Sunday, 13 September 2026 05:48:07 PM
# మిట్స్‌లో ‘ఎకో బప్పా మోరియా 3.0’ వినాయక చవితి వేడుకలు. # మట్టి వినాయక విగ్రహాలు, మొక్కల పంపిణీ # వివాహా నిశ్చితార్థ వేడుకల్లో శ్రీరామ్ చినబాబు # పుంగనూరు లో అసూరి బాలాజీ ఆధ్వర్యంలో ఘనంగా మాజీ సీఎం నల్లారి కిరణ్ కుమార్ రెడ్డి బ్రదర్స్ లకు జన్మదిన వేడుకలు # తక్షణమే స్పందించి ఆత్మహత్య చేసుకోవాలి అనుకొన్న యువతి ని కాపాడిన పోలీసులు # జాతీయ లోక్అదాలతో 71 కేసులు పరిష్కారం # తంబళ్లపల్లెలో 'విఘ్నం'లఘు చిత్రం ప్రారంభం # వినాయక చవితి పండుగ నేపథ్యంలో సోమవారం గ్రీవెన్స్ రద్దు - జిల్లా ఎస్పీ ధీరజ్ కునుబిల్లి # మట్టి వినాయక విగ్రహాలను పూజిద్దాం - సబ్ కలెక్టర్ చల్లా కల్యాణి # ట్రాక్టర్ ఢీకొని ఇద్దరికి తీవ్ర గాయాలు # తంబళ్లపల్లె సమస్యల పై అధికారులు దృష్టి సారించండి-ప్రజా దర్బార్ లో మాజీ ఎమ్మెల్యే జి శంకర్ యాదవ్ # ప్రజల సమస్యల పరిష్కారానికి ఐకమత్యంతో పనిచేయండి - మాజీ ఎమ్మెల్యే జి.శంకర్ యాదవ్ # మిట్స్ లో హెచ్‌ఆర్ కెరీర్స్ & ఏఐ ఆధారిత డిజిటల్ మార్కెటింగ్ ట్రెండ్స్ పై అతిధి ఉపన్యాస # వినాయక మండపాల నిర్వహణ పై సూచనలు -- డి.ఎస్పీ. బుచ్చిరాజు # ఎంపీ మిథున్ రెడ్డిపై ఉప్పొంగిన అభిమానం - యువనేత హర్షవర్ధన్ రెడ్డి ఆధ్వర్యంలో సేవా కార్యక్రమాలు # పఠాన్ ఖాదర్ ఖాన్ సేవలు స్ఫూర్తిదాయకం - టిడిపి రాష్ట్ర కార్యదర్శి పచ్చిపాల తులసి రామకృష్ణ హర్షం # మంచి చేయడమే కానీ మోసం చేయడం తనకు తెలియదు # ప్రజా శ్రేయస్సుకై పరితపించే నేత ఎంపీ మిథున్ రెడ్డి - వైకాపా రాష్ట్ర కార్యదర్శి ఎస్.ఏ కరీముల్లా ప్రశంసలు # రాష్ట్రంలో తీవ్ర కరువు ను కేంద్ర విపత్తుగా పరిగణిస్తూ కరువు ప్యాకేజీని ప్రకటించాలి - BKMU జిల్లా కార్యదర్శి తోపు కృష్ణప్ప # హ్యూమన్ రైట్స్ ముసుగు లో ఘరానా మోసాలు

శ్రీజ పాలడైరీ శిగలో మరో మోడల్ కంటైనర్

బోయపల్లెలో ఆధునిక పాల కేంద్రం ప్రారంభం

Date : 19 June 2026 10:19 PM Views : 261

నమిత న్యూస్ - Andhra Pradesh / Annamayya : తంబళ్లపల్లె - జూన్ 19 : పాల సేకరణలో మొదటి స్థానంలో దూసుకుపోతున్న శ్రీజ పాలడైరీ శిగలో మరో అధునాతన పాలసేకరణ కేంద్ర మోడల్ కంటైనర్ ప్రారంభించడం హర్షనీయమని శ్రీజ డైరీ ఏరియా మేనేజర్ కృష్ణప్ప కొనియాడారు. శుక్రవారం తంబళ్లపల్లె నియోజకవర్గం కురబలకోట ఏరియా సిటిఎం సిసి పరిధిలోని బోయపల్లి తో పాటు బి.కొత్తకోట మండలం కుమ్మరపల్లి లలో జైకా మరియు ఎన్.డి.డి.బి సహకారంతో ఏర్పాటు చేసిన మోడల్ కంటైనర్లను క్లస్టర్ మేనేజర్ శేఖర్ రెడ్డి లాంఛనంగా ప్రారంభించారు. ఏరియా మేనేజర్ మాట్లాడుతూ శ్రీజ సంస్థ ద్వారా పాల ఉత్పత్తి దారులకు అందుతున్న వివిధ సేవలు, సంక్షేమ కార్యక్రమాలు మరియు సభ్యత్వ ప్రయోజనాల గురించి వివరించారు. క్లస్టర్ మేనేజర్ శేఖర్ రెడ్డి మాట్లాడుతూ శ్రీజ డైరీకి రోజు కు తొమ్మిది లక్షల లీటర్ల పాలు వస్తున్నాయని అందులో తంబళ్లపల్లి నియోజకవర్గం లో 80 వేల లీటర్లు వస్తున్నట్లు చెప్పారు. జులై నెలలో పాడి రైతులకు అందించాల్సిన బోనస్ అలాగే సబ్సిడీ పథకాలు, బయోగ్యాస్ యూనిట్లు, పశువుల కోసం రబ్బరు మ్యాట్లు వినియోగంపై విశదీకరించారు. అతి త్వరలో మొబైల్ వెటర్నరీ క్లినిక్ సేవలను కూడా ప్రారంభించనున్నట్లు తెలిపారు. ఈ సందర్భంగా పాలమిత్ర సురేష్ పాడి రైతులకు స్వీట్లు పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో పి ఐ సి. కేశవ, శ్రీజ సూపర్వైజర్లు సురేష్, చిట్టిబాబు, బోయపల్లి శ్రీజ వాళ్ళ డైరీ సభ్యులు పాల్గొన్నారు

SREEVANI

Reporter

Namitha News

మరిన్ని వార్తలు

Copyright © Namitha News 2026. All right Reserved.



Developed By :

A PHP Error was encountered

Severity: Core Warning

Message: Module 'igbinary' already loaded

Filename: Unknown

Line Number: 0

Backtrace: