Saturday, 12 September 2026 12:57:12 PM
# తంబళ్లపల్లె సమస్యల పై అధికారులు దృష్టి సారించండి-ప్రజా దర్బార్ లో మాజీ ఎమ్మెల్యే జి శంకర్ యాదవ్ # ప్రజల సమస్యల పరిష్కారానికి ఐకమత్యంతో పనిచేయండి - మాజీ ఎమ్మెల్యే జి.శంకర్ యాదవ్ # మిట్స్ లో హెచ్‌ఆర్ కెరీర్స్ & ఏఐ ఆధారిత డిజిటల్ మార్కెటింగ్ ట్రెండ్స్ పై అతిధి ఉపన్యాస # వినాయక మండపాల నిర్వహణ పై సూచనలు -- డి.ఎస్పీ. బుచ్చిరాజు # ఎంపీ మిథున్ రెడ్డిపై ఉప్పొంగిన అభిమానం - యువనేత హర్షవర్ధన్ రెడ్డి ఆధ్వర్యంలో సేవా కార్యక్రమాలు # పఠాన్ ఖాదర్ ఖాన్ సేవలు స్ఫూర్తిదాయకం - టిడిపి రాష్ట్ర కార్యదర్శి పచ్చిపాల తులసి రామకృష్ణ హర్షం # మంచి చేయడమే కానీ మోసం చేయడం తనకు తెలియదు # ప్రజా శ్రేయస్సుకై పరితపించే నేత ఎంపీ మిథున్ రెడ్డి - వైకాపా రాష్ట్ర కార్యదర్శి ఎస్.ఏ కరీముల్లా ప్రశంసలు # రాష్ట్రంలో తీవ్ర కరువు ను కేంద్ర విపత్తుగా పరిగణిస్తూ కరువు ప్యాకేజీని ప్రకటించాలి - BKMU జిల్లా కార్యదర్శి తోపు కృష్ణప్ప # హ్యూమన్ రైట్స్ ముసుగు లో ఘరానా మోసాలు # విబిజి రాంజీ నీటి సంరక్షణ లో సప్లై చానల్స్ ఆదర్శవంతం - డ్వామా పీడీ వెంకటరత్నం # వీధిలైట్లు లేక అంధకారంలో కొటాల # ప్రకృతి సేద్యంలో నాలుగు పంటలతో నాలుగు రకాల ఆదాయం # ఏ.ఆర్ మొబైల్స్ వారి ఆకర్షణీమైన పండుగ ఆఫర్లు # మారుమూల గ్రామాల్లో ఎయిడ్స్ పై అవగాహన పెంచాలి - ఎంపీడీవో ఉషారాణి. # సిబిఎన్ చీకటి రోజులు దూరమై మూడేళ్ల # సాంకేతిక పరిజ్ఞానంతో నేరస్థుల ఆటకట్టిస్తున్న జిల్లా పోలీసులు - # 100% ఉత్తీర్ణత లక్ష్యంగా పని చేయాలి కేజీబీవీ లో విద్యార్థులతో మాట్లాడుతున్న ఎంఈఓ పద్మావతి # నిత్యవసర సరుకులు ధరలను తగ్గించాలని సిపిఐ ఆధ్వర్యంలో నిరసన # కొటాల పశువైద్య కేంద్రాన్ని మదనపల్లె డిడి ఆకస్మిక తనిఖీ

మల్లయ్య కొండలో వైభవంగా వరుణ యాగం - పోటెత్తిన భక్తులు

Date : 18 August 2026 07:17 PM Views : 95

నమిత న్యూస్ - Andhra Pradesh / Annamayya : తంబళ్లపల్లె - ఆగస్టు 18 : తంబళ్లపల్లె కు సమీపంలోని మల్లయ్య కొండ లో వెలసిన శ్రీ భ్రమరాంబిక మల్లికార్జున స్వామి ఆలయంలో సోమవారం కుంభాభిషేకం, వరుణ యాగం వైభవోపేతంగా నిర్వహించినట్లు దేవాదాయ శాఖ ఈవో మునిరాజా, రికార్డ్ అసిస్టెంట్ కొండకిట్ట లు తెలిపారు. ఉదయం వారి ఆధ్వర్యంలో వేద పండితుడు సంజీవ పవన్ కుమార్ శర్మ మరియు ఆలయ అర్చకులు ఈశ్వరప్ప, మల్లికార్జున స్వాములు మహా శివునికి పుష్పాలంకరణ,ప్రత్యేక పూజలు, కుంకుమార్చన,అర్చనలు, అభిషేకాలు, ధూప దీప నైవేద్యాలు, కర్పూర హారతులు సమర్పించిన తర్వాత ఆలయ ప్రాంగణంలో అశేష జనవాహిని మధ్య పెద్ద ఎత్తున వరుణ యాగం నిర్వహించారు. ఈ సందర్భంగా గణపతి పూజ, నవగ్రహ పూజ, శివునికి మహా కుంభాభిషేకం నిర్వహించారు. ఈ సందర్భంగా అర్చకులు, భక్తులు వర్షాలు సమృద్ధిగా కురిసి పాడిపంటలతో రైతులు, ప్రజలు సుఖ సంతోషాలతో వర్ధిల్లాలని స్వామివారిని ప్రత్యేక ప్రార్థనలతో ఆర్తించారు. ఈ కార్యక్రమం అనంతరం పెద్ద ఎత్తున అన్నదానం నిర్వహించారు. కుంభాభిషేకానికి నియోజకవర్గ స్థాయిలో వేలాదిగా భక్తులు తరలి రావడంతో మల్లయ్య కొండ భక్తులతో కిటకిటలాడింది. ఆర్టీసీ అధికారులు ప్రత్యేక బస్సులు ఏర్పాటు చేయగా వందలాదిగా ప్రైవేట్ వాహనాల్లో భక్తులు తరలివచ్చారు.

SREEVANI

Reporter

Namitha News

మరిన్ని వార్తలు

Copyright © Namitha News 2026. All right Reserved.



Developed By :