచ్ పి ఎస్ కమిటీ సభ్యులతో కలిసి మహాత్మ విగ్రహానికి గజ మాలవేసి ఘణంగా నివాళులు అర్పించారు. ఈ సందర్బంగా బోడెం రాజశేఖర్ మాట్లాడుతూ మహాత్మా జ్యోతిరావు పూలే ఆశయాల సాధన కోసం బీసీ హక్కుల పోరాట సమితి కట్టుబడి కొన సాగుతుందని ప్రకటించారు. ఆయన చూపించిన మార్గంలోనే ఎల్లప్పుడూ ముందుకు నడుస్తామన్నారు. మదనపల్లి జిల్లా సాధన లో ఎప్పటి కప్పుడు బీసీ హక్కుల పోరాట సమితి కీలక పాత్ర పోషించి, అన్ని నియోజక వర్గాల్లోనూ ఉద్యమాల్లో పాల్గొనిందని గుర్తు చేశారు. అలాగే ఎట్టకేలకు మదనపల్లి జిల్లా కల సాకార మైన సందర్భంగా జిల్లా ఉద్యమ నేతలందరికీ శుభాకాంక్షలు, కృతజ్ఞతలు తెలిపారు. బీసీలకు 50 శాతం రిజర్వేషన్ల కోసం ప్రత్యేక కార్యాచరణతో ముందుకు సాగుతామని ప్రకటించారు. ఇందుకోసం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని 175 మంది శాసన సభ్యులను ఒక్కొక్కరిని వ్యక్తి గతంగా కలుసుకొని వారికి వినతి పత్రాలు అందజేయడం జరుగు తుందని స్పష్టం చేశారు. ఎన్నికల ముందే తాము ఎన్డీఏ కూటమికి మద్దతు ఇచ్చామని బిసి లకు 50 శాతం రిజర్వేషన్లు, మదనపల్లి జిల్లా కావాలనే డిమాండ్ తోనే కలిసి పని చేశా మన్నారు. ఎన్నికల సందర్భంగా ఏపీ రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్ర బాబు నాయుడు ఇచ్చిన హామీ మేరకు వెంటనే బిసి రక్షణ చట్టం అమల్లోకి తీసుకు రావాలని డిమాండ్ చేశారు. బీసీలు చాలా రంగాల్లో అన్ని విధాల వెనుకబడి ఉన్నారని, వారిని ముందుకు తీసుకు వెళ్లాలంటే 50 శాతం రిజర్వేషన్లతోనే సాధ్యమని పేర్కొన్నారు.ఈ కార్యక్రమం లో వై వి శేఖర్ నాయుడు, రామ లింగయ్య, చిన్న రెడ్డప్ప, కరామత్ భాష, సుబ్బరాజు, రమణ, రామాంజులు, శేషాద్రి నాయుడు, లక్ష్మీ నారాయణ, ఏ ఈ రాయల్ బాబు, రామకృష్ణ, లక్ష్మీ నారాయణ, సిద్దయ్య, శ్రీనివాసులు, మల్లికా, రేఖ, సుబ్రహ్మణ్యం, దామోదర్ రాజు లు పాల్గొన్నారు.
Admin
Namitha News