Monday, 14 September 2026 08:01:51 PM
# బిజెపి సీనియర్ నాయకుడు శ్రీనాథ్ రెడ్డి మృతి పార్టీకి తీరని లోటు # అన్నగారిన వర్గాల అభ్యున్నతికి బిజెపి తోనే సాధ్యం - బిజెపి జాతీయ కో కన్వీనర్ విష్ణువర్ధన్ రెడ్డి. # మట్టి వినాయక ప్రతిమలే పర్యావరణానికి శ్రేయస్కరం - వాసవి క్లబ్ అధ్యక్షులు వివి కృష్ణారావు # వినాయక చవితి వేళ ప్రతి ఇంట ఆనందం వెల్లివిరియాలి - కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత ఎస్.రెడ్డి సాహెబ్ ఆకాంక్ష # పర్యావరణ ప్రేమికుడు పఠాన్ ఖాదర్ ఖాన్ - టిడిపి రాష్ట్ర కార్యదర్శి పచ్చిపాల తులసి,శ్రీరామ్ చినబాబు ప్రశంసలు # స్థానిక సంస్థల ఎన్నికల్లో చరిత్ర సృష్టిద్దాం - జనసేన శ్రేణులకు రాందాస్ చౌదరి పిలుపు # గణనాధుడి ఆశీస్సులతో రాష్ట్రం సుభిక్షంగా మారాలి - చంద్రబాబు పాలనలో ఏపీ సస్యశ్యామలం కావాలి - తెలుగుదేశం యువనేత నాగూర్ వలి ఆకాంక్ష # సర్వ విఘ్నాలు తొలగిపోయి జిల్లా సమగ్రాభివృద్ధి సాధించాలి - ప్రజలకు వినాయక చవితి శుభాకాంక్షలు తెలిపిన జిల్లా కలెక్టర్ # మిట్స్‌లో ఆకట్టుకున్న ఎకో బప్పా మోరియా 3.0 వేడుకలు - పర్యావరణ ఆవశ్యకతను తెలియజేసిన విద్యార్థులు # టిడిపిలో డైనమిక్ లీడర్ ఎమ్మెల్యే కిషోర్ కుమార్ రెడ్డి - తెలుగుదేశం సీనియర్ నేత ఆర్.జె వెంకటేష్ # మిట్స్‌లో ‘ఎకో బప్పా మోరియా 3.0’ వినాయక చవితి వేడుకలు. # మట్టి వినాయక విగ్రహాలు, మొక్కల పంపిణీ # వివాహా నిశ్చితార్థ వేడుకల్లో శ్రీరామ్ చినబాబు # పుంగనూరు లో అసూరి బాలాజీ ఆధ్వర్యంలో ఘనంగా మాజీ సీఎం నల్లారి కిరణ్ కుమార్ రెడ్డి బ్రదర్స్ లకు జన్మదిన వేడుకలు # తక్షణమే స్పందించి ఆత్మహత్య చేసుకోవాలి అనుకొన్న యువతి ని కాపాడిన పోలీసులు # జాతీయ లోక్అదాలతో 71 కేసులు పరిష్కారం # తంబళ్లపల్లెలో 'విఘ్నం'లఘు చిత్రం ప్రారంభం # వినాయక చవితి పండుగ నేపథ్యంలో సోమవారం గ్రీవెన్స్ రద్దు - జిల్లా ఎస్పీ ధీరజ్ కునుబిల్లి # మట్టి వినాయక విగ్రహాలను పూజిద్దాం - సబ్ కలెక్టర్ చల్లా కల్యాణి # ట్రాక్టర్ ఢీకొని ఇద్దరికి తీవ్ర గాయాలు

మదనపల్లె జిల్లాపై మాట నిలుపుకున్న కూటమి ప్రభుత్వం - శ్రీరామ్ చినబాబు

యన్టీఆర్ విగ్రహం కు పాలాభిషేకం, అంబరాన్నంటిన సంబరాలు

Date : 26 November 2025 04:59 PM Views : 234

నమిత న్యూస్ - Andhra Pradesh / Annamayya : మదనపల్లె జిల్లాపై మాట నిలుపుకున్న కూటమి ప్రభుత్వం - శ్రీరామ్ చినబాబు ఆధ్వర్యంలో అంబరాన్నంటిన సంబరాలు - పెద్దఎత్తున తరలివచ్చిన కూటమి పార్టీల నాయకులు,కార్యకర్తలు మదనపల్లె : ఎన్నో సంవత్సరాలుగా మదనపల్లి జిల్లా కావాలని ఎదురుచూస్తున్న మదనపల్లి నియోజకవర్గ ప్రజల కల సాకారమైన తరుణంలో బుధవారం మదనపల్లి పట్టణం ఎన్టీఆర్ సర్కిల్ నందు తెలుగు యువత రాష్ట్ర అధ్యక్షులు శ్రీరామ్ చినబాబు ఆధ్వర్యంలో సంబరాలు అంబరాన్నంటాయి.కూటమి ప్రభుత్వానికి,ప్రధాని నరేంద్ర మోడీ,ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు,ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్,మంత్రి నారా లోకేష్ బాబులకి ధన్యవాదాలు తెలుపుతూ వారి చిత్రపటాలకు పాలాభిషేకం నిర్వహించార.ఈ కార్యక్రమంలో బిజెపి సీనియర్ నాయకులు చల్లపల్లి నరసింహారెడ్డి,సీడ్ మల్లికార్జున నాయుడు,యల్లంపల్లి ప్రశాంత్,బండి ఆనంద్,టి.వెంకటరమణారెడ్డి,రాజంపేట ప్రధాన కార్యదర్శి దొరస్వామి నాయుడు గారు,పఠాన్ ఖాదర్ ఖాన్,మహబూబ్ ఖాన్,చీకలబైలు సర్పంచ్ ప్రభాకర,బండి అమర,జనసేన నాయకులు దారం అనిత,శివాలయం డైరెక్టర్లు మల్లికా,పసుపులేటి వరప్రసాద్,జెసి రెడ్డెప్ప,నియోజకవర్గ వివిధ హోదాల్లో ఉన్న కూటమి నాయకులు,కార్యకర్తలు పాల్గొన్నారు.ఈ సందర్భంగా పలువురు మాట్లాడుతూ ఎన్నో దశాబ్దాలుగా ఇక్కడి ప్రజల చిరకాల ఆకాంక్ష అయిన మదనపల్లి జిల్లాను కూటమి ప్రభుత్వం నెరవేర్చిందన్నారు.గత వైసిపి ప్రభుత్వం మదనపల్లి జిల్లాను ఏర్పాటు చేయకుండా ఇక్కడ ప్రజలను మోసం చేసిందన్నారు.అయితే ఎన్నికల ముందు కూటమి ప్రభుత్వం ఇచ్చిన హామీ మేరకు మదనపల్లి జిల్లాను ఏర్పాటు చేసి మాట నిలబెట్టుకున్నదని కొనియాడారు.మదనపల్లి జిల్లా సాధనకు సహకరించిన ప్రతి ఒక్కరికి వారు కృతజ్ఞతలు తెలిపారు.

B.MANI KUMAR

Reporter

Namitha News

మరిన్ని వార్తలు

Copyright © Namitha News 2026. All right Reserved.



Developed By :