Wednesday, 16 September 2026 01:58:56 AM
# మొలకలచెరువు కల్తీ మద్యం కేసులో కోర్టులో లొంగిపోయిన టిడిపి నేత జయచంద్ర రెడ్డి , గిరిధర్ రెడ్డి # హంద్రీనీవా జలాలకు జి. శంకర్ యాదవ్ జలహారతి # వినాయక మండపం వద్ద విద్యుత్ లైన్ మెన్ శంకర్ భక్తులకు అన్నదానం # మహిళా సంఘాలకు 16 కోట్లు రుణాల పంపిణీకి సిద్ధం - ఇండియన్ బ్యాంక్ మేనేజర్ మంజూర్ ఇలాహి # విద్యుత్ శాఖ ఆధ్వర్యంలో అన్నదానం - విద్యుత్ ఏడి గోవింద్ రెడ్డి # సమాజ సమస్యలకు సాంకేతిక పరిష్కారాలు చూపే దిశగా సివిల్ ఇంజినీర్లు కృషి చేయాలి - శిరీష బండపల్లి # లబ్ధిదారులకు CMRF చెక్కుల పంపిణీ చేసిన ఎమ్మెల్యే షాజహాన్ # ఆత్మకూరు ను జల్లెడ పట్టిన పోలీసులు # కట్టుకున్న భార్యను హత్య చేసిన భర్త పడపట్ల రఘు కు జీవిత ఖైదు # బొమ్మనచెరువులో పోలింగ్ కేంద్రాలపై పునఃపరిశీలించాలి - నిసార్ అహ్మద్ # టీమ్ క్రేజీ బాయ్స్ ఆధ్వర్యంలో వినాయక చవితి ఉత్సవాలు - హాజరైన జనసేన యువ నాయకుడు శ్రీరామ హరిహరన్ # మదనపల్లి పర్యటన లో రాష్ట్రీయ వాల్మీకి ధర్మ సమాజ్ స్టేట్ యూత్ ప్రెసిడెంట్ # తురకపల్లిలో వైభవంగా వినాయక చవితి వేడుకలు # బిజెపి సీనియర్ నాయకుడు శ్రీనాథ్ రెడ్డి మృతి పార్టీకి తీరని లోటు # అన్నగారిన వర్గాల అభ్యున్నతికి బిజెపి తోనే సాధ్యం - బిజెపి జాతీయ కో కన్వీనర్ విష్ణువర్ధన్ రెడ్డి. # మట్టి వినాయక ప్రతిమలే పర్యావరణానికి శ్రేయస్కరం - వాసవి క్లబ్ అధ్యక్షులు వివి కృష్ణారావు # వినాయక చవితి వేళ ప్రతి ఇంట ఆనందం వెల్లివిరియాలి - కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత ఎస్.రెడ్డి సాహెబ్ ఆకాంక్ష # పర్యావరణ ప్రేమికుడు పఠాన్ ఖాదర్ ఖాన్ - టిడిపి రాష్ట్ర కార్యదర్శి పచ్చిపాల తులసి,శ్రీరామ్ చినబాబు ప్రశంసలు # స్థానిక సంస్థల ఎన్నికల్లో చరిత్ర సృష్టిద్దాం - జనసేన శ్రేణులకు రాందాస్ చౌదరి పిలుపు # గణనాధుడి ఆశీస్సులతో రాష్ట్రం సుభిక్షంగా మారాలి - చంద్రబాబు పాలనలో ఏపీ సస్యశ్యామలం కావాలి - తెలుగుదేశం యువనేత నాగూర్ వలి ఆకాంక్ష

తంబళ్లపల్లె అభివృద్ధికి అధికార యంత్రాంగం కు కలిసి రావాలి - ప్రత్యేక అధికారి మాధవ కృష్ణారెడ్డి

Date : 08 June 2026 08:38 PM Views : 209

నమిత న్యూస్ - Andhra Pradesh / Annamayya : తంబళ్లపల్లె - జూన్ 08 ః తంబళ్లపల్లె మండల అభివృద్ధికి మండల స్థాయి అధికారులతో పాటు సచివాలయ సిబ్బంది కలిసి రావాలని తంబళ్లపల్లె ప్రత్యేక అధికారి మాధవ కృష్ణారెడ్డి సూచించారు. సోమవారం తాసిల్దార్ కార్యాలయంలో మండల స్థాయి అధికారులకు సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా మండలంలో పంచాయతీల అభివృద్ధి పనులు నిర్వహణ, పెన్షన్లు పంపిణీ, పారిశుద్ధ్యం, స్వచ్ఛ ఆంధ్ర స్వర్ణ భారతి, జలధార-జల హారతి లో జరుగుతున్న ఉపాధి హామీ పనుల వివరాలు, వెలుగు కార్యాలయంలో మహిళా సంఘాల పనితీరు, రుణాల పంపిణీ సద్వినియోగం, వ్యవసాయం, రైతు భరోసా, భూముల రీ సర్వే, రైతుల సమస్యల పరిష్కారం, విద్య, వైద్యం, సచివాలయాల పనితీరు పై ఆరా తీశారు. సచివాలయాల పరిధిలో అధికారులు క్షేత్రస్థాయిలో సమస్యలు గుర్తించి ఎప్పటికప్పుడు పరిష్కారానికి ముందు ఉండాలన్నారు. ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన స్వచ్ఛంద కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని అదే విధంగా జల సంరక్షణ లో భాగంగా జలధార, జలహారతి కార్యక్రమాల ద్వారా ప్రతి ఉపాధి కూలికి పని కల్పించి వలసల నివారణకు సహకరించాలన్నారు. ప్రభుత్వ అభివృద్ధి కార్యక్రమాలను ప్రజలకు వివరించి వారి సమస్యలను ఎప్పటికప్పుడు గుర్తించి పరిష్కారానికి పూర్తి సహకారం అందించాలన్నారు. ఈ కార్యక్రమంలో తాసిల్దార్ శ్రీనివాసులు, ఎంపీడీవో ఎంపీ ప్రసాద్, ఎంఈఓ త్యాగరాజు, ఏఈలు వినోద్ కుమార్, రమణ, సుజాత, ఏపీఎం గంగాధర్, ఏపీవో అంజనప్ప, రెవెన్యూ అధికారులు, సచివాలయ ఉద్యోగులు పాల్గొన్నారు

SREEVANI

Reporter

Namitha News

మరిన్ని వార్తలు

Copyright © Namitha News 2026. All right Reserved.



Developed By :