Monday, 14 September 2026 08:01:00 PM
# బిజెపి సీనియర్ నాయకుడు శ్రీనాథ్ రెడ్డి మృతి పార్టీకి తీరని లోటు # అన్నగారిన వర్గాల అభ్యున్నతికి బిజెపి తోనే సాధ్యం - బిజెపి జాతీయ కో కన్వీనర్ విష్ణువర్ధన్ రెడ్డి. # మట్టి వినాయక ప్రతిమలే పర్యావరణానికి శ్రేయస్కరం - వాసవి క్లబ్ అధ్యక్షులు వివి కృష్ణారావు # వినాయక చవితి వేళ ప్రతి ఇంట ఆనందం వెల్లివిరియాలి - కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత ఎస్.రెడ్డి సాహెబ్ ఆకాంక్ష # పర్యావరణ ప్రేమికుడు పఠాన్ ఖాదర్ ఖాన్ - టిడిపి రాష్ట్ర కార్యదర్శి పచ్చిపాల తులసి,శ్రీరామ్ చినబాబు ప్రశంసలు # స్థానిక సంస్థల ఎన్నికల్లో చరిత్ర సృష్టిద్దాం - జనసేన శ్రేణులకు రాందాస్ చౌదరి పిలుపు # గణనాధుడి ఆశీస్సులతో రాష్ట్రం సుభిక్షంగా మారాలి - చంద్రబాబు పాలనలో ఏపీ సస్యశ్యామలం కావాలి - తెలుగుదేశం యువనేత నాగూర్ వలి ఆకాంక్ష # సర్వ విఘ్నాలు తొలగిపోయి జిల్లా సమగ్రాభివృద్ధి సాధించాలి - ప్రజలకు వినాయక చవితి శుభాకాంక్షలు తెలిపిన జిల్లా కలెక్టర్ # మిట్స్‌లో ఆకట్టుకున్న ఎకో బప్పా మోరియా 3.0 వేడుకలు - పర్యావరణ ఆవశ్యకతను తెలియజేసిన విద్యార్థులు # టిడిపిలో డైనమిక్ లీడర్ ఎమ్మెల్యే కిషోర్ కుమార్ రెడ్డి - తెలుగుదేశం సీనియర్ నేత ఆర్.జె వెంకటేష్ # మిట్స్‌లో ‘ఎకో బప్పా మోరియా 3.0’ వినాయక చవితి వేడుకలు. # మట్టి వినాయక విగ్రహాలు, మొక్కల పంపిణీ # వివాహా నిశ్చితార్థ వేడుకల్లో శ్రీరామ్ చినబాబు # పుంగనూరు లో అసూరి బాలాజీ ఆధ్వర్యంలో ఘనంగా మాజీ సీఎం నల్లారి కిరణ్ కుమార్ రెడ్డి బ్రదర్స్ లకు జన్మదిన వేడుకలు # తక్షణమే స్పందించి ఆత్మహత్య చేసుకోవాలి అనుకొన్న యువతి ని కాపాడిన పోలీసులు # జాతీయ లోక్అదాలతో 71 కేసులు పరిష్కారం # తంబళ్లపల్లెలో 'విఘ్నం'లఘు చిత్రం ప్రారంభం # వినాయక చవితి పండుగ నేపథ్యంలో సోమవారం గ్రీవెన్స్ రద్దు - జిల్లా ఎస్పీ ధీరజ్ కునుబిల్లి # మట్టి వినాయక విగ్రహాలను పూజిద్దాం - సబ్ కలెక్టర్ చల్లా కల్యాణి # ట్రాక్టర్ ఢీకొని ఇద్దరికి తీవ్ర గాయాలు

పేదరిక నిర్మూలన, దేశ ప్రజల పొదుపు వారి యొక్క ఆర్థిక భద్రతే ప్రధాని నరేంద్ర మోడీ లక్ష్యం

భారతీయ జనతా పార్టీ రాయలసీమ కిసాన్ మోర్చా జోనల్ ఇంచార్జ్ ఓసూరి కిరణ్ కుమార్

Date : 10 November 2025 11:38 AM Views : 396

నమిత న్యూస్ - Andhra Pradesh / Annamayya : నవంబర్10: స్వదేశీ వస్తువులను కొనండి... దేశ ఆర్థిక అభివృద్ధికి తోడ్పడండి. ఒకే దేశం, ఒకే మార్కెట్, ఒకే పన్ను 99 శాతం వస్తువులపై ఐదు శాతం కన్నా తక్కువ పన్ను బడుగు,బలహీన,మహిళా, రైతాంగ, యువత మరియు మగతరగతి ప్రజలకు లబ్ధి ప్రతి కుటుంబానికి ఏడాదికి 15,000 వేల రూపాయలు లబ్ధి చేకూరేలా పన్నులో మార్పులు దేశం తో పాటు ప్రతి ప్రాంత అభివృద్ధి లక్ష్యం పేదరిక నిర్మూలన, దేశ ప్రజల పొదుపు వారి యొక్క ఆర్థిక భద్రతే ప్రధాని నరేంద్ర మోడీ లక్ష్యం అని స్వదేశీ వస్తువులను కొని దేశ ఆర్థిక అభివృద్ధికి ప్రతి ఒక్కరూ సహకరించాలని భారతీయ జనతా పార్టీ రాయలసీమ కిసాన్ మోర్చా జోనల్ ఇంచార్జ్ ఓసూరి కిరణ్ కుమార్ తెలిపారు. భారత ప్రధాని నరేంద్ర మోడీ మన్ కీ బాత్ పై స్పందిస్తూ మొదట జి ఎస్టి పై కొత్త సంస్కరణలను తీసుక వచ్చిన మోదీ కి రాష్ట్ర ప్రజల తరపున కృతజ్ఞతలు తెలిపారు. అనంతరం ఆయన మాట్లాడుతూ ప్రజా ప్రయోజనార్ధం పన్నులో మార్పులు చేపట్టడం శుభపరిణామం అన్నారు.నూతన జీఎస్టీ విధానం వల్ల బడుగు, బలహీన,మహిళా, రైతాంగ, యువత మరియు మగతరగతి ప్రజలకు లబ్ధి చేకూరేలా 99 శాతం వస్తువుల కొనుగోలు పై ఐదు శాతం కన్నా తక్కువగా పన్ను తగ్గించడం జరిగిందని గుర్తు చేశారు. తద్వారా సామాన్యులకు ఆర్థిక భారం తగ్గి ప్రతి ఏటా కుటుంబానికి సుమారు 15వేల రూపాయల ఆదాయం చేకూరుతుందన్నారు. దీని ద్వారా దేశంతో పాటు ప్రతి ప్రాంతం త్వరగా వృద్ధి చెందుతాయన్నారు. ప్రతి చిన్న వ్యాపారస్తులకు మేలు జరిగేలా MSME సబ్సిడీతో కూడిన రుణాన్ని కేంద్ర ప్రభుత్వం అందిస్తుందని దీనిని ప్రతి ఒక్కరు సద్వినియోగం చేసుకోవాలని కోరారు. జాతిపిత మహాత్మా గాంధీ స్పూర్తితో ప్రతి ఒక్కరూ స్వదేశీ వస్తువులను కొనుగోలు, విక్రయాలు జరపాలని కిరణ్ కుమార్ పిలుపునిచ్చారు.

Sreenivasulu

Reporter

Namitha News

మరిన్ని వార్తలు

Copyright © Namitha News 2026. All right Reserved.



Developed By :