Monday, 14 September 2026 08:01:03 PM
# బిజెపి సీనియర్ నాయకుడు శ్రీనాథ్ రెడ్డి మృతి పార్టీకి తీరని లోటు # అన్నగారిన వర్గాల అభ్యున్నతికి బిజెపి తోనే సాధ్యం - బిజెపి జాతీయ కో కన్వీనర్ విష్ణువర్ధన్ రెడ్డి. # మట్టి వినాయక ప్రతిమలే పర్యావరణానికి శ్రేయస్కరం - వాసవి క్లబ్ అధ్యక్షులు వివి కృష్ణారావు # వినాయక చవితి వేళ ప్రతి ఇంట ఆనందం వెల్లివిరియాలి - కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత ఎస్.రెడ్డి సాహెబ్ ఆకాంక్ష # పర్యావరణ ప్రేమికుడు పఠాన్ ఖాదర్ ఖాన్ - టిడిపి రాష్ట్ర కార్యదర్శి పచ్చిపాల తులసి,శ్రీరామ్ చినబాబు ప్రశంసలు # స్థానిక సంస్థల ఎన్నికల్లో చరిత్ర సృష్టిద్దాం - జనసేన శ్రేణులకు రాందాస్ చౌదరి పిలుపు # గణనాధుడి ఆశీస్సులతో రాష్ట్రం సుభిక్షంగా మారాలి - చంద్రబాబు పాలనలో ఏపీ సస్యశ్యామలం కావాలి - తెలుగుదేశం యువనేత నాగూర్ వలి ఆకాంక్ష # సర్వ విఘ్నాలు తొలగిపోయి జిల్లా సమగ్రాభివృద్ధి సాధించాలి - ప్రజలకు వినాయక చవితి శుభాకాంక్షలు తెలిపిన జిల్లా కలెక్టర్ # మిట్స్‌లో ఆకట్టుకున్న ఎకో బప్పా మోరియా 3.0 వేడుకలు - పర్యావరణ ఆవశ్యకతను తెలియజేసిన విద్యార్థులు # టిడిపిలో డైనమిక్ లీడర్ ఎమ్మెల్యే కిషోర్ కుమార్ రెడ్డి - తెలుగుదేశం సీనియర్ నేత ఆర్.జె వెంకటేష్ # మిట్స్‌లో ‘ఎకో బప్పా మోరియా 3.0’ వినాయక చవితి వేడుకలు. # మట్టి వినాయక విగ్రహాలు, మొక్కల పంపిణీ # వివాహా నిశ్చితార్థ వేడుకల్లో శ్రీరామ్ చినబాబు # పుంగనూరు లో అసూరి బాలాజీ ఆధ్వర్యంలో ఘనంగా మాజీ సీఎం నల్లారి కిరణ్ కుమార్ రెడ్డి బ్రదర్స్ లకు జన్మదిన వేడుకలు # తక్షణమే స్పందించి ఆత్మహత్య చేసుకోవాలి అనుకొన్న యువతి ని కాపాడిన పోలీసులు # జాతీయ లోక్అదాలతో 71 కేసులు పరిష్కారం # తంబళ్లపల్లెలో 'విఘ్నం'లఘు చిత్రం ప్రారంభం # వినాయక చవితి పండుగ నేపథ్యంలో సోమవారం గ్రీవెన్స్ రద్దు - జిల్లా ఎస్పీ ధీరజ్ కునుబిల్లి # మట్టి వినాయక విగ్రహాలను పూజిద్దాం - సబ్ కలెక్టర్ చల్లా కల్యాణి # ట్రాక్టర్ ఢీకొని ఇద్దరికి తీవ్ర గాయాలు

షుగర్ డాడీ" కల్చర్ .. ఏపీలో వేగంగా వ్యాప్తి ... యువతకు హెచ్చరిక...

యువతులు మీరు తస్మాత్ జాగ్రత్త..ఆధునికత పేరుతో మనం నైతికతను, మానవ విలువలను వదులుకుంటున్నాం.

