Sunday, 13 September 2026 10:20:23 PM
# మిట్స్‌లో ‘ఎకో బప్పా మోరియా 3.0’ వినాయక చవితి వేడుకలు. # మట్టి వినాయక విగ్రహాలు, మొక్కల పంపిణీ # వివాహా నిశ్చితార్థ వేడుకల్లో శ్రీరామ్ చినబాబు # పుంగనూరు లో అసూరి బాలాజీ ఆధ్వర్యంలో ఘనంగా మాజీ సీఎం నల్లారి కిరణ్ కుమార్ రెడ్డి బ్రదర్స్ లకు జన్మదిన వేడుకలు # తక్షణమే స్పందించి ఆత్మహత్య చేసుకోవాలి అనుకొన్న యువతి ని కాపాడిన పోలీసులు # జాతీయ లోక్అదాలతో 71 కేసులు పరిష్కారం # తంబళ్లపల్లెలో 'విఘ్నం'లఘు చిత్రం ప్రారంభం # వినాయక చవితి పండుగ నేపథ్యంలో సోమవారం గ్రీవెన్స్ రద్దు - జిల్లా ఎస్పీ ధీరజ్ కునుబిల్లి # మట్టి వినాయక విగ్రహాలను పూజిద్దాం - సబ్ కలెక్టర్ చల్లా కల్యాణి # ట్రాక్టర్ ఢీకొని ఇద్దరికి తీవ్ర గాయాలు # తంబళ్లపల్లె సమస్యల పై అధికారులు దృష్టి సారించండి-ప్రజా దర్బార్ లో మాజీ ఎమ్మెల్యే జి శంకర్ యాదవ్ # ప్రజల సమస్యల పరిష్కారానికి ఐకమత్యంతో పనిచేయండి - మాజీ ఎమ్మెల్యే జి.శంకర్ యాదవ్ # మిట్స్ లో హెచ్‌ఆర్ కెరీర్స్ & ఏఐ ఆధారిత డిజిటల్ మార్కెటింగ్ ట్రెండ్స్ పై అతిధి ఉపన్యాస # వినాయక మండపాల నిర్వహణ పై సూచనలు -- డి.ఎస్పీ. బుచ్చిరాజు # ఎంపీ మిథున్ రెడ్డిపై ఉప్పొంగిన అభిమానం - యువనేత హర్షవర్ధన్ రెడ్డి ఆధ్వర్యంలో సేవా కార్యక్రమాలు # పఠాన్ ఖాదర్ ఖాన్ సేవలు స్ఫూర్తిదాయకం - టిడిపి రాష్ట్ర కార్యదర్శి పచ్చిపాల తులసి రామకృష్ణ హర్షం # మంచి చేయడమే కానీ మోసం చేయడం తనకు తెలియదు # ప్రజా శ్రేయస్సుకై పరితపించే నేత ఎంపీ మిథున్ రెడ్డి - వైకాపా రాష్ట్ర కార్యదర్శి ఎస్.ఏ కరీముల్లా ప్రశంసలు # రాష్ట్రంలో తీవ్ర కరువు ను కేంద్ర విపత్తుగా పరిగణిస్తూ కరువు ప్యాకేజీని ప్రకటించాలి - BKMU జిల్లా కార్యదర్శి తోపు కృష్ణప్ప # హ్యూమన్ రైట్స్ ముసుగు లో ఘరానా మోసాలు

రాష్ట్ర బడ్జెట్ అంకెల గారడీ తప్ప ఇంకేమీ లేదు - సిపియం జిల్లా కార్యదర్శి శ్రీనివాసులు

అన్నమయ్య జిల్లాకు కేటాయింపు శూన్యం

Date : 14 February 2026 07:27 PM Views : 154

నమిత న్యూస్ - Andhra Pradesh / Annamayya : మదనపల్లి - ఫిబ్రవరి 14 : రాష్ట్ర ప్రభుత్వం తరఫున అసెంబ్లీలో ఆర్థిక మంత్రి పయ్యావుల కేశవ్ ప్రవేశపెట్టిన బడ్జెట్ పద్దుల బడ్జెట్ కాదని సంక్షేమాన్ని అభివృద్ధిని జోడెద్దుల్లాగా నడిపే బడ్జెట్ అని గొప్పలు చెప్పుకోవడం తప్ప ఈ బడ్జెట్ లో ఏమీ లేదని, అన్నమయ్య జిల్లాకు తీరని ద్రోహం చేసిందని సిపిఎం అన్నమయ్య జిల్లా కార్యదర్శి పి.శ్రీనివాసులు ఆరోపించారు. 3,32,205 కోట్లతో ప్రవేశపెట్టిన బడ్జెట్ సగం ద్రవ్య లోటుతో ఉందని ఇందులో అప్పులు, ప్రజల పైన భారాలు, అంబానీ ఆదానీలకు వడ్డించడం తప్ప ఇంకేమీ లేదని అన్నారు. రైతాంగానికి, వ్యవసాయ కూలీలకు ఏమాత్రం ప్రయోజనం చేకూర్చే విధంగా లేదని అన్నారు. ఈ నెల 12న దేశవ్యాప్తంగా కార్మిక వర్గం, రైతాంగం, వ్యవసాయ కూలీలు లేబర్ కోడ్ లు రద్దు చేయాలని, పంటలకు గిట్టుబాటు ఇవ్వాలని ఉపాధి హామీని పెంచాలని డిమాండ్ చేస్తూ సమ్మె చేసిన విషయాన్ని గుర్తు చేశారు. ఈ సమ్మెను రాష్ట్ర ప్రభుత్వం కనీసం పరిగణలోకి కూడా తీసుకున్నట్లు అనిపించలేదని, అంగన్వాడి, ఆశ, మధ్యాహ్నం భోజన కార్మికులు, వివోఏలు, ఉపాధి హామీ ఫీల్డ్ అసిస్టెంట్లు, పంచాయతీ కార్మికులు వేతనాలు కోసం డిమాండ్ చేస్తా ఉంటే దాన్ని పెడచెవిని పెట్టడం దుర్మార్గం అన్నారు. అన్నమయ్య జిల్లాకు రాష్ట్ర బడ్జెట్ చేసింది శూన్యం అని అన్నారు. ఉక్కు పరిశ్రమ, కడప బెంగళూరు రైల్వే లైను ఊసే లేదన్నారు. హంద్రీనీవా ప్రాజెక్టు, గాలేరు నగరి కేటాయింపులు అంతంత మాత్రమేనని అవి మెయింటెనెన్స్, ఉద్యోగుల జీతభత్యాలకే సరిపోతాయని అన్నారు. రాష్ట్ర ప్రభుత్వం హంద్రీనీవా పూర్తి ఎప్పుడు అవుతుందో సమాధానం చెప్పాలని అన్నారు. మదనపల్లి మెడికల్ కాలేజీ, మదనపల్లి ట్రాఫిక్ సమస్య పరిస్కారం, జిల్లాలో రైతాంగానికి అనుకూలంగా టమోటా హబ్బు ఏర్పాటు వంటి వాటికీ ఎలాంటి హామీ ఇవ్వలేదని అన్నారు. రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన దుర్మార్గ బడ్జెట్ ని వ్యతిరేకించాలని ప్రజలకు పిలుపునిచ్చారు

RAVI KUMAR REDDY

Admin

Namitha News

మరిన్ని వార్తలు

Copyright © Namitha News 2026. All right Reserved.



Developed By :