Wednesday, 29 July 2026 12:43:55 PM
# మదనపల్లి లో మానవీయ ఘటన # పంచాయతీల విద్యుత్ బిల్లులు చెల్లింపుకు సహకరించండి - విద్యుత్ ఏ .ఈ సురేంద్ర # కడ పల్లి లో ఘోర రోడ్డు ప్రమాదం, ముగ్గురు మృతి, 5 గురికి గాయాలు # మదనపల్లె డీఎస్పీ గా బాధ్యతలు చేపట్టిన బుచ్చిరాజు # "ఇంటింటికి తెలుగుదేశం" కార్యక్రమానికి ఘన శ్రీకారం చుట్టిన పల్లా శ్రీనివాసరావు # భవన నిర్మాణ కార్మికులు సంక్షేమ బోర్డు కార్డులు రెన్యువల్ చేసుకోండి # ఈవీఎం గోడౌన్ల వద్ద పటిష్టమైన భద్రత ఉండాలి - జిల్లా కలెక్టర్ నిశాంత్ కుమార్ # అన్నమయ్య జిల్లా ను వెంటనే కరవు జిల్లాగా ప్రకటించాలి – సిపిఐ # విజయవంతంగా వ్యవసాయ కార్మిక సంఘం సమావేశం # మల్లయ్య కొండలో వైభవంగా తొలి ఏకాదశి పూజలు # ఉపాధి హామీ లో కొబ్బరి మొక్కలు నాటుకోండి - ఎంపీడీవో ఉషారాణి # తొలి ఏకాదశి పూజ కార్యక్రమం లో పాల్గొన్న కార్ల మల్లికార్జు # ATM ను ఎత్తుకువెళ్లిన దొంగలు # ఉచిత ఎముకల శాంధ్రత పరీక్ష శిభిరం ను ప్రజలు సద్వినియోగం చేసుకోండి # విజవంతం గా మెగా పేటీఎం 4.ఓ సమావేశం.. # ప్రతి విద్యార్థిని ఉన్నతంగా తీర్చిదిద్దడమే ప్రభుత్వ ధ్యేయం # కుక్కరాజుపల్లి డంపింగ్ యార్డ్ ను తనిఖీ చేసిన ఎంపిడిఓ. # పెద్దేరు ప్రాజెక్టును సందర్శించిన హైడ్రాలజీ అధికారులు. # వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా సర్వసభ్య సమావేశాన్ని జయప్రదం చేయండి - జిల్లా కార్యదర్శి కృష్ణప్ప # ఆత్మకూరులో డాక్యుమెంట్ రైటర్స్ ఆందోళన

మిట్స్ లో ఐమెక్స్ -2కె26 జాతీయ స్థాయి లో సాంకేతిక సింపోజియం

ముఖ్య అతిధిగా హెచ్.సి.ఎల్. గువి బిజినెస్ హెడ్ వినోద్

Date : 05 March 2026 08:31 PM Views : 324

నమిత న్యూస్ - Andhra Pradesh / Annamayya : మదనపల్లె - మార్చి 05 : అంగళ్ళు సమీపంలో గల మిట్స్ డీమ్డ్ టు బి యూనివెర్సిటీ నందు కంప్యూటర్ సైన్స్ మరియు ఇంజనీరింగ్ (ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అండ్ మెషిన్ లెర్నింగ్ ) విభాగం వారు ఐమెక్స్ -2కె26 (AIMEX-2K26) జాతీయ స్థాయి సాంకేతిక సింపోజియంను ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ఎస్.వినోద్, బిజినెస్ హెడ్, హెచ్.సి.ఎల్ గువి , బెంగళూరు పాల్గొని, జ్యోతి ప్రజ్వలనతో కార్యక్రమాన్ని ప్రారంభించారు. కార్యక్రమం లో ఆయన మాట్లాడుతూ ప్రస్తుతం వేగంగా మారుతున్న సాంకేతిక యుగంలో విద్యార్థులు విద్యార్థి దశ నుంచే తమ నైపుణ్యాలను మెరుగుపరచుకోవడం అత్యవసరం అని, ఈ నైపుణ్యాల ద్వారా వారు భవిష్యత్తులో ఉన్నత విద్య, ఉద్యోగ అవకాశాల్లో మెరుగైన స్థాయికి చేరుకోవచ్చన్నారు. ముఖ్యంగా కృత్రిమ మేథస్సు, మెషిన్ లెర్నింగ్ రంగాల్లో అభివృద్ధి చెందుతున్న అవకాశాలను గమనిస్తే, ఉన్నత విద్యను అభ్యసించడం వల్ల విద్యార్థులకు గ్లోబల్ స్థాయిలో అవకాశాలు దక్కే అవకాశం పెరుగుతుంది అని అన్నారు. ప్రస్తుత టెక్నాలజీతో పాటు విద్య, వైద్యం, ఆర్థిక మరియు వ్యవసాయ రంగాలలో నిపుణుల అవశ్యకత పెరిగిన నేపథ్యంలో ప్రాథమిక అవగాహనతో పాటు లోతైన పరిజ్ఞానం కలిగి ఉండడం ఎంతో అవసరం అన్నారు. తన విద్యార్ధి దశలో జరిగిన అనుభవాలను విద్యార్థులతో నెమరువేసుకున్నారు. కార్యక్రమంలో ప్రిన్సిపాల్ డాక్టర్ పి.రామనాథన్ మాట్లాడుతూ ప్రతి విద్యార్ధి క్రమశిక్షణతో మెలిగి, ఉన్నత విద్యలను అభ్యసించి భావితరాలకు ఆదర్శంగా నిలవాలన్నారు. ఈ సింపోజియంలో విస్తృత శ్రేణి సాంకేతిక సెషన్‌లు, పేపర్ ప్రెజెంటేషన్‌లు, ప్రాజెక్ట్ ఎక్స్‌పోలు మరియు పాల్గొనేవారిలో సృజనాత్మకత మరియు ఆవిష్కరణలను ప్రేరేపించడానికి రూపొందించబడిన ఆకర్షణీయమైన పోటీలను ఈ కార్యక్రమం లో నిర్వహించారు. కార్యక్రమం లో విభాగాధిపతి డాక్టర్ ఎస్ పద్మ , కోర్డినేటర్స్ ఆర్.ఉష, వి.శివరామన్, బి తారకేశ్వర రాజు, శాయీజ్ అహమ్మద్ మరియు విద్యార్థులు పాల్గొన్నారు.

SREEVANI

Reporter

Namitha News

మరిన్ని వార్తలు

Copyright © Namitha News 2026. All right Reserved.



Developed By :