నమిత న్యూస్ - Andhra Pradesh / Annamayya : నకిలీ పత్రాలతో దళితుల భూములు కబ్జాకు యత్నం - ఇన్చార్జి జిల్లా కలెక్టర్,ఎస్పీలకు బాధితుల ఫిర్యాదు - ఏపీవైజీపీఎస్ రాష్ట్ర అధ్యక్షుడు ఆవుల మల్లికార్జున మద్దతు మదనపల్లె : తరతరాలుగా దళిత కుటుంబానికి వారసత్వంగా వస్తున్న భూమిని కబ్జా చేసేందుకు ప్రయత్నాలు జరుగుతున్నాయని ఏపీవైజీపీఎస్ఎస్ రాష్ట్ర అధ్యక్షుడు ఆవుల మల్లికార్జున ఆరోపించారు.బాధితులు రాచపల్లి చిన్నప్ప,రాచపల్లి రెడ్డప్ప కుటుంబ సభ్యులతో కలిసి సోమవారం ప్రజా ఫిర్యాదులు పరిష్కార వేదికలో అన్నమయ్య జిల్లా ఇన్చార్జి కలెక్టర్ శివ నారాయణ్ శర్మ,ఎస్పీ ధీరజ్ కునుబిల్లిలకు ఫిర్యాదు చేశారు.ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ మదనపల్లె మండలం,బండమీదకమ్మపల్లి పరిధిలోని సర్వే నంబర్ 521/1లో ఉన్న 2-78 ఎకరాల భూమి తమ కుటుంబానికి వారసత్వంగా వస్తోందని తెలిపారు. భూమికి సంబంధించిన రెవెన్యూ రికార్డులు తమ పేర్లపైనే ఉన్నాయని పేర్కొన్నారు.అయితే సిటిఎం క్రాస్ రోడ్డుకు చెందిన ఆర్టీసీ శంకర్ రెడ్డి తప్పుడు పత్రాలు,నకిలీ నోటీసులు సృష్టించి తమను ఇబ్బందులకు గురిచేస్తున్నారని బాధితులు ఆరోపించారు.కులం పేరుతో దూషిస్తూ బెదిరింపులకు పాల్పడుతున్నారని కూడా ఫిర్యాదులో పేర్కొన్నారు.అనంతరం ఆవుల మల్లికార్జున మాట్లాడుతూ భూమి వివాదంపై అధికారులు సమగ్ర విచారణ చేపట్టి వాస్తవాలను నిగ్గుతేల్చాలని డిమాండ్ చేశారు.తప్పుడు పత్రాలు ఉన్నట్లు తేలితే చట్టపరమైన చర్యలు తీసుకోవడంతో పాటు,బెదిరింపులు,కుల దూషణలపై కూడా చర్యలు తీసుకోవాలని జిల్లా కలెక్టర్,ఎస్పీని కోరారు.బాధిత కుటుంబానికి రక్షణ కల్పించి,రెవెన్యూ అధికారులు భూమిని పరిశీలించి న్యాయం చేయాలని విజ్ఞప్తి చేశారు.
Reporter
Namitha News