నమిత న్యూస్ - Andhra Pradesh / Annamayya : మదనపల్లి - ఆగస్ట్ 10 : సంయుక్త కిసాన్ మోర్చా , కార్మికసంఘాల పిలుపుమేరకు దేశ వ్యాప్త జైల్ భరో కార్యక్రమం లో భాగంగా మదనపల్లె కలెక్టర్ కార్యాలయం వద్ద,, రైతు సంఘాలు,, బికెయంయు,, ఎఐటియుసి, సి ఐ టియు ఆధ్వర్యంలో సోమవారం పికెటింగ్ నిర్వహించారు.. ఈ సందర్బంగా పోలీసులు 35 మంది రైతు సంఘం,, కార్మికసంఘాల, నేతలను అరెస్ట్ చేశారు.. జైల్ భరో కార్యక్రమం లో భాగం తొలుత మిషన్ కాంపౌండ్ నుండి ప్రదర్శన గా కార్మిక,కర్షక సంఘ నేతలు కలెక్టరేట్ వైపు నినాదాలతో వచ్చారు. మోడీ డౌన్ డౌన్,, కార్మిక, రైతు వ్యతిరేక విధానాలు నశించాలి,, కార్మికుల కనీస వేతనం 31 వేలు ఇవ్వాలి,, కార్మిక చట్టాలు, నాలుగు కోడ్లుగా కుదించడం దుర్మార్గం ,, రైతుఆదాయం రెట్టింపు చేసే చర్యలు చేపట్టాలని,, వ్యవసాయ కూలీల పని దినాలు 200 కు పెంచి,, రోజుకు 700 అందచేయాలంటూ పెద్ద ఎత్తున నినాదాలు చేశారు. అనంతరం కలెక్టరేట్ వద్ద శాంతియుతంగా పికెటింగ్ చేస్తున్న రైతు సంఘం, రాష్ట్ర నాయకులు,, డా.టి. జనార్దన్,, బికెయంయు, జిల్లా అధ్యక్షులు తోపు. కృష్ణప్ప,, ఎఐటియుసి నాయకులు మనోహర్ రెడ్డి, వ్యవసాయ కార్మిక సంఘం రాష్ట్ర ఉపాధ్యక్షులు శ్రీనివాసులు, సిఐటియు జిల్లా అధ్యక్షుడు హరి శర్మ, అంగన్వాడీ టీచర్స్ కార్యదర్శి గంగాదేవి తోపాటు 35 మంది కార్మిక రైతు సంఘ నేతలను వన్ టౌన్ పోలీసులు అరెస్టు చేసి తీసుకెళ్లారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ కేంద్రంలో అధికారంలో ఉన్న ఎన్డీఏ ప్రభుత్వం గత 12 సంవత్సరాలుగా కార్మిక, రైతు వ్యతిరేక విధానాలను కొనసాగిస్తూ గతంలో సాధించిన కార్మిక చట్టాలను రద్దు చేయడం,, కనీస వేతనాలు ఇవ్వకపోవడం దుర్మార్గమన్నారు. రైతుల ఆదాయాన్ని రెట్టింపు చేస్తామని నేడు రైతుల ఆత్మహత్యలకు కారణం అవుతూ, వారికి కనీస గిట్టుబాటు ధర అమలు చేయడం లేదని విమర్శించారు. ప్రభుత్వ రంగాన్ని నీర్వీర్యం చేస్తూ, కార్పొరేట్ లకు ఊడిగం చేయడం,, ఉపాధి కల్పన లేకపోవడం వల్ల నిరుద్యోగ యువకుల్లో అశాంతి, అలజడికి కారకులతున్నారని పేర్కొన్నారు. కార్మికులకు కనీస వేతనం ₹ 31,000, అందజేయాలని, వ్యవసాయ కూలీలకు 200 రోజులు పని దినాలు కల్పించాలని వారు కోరారు.. కార్మిక రైతు సమస్యలు పరిష్కరించకపోతే భవిష్యత్తులో మరింత ఉధృతంగా పోరాటం కొనసాగిస్తామని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో డిహెచ్ పి ఎస్ కార్యదర్శి హరి,, బి కెయంయు నేత మునిరత్నం నాయుడు,,గజపతి,,తిరుమల,,దేవా,, రాధా సియుటియు నాయకులు గంగాదేవి,, మధురవాణి,, జ్యోతి , విజయ తదితరులు పాల్గొన్నారు అనంతరం వన్ టౌన్ పోలీసులు సొంత పూచికత్తు మీద అరెస్టయిన కార్మిక, రైతు నేతలను విడుదల చేశారు
Reporter
Namitha News