Thursday, 30 July 2026 02:56:48 PM
# గురు పౌర్ణమి వేడుకల్లో శ్రీరామ్ చినబాబు # ఆదివాసీ ఫౌండేషన్ భారత్ ఏ. పి. రాష్ట్ర అధ్యక్షుడిగా నాగినేని గోవిందు వాల్మీకి # మదనపల్లి లో మానవీయ ఘటన # పంచాయతీల విద్యుత్ బిల్లులు చెల్లింపుకు సహకరించండి - విద్యుత్ ఏ .ఈ సురేంద్ర # కడ పల్లి లో ఘోర రోడ్డు ప్రమాదం, ముగ్గురు మృతి, 5 గురికి గాయాలు # మదనపల్లె డీఎస్పీ గా బాధ్యతలు చేపట్టిన బుచ్చిరాజు # "ఇంటింటికి తెలుగుదేశం" కార్యక్రమానికి ఘన శ్రీకారం చుట్టిన పల్లా శ్రీనివాసరావు # భవన నిర్మాణ కార్మికులు సంక్షేమ బోర్డు కార్డులు రెన్యువల్ చేసుకోండి # ఈవీఎం గోడౌన్ల వద్ద పటిష్టమైన భద్రత ఉండాలి - జిల్లా కలెక్టర్ నిశాంత్ కుమార్ # అన్నమయ్య జిల్లా ను వెంటనే కరవు జిల్లాగా ప్రకటించాలి – సిపిఐ # విజయవంతంగా వ్యవసాయ కార్మిక సంఘం సమావేశం # మల్లయ్య కొండలో వైభవంగా తొలి ఏకాదశి పూజలు # ఉపాధి హామీ లో కొబ్బరి మొక్కలు నాటుకోండి - ఎంపీడీవో ఉషారాణి # తొలి ఏకాదశి పూజ కార్యక్రమం లో పాల్గొన్న కార్ల మల్లికార్జు # ATM ను ఎత్తుకువెళ్లిన దొంగలు # ఉచిత ఎముకల శాంధ్రత పరీక్ష శిభిరం ను ప్రజలు సద్వినియోగం చేసుకోండి # విజవంతం గా మెగా పేటీఎం 4.ఓ సమావేశం.. # ప్రతి విద్యార్థిని ఉన్నతంగా తీర్చిదిద్దడమే ప్రభుత్వ ధ్యేయం # కుక్కరాజుపల్లి డంపింగ్ యార్డ్ ను తనిఖీ చేసిన ఎంపిడిఓ. # పెద్దేరు ప్రాజెక్టును సందర్శించిన హైడ్రాలజీ అధికారులు.

