నమిత న్యూస్ - Andhra Pradesh / Annamayya : స్థానిక సంస్థల ఎన్నికల్లో చరిత్ర సృష్టిద్దాం - జనసేన శ్రేణులకు రాందాస్ చౌదరి పిలుపు మదనపల్లె : పట్టణంలోని కమ్మవీధి,జనసేన పార్టీ కార్యాలయం నందు ఆదివారం గంగారపు రాందాస్ చౌదరి ఆధ్వర్యంలో జనసేన పార్టీ నాయకులు,కార్యకర్తలు,వీర మహిళలు జనసైనికులతో సమావేశం ఏర్పాటు చేశారు.ఈ సందర్భంగా గంగారపు రాందాస్ చౌదరి మాట్లాడుతూ స్థానిక సంస్థల ఎన్నికలలో పోటీచేసే ప్రతి ఒక్కరికీ పూర్తి సహాయ,సహకారాలు అందిస్తామని,ఖచ్చితమైన ప్రణాళికతో ఎన్నికలలో పోటీకి సన్నద్ధం కావాలని,గెలుపే లక్ష్యంగా పోటీ చేసే ప్రతి ఒక్కరూ స్పష్టమైన కార్యచరణ రూపొందించుకోవాలని కార్యకర్తలకు దిశానిర్దేశం చేశారు.రాజంపేట పార్లమెంట్ సమన్వయ కమిటీ కో-ఆర్డినేటరుగా జనసేన పార్టీ నియమించిన రాజోలు ఎమ్మెల్యే దేవ వరప్రసాద్,అతికారి కృష్ణ,తాతం శెట్టి నాగేంద్ర, సమన్వయ కమిటీ సభ్యులు ఇంచార్జి అందరూ కలసి పోటీ చేసే అభ్యర్థుల వివరాలు నమోదు చేసుకుని కేంద్ర పార్టీ కార్యాలయానికి పంపడం జరుగుతుందని,తుది నిర్ణయం అధినాయకుడు పవన్ కళ్యాణ్ తీసు కుంటారన్నారు.కూటమి ధర్మం ప్రకారం జనసేన పార్టీకి ఎన్ని సీట్లు కేటాయిస్తారో వందకు వంద శాతం గెలిపించుకుంటామని,మా పార్టీ శ్రేణులు అంతా కూడా విబేధాలు,వర్గాలు అన్ని పక్కన పెట్టి ఐకమత్యంగా జనసేన పార్టీనీ,ఎన్డిఏ కూటమి అభ్యర్థులను స్థానిక సంస్థల ఎన్నికలలో గెలిపించుకొంటామని తెలిపారు.ఈ కార్యక్రమంలో మదనపల్లె ఏఎంసి చైర్మన్ జంగాల శివరామ్,బీసీ నాయకులు బండి మనోహర్,రాష్ట్ర చేనేత ప్రధాన కార్యదర్శి అడపా సురేంద్ర,జిల్లా జాయింట్ సెక్రెటరీ సనావుల్లా,ప్రదీప్ సింగ్,టౌన్ ప్రెసిడెంట్ నాయని జగదీష్ బాబు,ఏఎంసి డైరెక్టర్లు రోణురు బాబు,గడ్డం లక్ష్మీపతి,నాయకులు పాల్గొన్నారు.
Reporter
Namitha News