Sunday, 13 September 2026 06:55:09 PM
# మిట్స్‌లో ‘ఎకో బప్పా మోరియా 3.0’ వినాయక చవితి వేడుకలు. # మట్టి వినాయక విగ్రహాలు, మొక్కల పంపిణీ # వివాహా నిశ్చితార్థ వేడుకల్లో శ్రీరామ్ చినబాబు # పుంగనూరు లో అసూరి బాలాజీ ఆధ్వర్యంలో ఘనంగా మాజీ సీఎం నల్లారి కిరణ్ కుమార్ రెడ్డి బ్రదర్స్ లకు జన్మదిన వేడుకలు # తక్షణమే స్పందించి ఆత్మహత్య చేసుకోవాలి అనుకొన్న యువతి ని కాపాడిన పోలీసులు # జాతీయ లోక్అదాలతో 71 కేసులు పరిష్కారం # తంబళ్లపల్లెలో 'విఘ్నం'లఘు చిత్రం ప్రారంభం # వినాయక చవితి పండుగ నేపథ్యంలో సోమవారం గ్రీవెన్స్ రద్దు - జిల్లా ఎస్పీ ధీరజ్ కునుబిల్లి # మట్టి వినాయక విగ్రహాలను పూజిద్దాం - సబ్ కలెక్టర్ చల్లా కల్యాణి # ట్రాక్టర్ ఢీకొని ఇద్దరికి తీవ్ర గాయాలు # తంబళ్లపల్లె సమస్యల పై అధికారులు దృష్టి సారించండి-ప్రజా దర్బార్ లో మాజీ ఎమ్మెల్యే జి శంకర్ యాదవ్ # ప్రజల సమస్యల పరిష్కారానికి ఐకమత్యంతో పనిచేయండి - మాజీ ఎమ్మెల్యే జి.శంకర్ యాదవ్ # మిట్స్ లో హెచ్‌ఆర్ కెరీర్స్ & ఏఐ ఆధారిత డిజిటల్ మార్కెటింగ్ ట్రెండ్స్ పై అతిధి ఉపన్యాస # వినాయక మండపాల నిర్వహణ పై సూచనలు -- డి.ఎస్పీ. బుచ్చిరాజు # ఎంపీ మిథున్ రెడ్డిపై ఉప్పొంగిన అభిమానం - యువనేత హర్షవర్ధన్ రెడ్డి ఆధ్వర్యంలో సేవా కార్యక్రమాలు # పఠాన్ ఖాదర్ ఖాన్ సేవలు స్ఫూర్తిదాయకం - టిడిపి రాష్ట్ర కార్యదర్శి పచ్చిపాల తులసి రామకృష్ణ హర్షం # మంచి చేయడమే కానీ మోసం చేయడం తనకు తెలియదు # ప్రజా శ్రేయస్సుకై పరితపించే నేత ఎంపీ మిథున్ రెడ్డి - వైకాపా రాష్ట్ర కార్యదర్శి ఎస్.ఏ కరీముల్లా ప్రశంసలు # రాష్ట్రంలో తీవ్ర కరువు ను కేంద్ర విపత్తుగా పరిగణిస్తూ కరువు ప్యాకేజీని ప్రకటించాలి - BKMU జిల్లా కార్యదర్శి తోపు కృష్ణప్ప # హ్యూమన్ రైట్స్ ముసుగు లో ఘరానా మోసాలు

గుండ్లపల్లి రైతుల ప్రకృతి వ్యవసాయం జిల్లాకే ఆదర్శం - పోర్డు డైరెక్టర్ లలితమ్మ

Date : 20 January 2026 11:00 PM Views : 256

నమిత న్యూస్ - Andhra Pradesh / AMARAVATHI : తంబళ్లపల్లె - జనవరి 20 :ః తంబళ్లపల్లె మండలం గుండ్లపల్లి పంచాయతీలో ల్యాండ్ డెవలప్మెంట్ తో వ్యవసాయానికి అనువుగా మార్చుకొని అందులో ప్రకృతి వ్యవసాయ పంటలు పండిస్తున్న రైతులు జిల్లాకే ఆదర్శంగా నిలిచినట్లు పోర్డు డైరెక్టర్ లలితమ్మ కొనియాడారు. మంగళవారం ఆమె గుండ్లపల్లి పంచాయతీలో ల్యాండ్ డెవలప్మెంట్లో అభివృద్ధి చేసిన పొలాలలో ప్రకృతి వ్యవసాయంతో పండించిన వేరుశనగ, ఉలవ, మొక్కజొన్న పంటలను పరిశీలించారు. సేంద్రియ కషాయాలతో పండ్లతోటలైన మామిడి, టమోటా, కూరగాయల పంటలు పండించడం పై వారిని అభినందించారు. రైతులు మాట్లాడుతూ ఫోర్డ్ సంస్థ సహకారంతో ల్యాండ్ డెవలప్మెంట్లో మా భూములు చదునుతో పాటు పొలాలకు రోడ్లు చేసుకుని అందులో ప్రకృతి వ్యవసాయంలో పండించిన పంటలు నాణ్యమైన దిగుబడి, ప్రకృతి కషాయాలతో టమోటా,మామిడి పంటలు ఎలాంటి రోగాలు లేని పూత పూసినట్లు చెప్పారు. రాబోయే రోజుల్లో ప్రకృతి పంటలైన సజ్జలు, జొన్నలు, రాగులు, కొర్రలు, సామలు సాగు చేస్తామన్నారు.ప్రొద్దుటూరు, చెన్నే కొత్తపల్లి లో ప్రకృతి వ్యవసాయంపై అవగాహన పొంది వారికి దీటుగా ప్రకృతి వ్యవసాయమే లక్ష్యంగా పంటలు సాగు చేస్తున్నట్లు చెప్పారు. ప్రతి రైతు ప్రకృతి వ్యవసాయం పై దృష్టి సారించి భవిష్యత్తులో మానవాళికి ఆరోగ్యంతో పాటు పర్యావరణ పరిరక్షణ కోసం ప్రకృతి వ్యవసాయం అవలంబించాలని లలితమ్మ కోరారు. ఆమె వెంట సిబ్బంది రమణ, రైతులు వేట మల్లికార్జున, నరసింహప్ప నాయుడు, లక్ష్మయ్య సిద్ధప్ప తదితరులు పాల్గొన్నారు

SREEVANI

Reporter

Namitha News

మరిన్ని వార్తలు

Copyright © Namitha News 2026. All right Reserved.



Developed By :