భారతీయ సంస్కృతిలో మహిళలకు విశిష్ట స్థానం - జిల్లా కలెక్టర్ నిశాంత్ కుమార్

సమాజ అభివృద్ధిలో మహిళల పాత్ర కీలకం - ఎమ్మెల్యే షాజహాన్ బాషా

Date : 08 March 2026 06:21 PM Views : 337

నమిత న్యూస్ - Andhra Pradesh / Annamayya : మదనపల్లి - మార్చి 08 : అన్నమయ్య జిల్లా కేంద్రం మదనపల్లి లో ఘనంగా అంతర్జాతీయ మహిళా దినోత్సవం. మన భారతీయ సంస్కృతి, సంప్రదాయాలలో మహిళలకు ఎప్పటి నుంచో విశిష్ట స్థానం ఉందని జిల్లా కలెక్టర్ నిశాంత్ కుమార్ తెలిపారు. మదనపల్లి పట్టణంలో గోల్లపల్లి బైపాస్ రోడ్డులోని ఆర్.ఆర్. గార్డెన్స్‌లో అంతర్జాతీయ మహిళా దినోత్సవ వేడుకలను ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి జిల్లా కలెక్టర్ శ్రీ నిషాంత్ కుమార్,జిల్లా ఎస్పీ ధీరజ్ కునుబిల్లి, మదనపల్లి శాసనసభ్యులు షాజహాన్ భాషా తదితరులు పాల్గొని జ్యోతి ప్రజ్వలన చేసి కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ.... ప్రపంచవ్యాప్తంగా ప్రతి సంవత్సరం మార్చి 8న అంతర్జాతీయ మహిళా దినోత్సవాన్ని జరుపుకుంటారని, 1975లో ఐక్యరాజ్యసమితి అధికారికంగా మహిళా దినోత్సవాన్ని ప్రకటించిన తర్వాత ప్రతి సంవత్సరం ప్రత్యేక థీమ్‌తో ఈ వేడుకలను నిర్వహిస్తున్నట్లు ఈ సంవత్సరం గివ్ టు గైన్ థీమ్‌తో అంతర్జాతీయ మహిళా దినోత్సవాన్ని జరుపుకోవడం జరుగుతున్నదని అన్నారు. మన భారతీయ సంస్కృతి, సంప్రదాయాలలో మహిళలకు ఎప్పటి నుంచో విశిష్ట స్థానం ఉందని తెలిపారు. లక్ష్మీనారాయణ, సీతారామ, రాధాకృష్ణ వంటి పేర్లలో ముందుగా మహిళకు ప్రాధాన్యత ఇవ్వడం మన సంస్కృతిలో ఉన్న గొప్పతనాన్ని సూచిస్తుందని పేర్కొన్నారు. భారత రాజ్యాంగం అమల్లోకి వచ్చిన నాటి నుంచే మహిళలకు సమాన హక్కులు కల్పించబడిన విషయాన్ని గుర్తు చేశారు. ఇతర దేశాలతో పోల్చితే భారతదేశంలో మహిళలకు ఇచ్చిన గౌరవం ఎంతో విశిష్టమని తెలిపారు. ఉదాహరణకు అమెరికా స్వాతంత్ర్యం పొందిన దాదాపు 144 సంవత్సరాల తర్వాత మహిళలకు ఓటు హక్కు లభించగా,డాక్టర్‌ బాబాసాహెబ్‌ అంబేద్కర్‌ భారతదేశంలో రచించిన రాజ్యాంగం అమల్లోకి వచ్చినప్పటి నుంచే మహిళలకు సమాన హక్కులు కల్పించబడినట్లు వివరించారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మహిళా సాధికారతకు ప్రభుత్వం విశేష ప్రాధాన్యత ఇస్తోందని తెలిపారు. ప్రతి రంగంలో, విద్య, ఉద్యోగం, స్థానిక సంస్థల ఎన్నికల్లో తదితర రంగాలలో మహిళలకు 33 శాతం రిజర్వేషన్ కల్పించిన తొలి రాష్ట్రంగా ఆంధ్రప్రదేశ్ నిలిచిందన్నారు. రాష్ట్రంలో స్వయం సహాయక సంఘాలు మహిళల ఆర్థిక సాధికారతకు మార్గదర్శకంగా నిలుస్తున్నాయని పేర్కొన్నారు.వివిధ ప్రభుత్వ పథకాల ద్వారా మహిళలకు ఆర్థిక సహాయం అందజేయడం జరుగుతోందని తెలిపారు. ఎన్ .