Wednesday, 29 July 2026 09:13:43 AM
# మదనపల్లి లో మానవీయ ఘటన # పంచాయతీల విద్యుత్ బిల్లులు చెల్లింపుకు సహకరించండి - విద్యుత్ ఏ .ఈ సురేంద్ర # కడ పల్లి లో ఘోర రోడ్డు ప్రమాదం, ముగ్గురు మృతి, 5 గురికి గాయాలు # మదనపల్లె డీఎస్పీ గా బాధ్యతలు చేపట్టిన బుచ్చిరాజు # "ఇంటింటికి తెలుగుదేశం" కార్యక్రమానికి ఘన శ్రీకారం చుట్టిన పల్లా శ్రీనివాసరావు # భవన నిర్మాణ కార్మికులు సంక్షేమ బోర్డు కార్డులు రెన్యువల్ చేసుకోండి # ఈవీఎం గోడౌన్ల వద్ద పటిష్టమైన భద్రత ఉండాలి - జిల్లా కలెక్టర్ నిశాంత్ కుమార్ # అన్నమయ్య జిల్లా ను వెంటనే కరవు జిల్లాగా ప్రకటించాలి – సిపిఐ # విజయవంతంగా వ్యవసాయ కార్మిక సంఘం సమావేశం # మల్లయ్య కొండలో వైభవంగా తొలి ఏకాదశి పూజలు # ఉపాధి హామీ లో కొబ్బరి మొక్కలు నాటుకోండి - ఎంపీడీవో ఉషారాణి # తొలి ఏకాదశి పూజ కార్యక్రమం లో పాల్గొన్న కార్ల మల్లికార్జు # ATM ను ఎత్తుకువెళ్లిన దొంగలు # ఉచిత ఎముకల శాంధ్రత పరీక్ష శిభిరం ను ప్రజలు సద్వినియోగం చేసుకోండి # విజవంతం గా మెగా పేటీఎం 4.ఓ సమావేశం.. # ప్రతి విద్యార్థిని ఉన్నతంగా తీర్చిదిద్దడమే ప్రభుత్వ ధ్యేయం # కుక్కరాజుపల్లి డంపింగ్ యార్డ్ ను తనిఖీ చేసిన ఎంపిడిఓ. # పెద్దేరు ప్రాజెక్టును సందర్శించిన హైడ్రాలజీ అధికారులు. # వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా సర్వసభ్య సమావేశాన్ని జయప్రదం చేయండి - జిల్లా కార్యదర్శి కృష్ణప్ప # ఆత్మకూరులో డాక్యుమెంట్ రైటర్స్ ఆందోళన

మహిళా రక్షణకు 'శక్తి' కవచం

సైబర్ నేరాలు, మాదకద్రవ్యాల పట్ల అప్రమత్తత పై జిల్లా వ్యాప్తంగా పోలీసుల విస్తృత అవగాహన

Date : 30 January 2026 08:51 PM Views : 112

నమిత న్యూస్ - Andhra Pradesh / Annamayya : మదనపల్లి - జనవరి 30 : అన్నమయ్య జిల్లాలో మహిళల భద్రత, చిన్నారుల రక్షణే ధ్యేయంగా పోలీస్ యంత్రాంగం ప్రత్యేక కార్యాచరణను చేపట్టింది. *జిల్లా ఎస్పీ శ్రీ ధీరజ్ కునుబిల్లి ఐపీఎస్ గారి ఆదేశాల మేరకు, శుక్రవారం జిల్లా వ్యాప్తంగా పలు పోలీస్ స్టేషన్ల పరిధిలో 'శక్తి' బృందాలు మరియు స్థానిక పోలీసులు భారీ అవగాహన కార్యక్రమాలు నిర్వహించారు. సమాజంలో వేగంగా విస్తరిస్తున్న సైబర్ నేరాలు, మాదకద్రవ్యాల వినియోగం మరియు సామాజిక రుగ్మతలపై ప్రజలను చైతన్య పరిచారు. *అండగా శక్తి బృందాలు:* మహిళలు, విద్యార్థినుల భద్రత కోసం ఏర్పాటు చేసిన శక్తి బృందాలు క్షేత్రస్థాయిలో పర్యటించాయి. ఆపద సమయంలో 'శక్తి యాప్' ఏ విధంగా రక్షణగా నిలుస్తుందో ప్రత్యక్షంగా వివరించారు. ఆకతాయిల వేధింపులకు గురైనా, అపరిచిత వ్యక్తుల నుండి ఇబ్బందులు ఎదురైనా సంకోచించకుండా పోలీసులకు సమాచారం అందించాలని కోరారు. ముఖ్యంగా 'పోక్సో' చట్టంపై అవగాహన కల్పిస్తూ.. చిన్నారుల పట్ల అసభ్యంగా ప్రవర్తించే వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. *బాల్య వివాహాలు.. సామాజిక నేరం:* గ్రామీణ ప్రాంతాల్లో బాల్య వివాహాల వల్ల కలిగే అనర్థాలను పోలీసులు వివరించారు. చిన్న వయసులో వివాహాలు చేయడం వల్ల ఆడపిల్లల ఆరోగ్యం దెబ్బతినడమే కాకుండా, వారి భవిష్యత్తు అంధకారమవుతుందని హెచ్చరించారు. బాల్య వివాహాలను ప్రోత్సహించే వారిపై చట్టపరమైన చర్యలు తప్పవని స్పష్టం చేశారు. *మత్తుకు దూరంగా.. చదువుకు దగ్గరగా:* యువతను పట్టి పీడిస్తున్న మాదకద్రవ్యాల వినియోగంపై ఆందోళన వ్యక్తం చేశారు. గంజాయి వంటి మత్తు పదార్థాల వల్ల జీవితాలు ఎలా చిన్నాభిన్నమవుతాయో వివరించారు. విద్యార్థులు చెడు అలవాట్లకు దూరంగా ఉండి, ఉజ్వల భవిష్యత్తును నిర్మించుకోవాలని పిలుపునిచ్చారు. అలాగే ఆన్‌లైన్ మోసాల పట్ల అప్రమత్తంగా ఉండాలని, గుర్తుతెలియని లింక్‌లను క్లిక్ చేసి వ్యక్తిగత సమాచారాన్ని, నగదును పోగొట్టుకోవద్దని సూచించారు. ఈ కార్యక్రమంలో జిల్లాలోని ఆయా పోలీస్ స్టేషన్ల పరిధిలో పలువురు పోలీసు అధికారులు మరియు శక్తి బృందాలు అవగాహన కల్పించారు

RAVI KUMAR REDDY

Admin

Namitha News

మరిన్ని వార్తలు

Copyright © Namitha News 2026. All right Reserved.



Developed By :