Date : 28 June 2026 07:04 PM Views : 154

నమిత న్యూస్ - Andhra Pradesh / AMARAVATHI : వేగంగా వ్యాపిస్తున్నా "షుగర్ డాడీ" కల్చర్ ..భారత్‌లో 3.38 లక్షల మంది ... ఏపీలో వేగంగా వ్యాప్తి ... యువతకు హెచ్చరిక మనం ఆధునిక భారత్ గురించి మాట్లాడుకుంటాం. టెక్నాలజీ పురోగతి, స్టార్టప్ క్రాంతి, యువత సాధికారత గురించి గర్వంగా చెప్పుకుంటాం. కానీ అదే సమాజంలో నిశ్శబ్దంగా వ్యాపిస్తున్న ఒక చీకటి వాస్తవం ఉంది. అదే షుగర్ డాడీ కల్చర్. భారత్‌లో 3,38,000 మంది షుగర్ డాడీలు ఉన్నారు. ఆసియాలోనే అత్యధికంగా ఇండోనేషియా 60,250 మంది, మలేషియా 32,500 మంది ఉండేవారు. కానీ భారత్ ఈ గణాంకాలను మించిపోయింది. ఈ లెక్కలు కేవలం గణాంకాలు కావు, వాటి వెనుక లక్షల మంది యువతుల జీవితాలు, కలలు, కుటుంబాలు ఉన్నాయి. అసలు ఈ 'షుగర్ డాడీ' అంటే ఏమిటి? సరళంగా చెప్పాలంటే ఇది డబ్బుతో కొనుగోలు చేసే సంబంధాల మార్కెట్. సాధారణంగా 40 ఏళ్లకు పైబడిన ఆర్థికంగా స్థిరపడిన పురుషులు (షుగర్ డాడీలు) యువతులకు (షుగర్ బేబీలకు) డబ్బు, బహుమతులు, విదేశ పర్యటనలు, లగ్జరీ జీవనశైలి అందిస్తారు. బదులుగా సమయం, సహవాసం తీసుకుంటారు. దీన్ని 'మ్యూచువల్ బెనిఫిట్ రిలేషన్‌షిప్' అని అంటారు. కానీ నిజంగా చెప్పాలంటే ఇది ఆర్థిక అవసరతలను దోపిడీ చేసే, భావోద్వేగాలను వ్యాపారం చేసే వ్యవస్థ. డిజిటల్ ప్లాట్‌ఫామ్‌లు Seeking.com (గతంలో Seeking Arrangement) ప్రపంచవ్యాప్తంగా 46 మిలియన్ల మందిని కనెక్ట్ చేస్తోంది. భారత్‌లో 2020లో 75,000 మంది సభ్యులున్నప్పుడు, కరోనా కాలంలో ఒక్కసారిగా 158% పెరిగింది. 39% కొత్త సభ్యులు రాత్రికి రాత్రే చేరారు. లాక్‌డౌన్‌లో ఉద్యోగాలు పోయాయి, ఆర్థిక సంక్షోభం వచ్చింది. చాలా మందికి ఇది 'తాత్కాలిక పరిష్కారం' అనిపించింది. SugarDaddyMeet, WhatsYourPrice వంటి సైట్లు భారతీయ మార్కెట్‌ను టార్గెట్ చేస్తున్నాయి. ముంబై (21,464 డాడీలు, 6,200 బేబీలు), ఢిల్లీ (13,127), హైదరాబాద్ (11,000 పైగా) టాప్ సిటీలు. ఇవి కేవలం 2020 గణాంకాలు మాత్రమే. ఇప్పుడు ఈ సంఖ్యలు రెట్టింపు అయి ఉండవచ్చు. ఆంధ్రప్రదేశ్‌లో హైదరాబాద్ ఇప్పటికే ఈ కల్చర్ పెరిగిపోయింది. ఏపీలో విశాఖపట్నం, విజయవాడ, గుంటూరు, తిరుపతిలో ఇది కొత్తగా పెరుగుతోంది. ఐటీ హబ్స్, కార్పొరేట్ ఆఫీస్‌లు, ఎన్‌ఆర్‌ఐ కనెక్షన్లు ఉన్న చోట్ల ఈ ట్రెండ్ వేగంగా పెరుగుతోందని నివేదికలు వెల్లడిస్తున్నాయి. టెక్ ప్రొఫెషనల్స్, రియల్ ఎస్టేట్ దిగ్గజాలు, వ్యాపారవేత్తలు షుగర్ డాడీలుగా రిజిస్టర్ అవుతున్నారు. అదే సమయంలో కాలేజీ విద్యార్థినులు, యంగ్ ప్రొఫెషనల్స్, ఇంజినీరింగ్, మెడికల్, ఎంబీఏ చదువుతున్న అమ్మాయిలు ఫీజులు, అద్దెలు, లైఫ్‌స్టైల్ ఖర్చులు భరించలేక ఈ దారి ఎంచుకుంటున్నారు. ఎందుకు ఇలా చేస్తున్నారు..? ప్రైవేట్ కాలేజీల్లో ఏడాదికి 5నుంచి 10 లక్షల రుపాయల ఫీజులు. నగరాల్లో 15 నుంచి 20 వేల అద్దెలు ఎందుకు ఒక కారణంగా ఉన్నాయి. మధ్యతరగతి కుటుంబాల పిల్లలు విద్యార్థి రుణాల భారంలో మునిగిపోతున్నారు. ఇన్‌స్టాగ్రామ్, యూట్యూబ్‌లో లగ్జరీ లైఝ్‌స్టైల్ వీడియోలు చూసి 'నేను కూడా అలా జీవించాలి' అనే తపన యువతల్లో పెరిగింది. బ్రాండెడ్ బట్టలు, ఖరీదైన రెస్టారెంట్లు, విదేశ ట్రిప్పులు ఇవన్నీ సక్సెస్ యొక్క పర్యాయపదాలుగా మారాయి. ఆర్థిక స్వాతంత్ర్యం పేరుతో నైతిక హద్దులు క్షీణిస్తున్నాయి. 'నా శరీరం, నా నిర్ణయం' అనే స్లోగన్ పెరిగింది. ఈ ప్లాట్‌ఫామ్‌ల మెరుగుదల వెనుక భయంకరమైన నిజాలు దాగి ఉన్నాయి. అనేక కేసుల్లో వీడియోలు, ఫోటోలు రికార్డ్ చేసి బ్లాక్‌మెయిల్ చేస్తున్నారు. పోలీసు కేసులు పెట్టడానికి అమ్మాయిలు సిగ్గుపడతారు. ప్రారంభంలో 'ఈజీ మనీ' అనిపించినా తర్వాత అపరాధ భావం(ఈ స్టోరీ రాస్తుంది సీనియర్ జర్నలిస్ట్, ) డిప్రెషన్, ఆత్మగౌరవం కోల్పోవడం సాధారణం మారింది. ఇది ప్రేమ కాదు, లావాదేవీ. కానీ చాలా మంది యువతులు భావోద్వేగంగా అటాచ్ అవుతారు, తర్వాత మోసపోతారు. చాలా సందర్భాల్లో ఇది 'క్వాసీ-ప్రాస్టిట్యూషన్' పిలవబడుతుంది. సమాజ ప్రభావం ఈ ట్రెండ్ కేవలం వ్యక్తిగత ఎంపికల విషయం కాదు. ఇది మన సమాజం, కుటుంబ వ్యవస్థపై దీర్ఘకాలిక ప్రభావం చూపుతుంది. వివాహం, నమ్మకం, సంబంధాల పవిత్రత ఇవన్నీ ప్రశ్నార్థకం అవుతున్నాయి. ఆర్థిక అసమానతలు వ్యక్తిగత సంబంధాల్లోకి చొచ్చుకుపోతున్నాయి. 3.38 లక్షల మంది షుగర్ డాడీలు ఉన్న దేశంలో మనం జీవిస్తున్నాం. ఇది గర్వించదగ్గ గణాంక కాదు. సిగ్గుపడాల్సిన వాస్తవం. ఆధునికత పేరుతో మనం నైతికతను, మానవ విలువలను వదులుకుంటున్నాం. ఏపీలోని ప్రతి తల్లిదండ్రి, ప్రతి విద్యార్థి, ప్రతి యువకుడు ఈ విషయాన్ని తేలికగా తీసుకోకూడదు. మీ కూతురు, సోదరి, స్నేహితురాలు ఎవరైనా సరే ఈ ప్రమాదంలో పడకుండా హెచ్చరించండి.

Sathya

Reporter

Namitha News

మరిన్ని వార్తలు

Copyright © Namitha News 2026. All right Reserved.



Developed By :