టి.. ఆర్ భరోసా పెన్షన్ కానుకను జిల్లా లో 1,11,742 మంది మహిళా పించను దారులకు ప్రతి నెల 1వ తేదిన లబ్దిదారుల ఇళ్ళ వద్దనే ప్రభుత్వ ఉద్యోగుల ద్వారా పించను పంపిణీ చేయడం జరుగుతున్నది. ఇందుకొరకు ప్రతి నెల రూ.48.06 కోట్లు పంపిణీ చేయడం జరుగుతున్నదని మరియు ఆగష్టు 1 వ తేదీన కొత్తగా 3987 మంది వితంతువులకు స్పౌస్ పెంచనులు మంజూరు చేయడం జరిగినదని తెలిపారు. అన్నమయ్య జిల్లా లోని గ్రామీణ ప్రాంతాలలోని ఎస్.హెచ్.జి. లకు బ్యాంక్ లింకేజి పథకం ద్వారా 2025 ఆర్ధిక సం.నకు గాను స్వయం సహాయక సంఘ సభ్యులు తమ జీవనోపాధులు మెరుగు పరుచుకోవడానికి బ్యాంక్ లు ద్వారా ఋణాలు మంజూరు చేయడం జరుగుచున్నదని, ఇందుకు సంబంధించి 2025-26 సం.నకు 16,133 సంఘాలకు రూ.1444.71 కోట్లు లక్ష్యంగా నిర్ణయించడం జరిగినది. ఇందులో ఇప్పటి వరకు 10,577 సంఘాలుకు రూ.1403.71 కోట్లు అందించడం జరిగినదని పేర్కొన్నారు. స్త్రీనిధి మహిళా బ్యాంక్ ద్వారా స్వయం సహాయక సంఘ మహిళలకు రూ.1,00,000/-లు వరకు జీవనోపాదుల కొరకు ఋణాలు మంజూరు చేయబడుచున్నదని ఇందుకు సంబంధించి. 2025-26 సం.నకు 35,622 మందికి రూ.226.53 కోట్లు లక్ష్యం కాగా, ఇప్పటివరకు 35,622 మందికి రూ.269.19 కోట్లు మంజూరు చేయడం జరిగినదని అన్నారు. ఉన్నతి పథకం ద్వారా స్వయం సహాయక సంఘ మహిళలలోని SC, ST మహిళలకు వివిధ జివనోపాధుల నిమిత్తము వడ్డీ లేకుండా రూ.50,000/-లు నుండి 1,00,000/- లు వరకు రుణాలు అందరూ చేయడం జరుగుతున్నదని, 2025-26 సంవత్సరంనకు 2,142 మందికి రూ.11.97 కోట్లు లక్ష్యం కాగా , ఇప్పటివరకు 1879 మందికి రూ.12.56 కోట్లు మంజూరు చేయడం జరిగినదని అన్నారు. సురక్షితమైన సమాజ నిర్మాణంలో మహిళల పాత్ర ఎంతో కీలకమని ముఖ్యంగా తల్లిదండ్రులు తమ పిల్లలకు మంచి సంస్కారాలను అందించాల్సిన అవసరం ఉందన్నారు. చిన్నపిల్లలపై జరుగుతున్న దాడులను నివారించాలంటే కుటుంబ స్థాయిలోనే అవగాహన పెంపొందించాల్సిన అవసరం ఉందని సూచించారు. ప్రస్తుత కాలంలో సోషల్ మీడియా మరియు మొబైల్ ఫోన్ల వినియోగంపై తల్లిదండ్రులు ప్రత్యేక శ్రద్ధ చూపాలని తెలిపారు. పిల్లలు ఎలాంటి కంటెంట్ చూస్తున్నారు, ఎవరితో సంభాషిస్తున్నారు అన్న విషయాలను పర్యవేక్షించాలని సూచించారు. ముఖ్యంగా యువతులు సోషల్ మీడియాలో ఫేక్ ప్రొఫైల్స్ ద్వారా మోసపోవకుండా అప్రమత్తంగా ఉండాలని సూచించారు. చిన్నపిల్లలకు గుడ్ టచ్ – బ్యాడ్ టచ్ గురించి అవగాహన కల్పించడం చాలా అవసరమని పేర్కొన్నారు. ఎవరు అనుచితంగా ప్రవర్తించినా వెంటనే తల్లిదండ్రులకు లేదా ఉపాధ్యాయులకు తెలియజేయాలని పిల్లలకు చెప్పాలని సూచించారు. అలాగే అబ్బాయిలకు కూడా మహిళల పట్ల గౌరవ భావం పెంపొందేలా తల్లిదండ్రులు మార్గనిర్దేశం చేయాలని తెలిపారు.

