నమిత న్యూస్ - Andhra Pradesh / Annamayya : వ్యాపార రంగం లో రాణించి ఉన్నత స్థాయి కి ఎదగాలి కట్టా దొర స్వామి నాయుడు, తెలుగు యువత రాష్ట్ర అధ్యక్షులు శ్రీరామ్ చినబాబు వ్యాపార రంగంలో రాణించి ఉన్నత స్థాయికి ఎదగాలని టిడిపి నేతలు కట్ట దొర స్వామి నాయుడు, తెలుగు యువత రాష్ట్ర అధ్యక్షుడు శ్రీరామ్ చినబాబులు ఎం హెచ్ ఆర్ యజమాని హరి కి సూచించారు.మదనపల్లె పట్టణంలోని రెడ్డీస్ కాలనీలో నూతనంగా ఏర్పాటు చేసిన యమ్ హెచ్ ఆర్ గార్డెన్ డిలైట్ ఫ్యామిలీ రెస్టారెంట్ ప్రారంభోత్సవ కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిదిలుగా టీడీపీ సీనియర్ నేత కట్టా దొర స్వామి నాయుడు, తెలుగు యువత రాష్ట్ర అధ్యక్షులు శ్రీరామ్ చినబాబు, పాల్గొని శుభాకాంక్షలు తెలియజేసి, వ్యాపారం విజయవంతంగా కొనసాగాలని ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో టీడీపీ సీనియర్ నాయకులు యాలగిరి దొరస్వామి నాయుడు, రాష్ట్ర బోయ కార్పొరేషన్ డైరెక్టర్ మండెం ప్రభాకర్, తెలుగు యువత నాయకులు మెహబూబ్ ఖాన్, ప్రభు గౌడ్, మడికయ్యల శివాలయం డైరెక్టర్ కలిశం ప్రకాష్ నాయుడు తో పాటు కూటమి పార్టీల నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.
Reporter
Namitha News