నమిత న్యూస్ - Andhra Pradesh / Annamayya : మట్టి వినాయక ప్రతిమలే పర్యావరణానికి శ్రేయస్కరం - వాసవి క్లబ్ అధ్యక్షులు వివి కృష్ణారావు స్పష్టం మదనపల్లె : మట్టి వినాయక ప్రతిమలను పూజిద్దాం,పర్యావరణాన్ని కాపాడుదామనే నినాదంతో మదనపల్లె పట్టణం సొసైటీ కాలనీలో శ్రీ రామాలయం ఎదుట ప్రజలకు,భక్తులకు ఉచితంగా మట్టి వినాయక ప్రతిమలు పంపిణీ చేయడం జరిగింది.వాసవి క్లబ్ అధ్య క్షులు వివి కృష్ణారావు,జనరల్ సెక్రటరీ ఈ.వినయ్ కుమార్,కోశాధికారి కె.చంద్ర శేఖర్ గుప్తా మరియు క్లబ్ కార్యవర్గసభ్యులు కలసి మట్టి విగ్రహాలు ప్రజలకు పంపిణి చేశారు.ఈ సందర్భంగా అధ్యక్షులు వివి కృష్ణారావు మాట్లాడుతూ పర్యావరణ పరిరక్షణ ప్రతి ఒక్కరి బాధ్యత అన్నారు.వినాయక చవితి సందర్భంగా ప్లాస్టర్ ఆఫ్ పారిస్ విగ్రహాలకు బదులుగా మట్టి వినాయక ప్రతిమలను పూజించడం ద్వారా పర్యావరణాన్ని కాపాడవచ్చని తెలిపారు.మట్టి విగ్రహాలను ఉపయోగించి,పర్యావరణ హితమైన వినాయక చవితిని జరుపుకోవాలని ప్రజలకు,భక్తులకు పిలుపునిచ్చారు.మట్టి వినాయక విగ్రహాల పంపిణీపైన ప్రజలు,భక్తులు హర్షం వ్యక్తం చేశారు.
Reporter
Namitha News