మదనపల్లి శాసనసభ్యులు షాజహాన్ బాషా మాట్లాడుతూ.. సమాజ అభివృద్ధి కోసం మహిళల పాత్ర అత్యంత ముఖ్యమని మదనపల్లి శాసన సభ్యులు పేర్కొన్నారు. కుటుంబం నుండి సమాజ నిర్మాణం వరకు మహిళల సేవలు అపారమని, మహిళలే కుటుంబానికి ఆధారం, సమాజానికి మార్గదర్శకులని తెలిపారు.ప్రతి విజయం వెనుక మహిళల ప్రోత్సాహం, త్యాగం, కృషి ఉంటుందని ఎమ్మెల్యే పేర్కొన్నారు. తల్లి, చెల్లి, భార్యగా మహిళలు కుటుంబాన్ని సమగ్రంగా నిలబెడతారని తెలిపారు. మహిళల ఆర్థిక సాధికారతకు ప్రభుత్వ మహిళల అభివృద్ధి కోసం ప్రభుత్వం అనేక సంక్షేమ కార్యక్రమాలు అమలు చేస్తోందని తెలిపారు. ముఖ్యంగా స్వయం సహాయక సంఘాల ద్వారా మహిళలకు బ్యాంకుల నుండి పెద్ద మొత్తంలో రుణాలు అందుతున్నాయని చెప్పారు. మహిళలు ఆ రుణాలను సమర్థవంతంగా వినియోగించి వ్యాపారాలు ప్రారంభించి ఆర్థికంగా స్వయం సమృద్ధి సాధించాలని సూచించారు. మహిళల రుణాల తిరిగి చెల్లింపు రేటు అధికంగా ఉండటం వారి బాధ్యతాభావాన్ని సూచిస్తుందని పేర్కొన్నారు. మహిళలకు స్త్రీ శక్తి పథకం ద్వారా ఉచిత బస్సు ప్రయాణం, గృహనిర్మాణ పథకాలు, గ్యాస్ సిలిండర్ల పంపిణీ, విద్యార్థుల చదువుకు ఆర్థిక సహాయం వంటి పథకాలు,పెన్షన్ పథకాల ద్వారా ఆర్థిక భరోసా పెన్షన్ పథకాల ద్వారా వృద్ధులు, వికలాంగులు మరియు ఇతర అర్హులకు ప్రభుత్వం ఆర్థిక సహాయం అందిస్తోందని తెలిపారు.విద్యార్థుల భవిష్యత్తు కోసం ప్రభుత్వం పెద్ద మొత్తంలో నిధులు విడుదల చేసి వారి చదువుకు పూర్తి బాధ్యత తీసుకుంటుందని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో భాగంగా జిల్లా గ్రామీణాభివృద్ధి - సెర్ప్ మరియు ఎస్సీ కార్పొరేషన్ ద్వారా 120 మంది స్వయం సహాయక సభ్యులు ఉన్నతి ( పి ఎం ఎ జె ఏ వై) ఋణాల పంపిణీ క్రింద రూ.1, 72,50000/-( ఒక కోటి డెబ్బై లక్షల యాబై వేల రూపాయల ) మరియు 2025-26 ఆర్థిక సంవత్సరానికి బ్యాంకు లింకేజీ,ఉన్నతి,శ్రీనిధి, మెప్మా మరియు మహిళా ఎంటర్ పెన్యువార్స్ కు గాను 28,678 స్వయం సహాయక సంఘాలకు రూ. 2190.24 కోట్ల రూపాయల మేగా చెక్కులను ముఖ్య అతిథుల చేతుల మీదుగా అందజేశారు

