Saturday, 12 September 2026 12:57:13 PM
# తంబళ్లపల్లె సమస్యల పై అధికారులు దృష్టి సారించండి-ప్రజా దర్బార్ లో మాజీ ఎమ్మెల్యే జి శంకర్ యాదవ్ # ప్రజల సమస్యల పరిష్కారానికి ఐకమత్యంతో పనిచేయండి - మాజీ ఎమ్మెల్యే జి.శంకర్ యాదవ్ # మిట్స్ లో హెచ్‌ఆర్ కెరీర్స్ & ఏఐ ఆధారిత డిజిటల్ మార్కెటింగ్ ట్రెండ్స్ పై అతిధి ఉపన్యాస # వినాయక మండపాల నిర్వహణ పై సూచనలు -- డి.ఎస్పీ. బుచ్చిరాజు # ఎంపీ మిథున్ రెడ్డిపై ఉప్పొంగిన అభిమానం - యువనేత హర్షవర్ధన్ రెడ్డి ఆధ్వర్యంలో సేవా కార్యక్రమాలు # పఠాన్ ఖాదర్ ఖాన్ సేవలు స్ఫూర్తిదాయకం - టిడిపి రాష్ట్ర కార్యదర్శి పచ్చిపాల తులసి రామకృష్ణ హర్షం # మంచి చేయడమే కానీ మోసం చేయడం తనకు తెలియదు # ప్రజా శ్రేయస్సుకై పరితపించే నేత ఎంపీ మిథున్ రెడ్డి - వైకాపా రాష్ట్ర కార్యదర్శి ఎస్.ఏ కరీముల్లా ప్రశంసలు # రాష్ట్రంలో తీవ్ర కరువు ను కేంద్ర విపత్తుగా పరిగణిస్తూ కరువు ప్యాకేజీని ప్రకటించాలి - BKMU జిల్లా కార్యదర్శి తోపు కృష్ణప్ప # హ్యూమన్ రైట్స్ ముసుగు లో ఘరానా మోసాలు # విబిజి రాంజీ నీటి సంరక్షణ లో సప్లై చానల్స్ ఆదర్శవంతం - డ్వామా పీడీ వెంకటరత్నం # వీధిలైట్లు లేక అంధకారంలో కొటాల # ప్రకృతి సేద్యంలో నాలుగు పంటలతో నాలుగు రకాల ఆదాయం # ఏ.ఆర్ మొబైల్స్ వారి ఆకర్షణీమైన పండుగ ఆఫర్లు # మారుమూల గ్రామాల్లో ఎయిడ్స్ పై అవగాహన పెంచాలి - ఎంపీడీవో ఉషారాణి. # సిబిఎన్ చీకటి రోజులు దూరమై మూడేళ్ల # సాంకేతిక పరిజ్ఞానంతో నేరస్థుల ఆటకట్టిస్తున్న జిల్లా పోలీసులు - # 100% ఉత్తీర్ణత లక్ష్యంగా పని చేయాలి కేజీబీవీ లో విద్యార్థులతో మాట్లాడుతున్న ఎంఈఓ పద్మావతి # నిత్యవసర సరుకులు ధరలను తగ్గించాలని సిపిఐ ఆధ్వర్యంలో నిరసన # కొటాల పశువైద్య కేంద్రాన్ని మదనపల్లె డిడి ఆకస్మిక తనిఖీ

అనవసర ఆరోపణలు మాని అభివృద్ధికి సహకరించండి

ప్రజల అభిమానం చూరగొన్న నాయకుడు ఎమ్మెల్యే షాజహాన్ బాషా

Date : 03 September 2026 04:48 PM Views : 59

నమిత న్యూస్ - Andhra Pradesh / Annamayya : అనవసర ఆరోపణలు మాని అభివృద్ధికి సహకరించండి - ప్రజల అభిమానం చూరగొన్న నాయకుడు ఎమ్మెల్యే షాజహాన్ బాషా - పార్టీ ప్రతిష్టను దెబ్బతీసే చర్యలు మానుకోండి - టిడిపి నియోజకవర్గం బిసి సెల్ అధ్యక్షులు ముసలికుంట నాగయ్య హితవు మదనపల్లె : మదనపల్లె నియోజకవర్గం అభివృద్ధి,ప్రజా శ్రేయస్సుకై పరితపిస్తున్న ఎమ్మెల్యే షాజహాన్ బాషాపై విమర్శలు చేయడం తగదని,అనవసర ఆరోపణలు మాని అభివృద్ధికి సహకరించాలని నియోజకవర్గం తెలుగుదేశం పార్టీ బిసి సెల్ అధ్యక్షులు ముసలికుంట నాగయ్య హితవు పలికారు.గురువారం తన కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకర్ల సమావేశంలో బీసీ నాయకులు ముద్దిమడుగు రామ్మూర్తి,కలిచెర్ల రామ్మూర్తిలతో కలసి ఆయన పాల్గొన్నారు.ఈ సందర్భంగా ముసలికుంట నాగయ్య మాట్లాడుతూ ప్రజల దశాబ్దాల కల అయినటువంటి మదనపల్లి జిల్లాను సాకారం చేసిన ఘనత షాజహాన్ బాషాకే దక్కుతుందన్నారు.ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు దృష్టికి మదనపల్లి సమస్యలను తీసుకెళ్లడంతోపాటు పట్టణంలో మౌలిక సదుపాయాలు కల్పనకు కోట్లాది రూపాయల నిధులను మంజూరు చేయించారన్నారు.నియోజకవర్గంలో సిసి రోడ్లు,డ్రైనేజీల నిర్మాణాలను శరవేగంగా పూర్తి చేశారన్నారు.ముఖ్యంగా పట్టణ శివారు ప్రాంతాలలో సిసి రోడ్ల నిర్మాణాలు పూర్తి చేసి ప్రజల రాకపోకలకు ఇబ్బందులు లేకుండా చూశారన్నారు.మదనపల్లి ఎమ్మెల్యేగా రెండోసారి ఎన్నికై చరిత్ర సృష్టించడమే కాకుండా నియోజకవర్గాన్ని గణనీయమైన అభివృద్ధి చేసి ప్రజల అభిమానాన్ని చూరగొన్న ఏకైక నాయకుడని కొనియాడారు.అంతేకాకుండా నియోజకవర్గంలో బడుగు,బలహీన వర్గాల వారికి రాజకీయ ప్రాధాన్యత కల్పిస్తూ వారికి అండగా నిలిచారని ప్రశంసించారు.త్వరలో జరుగబోవు స్థానిక సంస్థల ఎన్నికల్లో ఎమ్మెల్యే షాజహాన్ బాషా నేతృత్వంలో కూటమి అభ్యర్థులు క్లీన్ స్వీప్ సాధిస్తారని ధీమా వ్యక్తం చేశారు.దీనిని జీర్ణించుకోలేక కొంతమంది ఎమ్మెల్యేపై ఆరోపణలు చేస్తున్నారని ఇది సమంజసం కాదని,ఇటువంటి ఆరోపణలు చేసి పార్టీ ప్రతిష్టను దిగజార్చవద్దని ఆయన సూచించారు.

B.MANI KUMAR

Reporter

Namitha News

మరిన్ని వార్తలు

Copyright © Namitha News 2026. All right Reserved.



Developed By :