నమిత న్యూస్ - Andhra Pradesh / Annamayya : తంబళ్లపల్లె సెప్టెంబర్ 05 : తంబళ్లపల్లె మండలంలో ఎల్నినో ప్రభావంతో తీవ్ర వర్షాభావం ఏర్పడిందని హంద్రీనీవా జలాలు మండలంలోని చెరువులకు మళ్లించి ఆదుకోవాలని మాజీ ఎమ్మెల్యే జి శంకర్ యాదవ్ ను రాజంపేట రైతు నాయకుడు ముద్దలదొడ్డి వెంకటరెడ్డి బృందం కోరారు. శనివారం మాజీ ఎమ్మెల్యే స్వగృహంలో మండలంలో తీవ్ర వర్షాభావంతో పంటలు పూర్తిగా ఎండిపోవడంతో పాటు సాగునీరు బోర్లు ఎండి రైతులు తాగునీటికి ప్రజలు, మూగజీవాలకు సైతం తాగునీరు కరువైందని మాజీ ఎమ్మెల్యేకి వివరించారు. ఆయన సమస్య పరిష్కారానికి కృషి చేస్తానని హామీ ఇవ్వడంతో నాయకులు హర్షం వ్యక్తం చేశారు
Reporter
Namitha News