జిల్లా ఎస్పీ ధీరజ్ కునుబిల్లి మాట్లాడుతూ... అన్నమయ్య జిల్లాలో మహిళల పట్ల జరుగుతున్న అన్యాయాలను అరికట్టేందుకు ప్రత్యేక పోలీస్ బృందాన్ని ఏర్పాటు చేస్తున్నట్లు జిల్లా ఎస్పీ తెలిపారు. మహిళల భద్రతకు ప్రాధాన్యత ఇస్తూ పోలీస్ శాఖ ప్రత్యేక కార్యాచరణ ప్రణాళికను రూపొందించినట్లు పేర్కొన్నారు. గ్రామ స్థాయికి వెళ్లి మహిళల సమస్యల పరిష్కారం కోసం జిల్లాలోని మారుమూల గ్రామాల వరకు వెళ్లి మహిళల సమస్యలను తెలుసుకునే కార్యక్రమాన్ని చేపడుతున్నట్లు తెలిపారు. ప్రతి గ్రామాన్ని సందర్శిస్తూ మహిళల భద్రతకు సంబంధించిన అంశాలపై అవగాహన కల్పించడం, అలాగే మహిళలు ఎదుర్కొంటున్న సమస్యలను ప్రత్యక్షంగా తెలుసుకొని వెంటనే పరిష్కరించే చర్యలు తీసుకోనున్నట్లు వెల్లడించారు. ఈ కార్యక్రమానికి విజయవంతం చేయడంలో మహిళల సహకారం ఎంతో అవసరమని పేర్కొన్నారు. మహిళలపై లేదా చిన్నపిల్లలపై ఎటువంటి అన్యాయం జరిగినా దానిని నిర్లక్ష్యం చేయకుండా వెంటనే పోలీస్ స్టేషన్‌కు తెలియజేయాలని సూచించారు. చాలాసార్లు సమస్యలు కుటుంబంలో లేదా పరిసరాల్లోనే పరిమితం అవుతున్నాయని, అయితే సమయానికి పోలీసులకు సమాచారం అందితే వెంటనే చర్యలు తీసుకోవడం సాధ్యమవుతుందని తెలిపారు. మహిళలు ధైర్యంగా ముందుకు రావాలని సమాజంలో ఇతరులకు జరిగిన అన్యాయం మనకు జరగదని అనుకోవడం సరికాదని పేర్కొన్నారు. అందువల్ల మహిళలు తమ హక్కులను తెలుసుకొని ధైర్యంగా ముందుకు రావాలని సూచించారు. తమ ఇంట్లో, వీధిలో, గ్రామంలో లేదా సమాజంలో ఏదైనా సమస్య ఎదురైన వెంటనే పోలీసులను సంప్రదించాలని సూచించారు.మహిళల భద్రతకు పోలీస్ శాఖ అండగా ఉంటుందని మహిళల భద్రత కోసం పోలీస్ శాఖ ఎప్పుడూ సిద్ధంగా ఉంటుందని తెలిపారు. ఏ సమయంలోనైనా ఫోన్ ద్వారా లేదా స్థానిక పోలీస్ అధికారులకు సమాచారం అందించిన వెంటనే స్పందించి సమస్యను పరిష్కరించేందుకు చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు. మహిళలు తమ లక్ష్యాలను సాధించే దిశగా ధైర్యంగా ముందుకు సాగాలని, వారి భద్రతకు పోలీస్ శాఖ ఎల్లప్పుడూ అండగా ఉంటుందని జిల్లా ఎస్పీ తెలిపారు. ఈ కార్యక్రమంలో వెలుగు స్కూల్ విద్యార్థుల నృత్య ప్రదర్శన అందరిని అలరింపజేసింది . అనంతరం వివిధ శాఖల మహిళా అధికారులకు, ఉద్యోగులకు, ఎన్జీవోలకు, స్వచ్ఛంద సంస్థల మహిళలు, స్వయం సహాయ సంఘాల మహిళలకు, విద్యార్థినులకు షీల్డ్ ను అందించారు. ఈ కార్యక్రమంలో మహిళా శిశు సంక్షేమ శాఖ అధికారిని హైమావతి, హార్టికల్చర్ అధికారిని సుభాషిని,డి ఆర్ డి ఏ పి డి నాగేశ్వరరావు, మెప్మా పీడీ లక్ష్మి, డాక్టర్ కోటీశ్వరమ్మ, జిల్లా సమైక్య ప్రెసిడెంట్ మంజుల, పి ఓ ఆర్ డి ఎన్జీవో లలితమ్మ, వెలుగు ఎన్జీవో భాగ్యలక్ష్మి, చైతన్య చిల్డ్రన్స్ హోమ్ ప్రతినిధి కవిత, జిల్లా అధికారులు,వివిధ ప్రజా ప్రతినిధులు, మాజీ కౌన్సిలర్లు, స్వయం సహాయక సంఘాల మహిళలు, విద్యార్థినులు తదితరులు పాల్గొన్నారు.

RAVI KUMAR REDDY

Admin

Namitha News

మరిన్ని వార్తలు

Copyright © Namitha News 2026. All right Reserved.



Developed By :