నమిత న్యూస్ - Andhra Pradesh / Annamayya : హార్సిలీ హిల్స్ చూడడానికి వచ్చారా....!?! కూటమి నుంచి ముగ్గురు మంత్రులు వచ్చారు, మదనపల్లె అభివృద్ధికి ఇచ్చిన హామిలు సున్నా....!! జనం లేని ప్రమాణ స్వీకారం చూసి నోటమాట రాలేదేమో...?? మేము ముక్కు నేలకు రాయాలా....!! పిపిపి విధానంలో మెడికల్ కాలేజ్ రద్దు ప్రకటన చేయని మీరు ఏమీ రాస్తారు సత్య కుమార్... మంత్రుల పర్యటనపై మదనపల్లె వైసిపి సమన్వయకర్త నిసార్ అహమ్మద్ వ్యంగ్యాస్త్రాలు -- అభివృద్ధి, సంక్షేమం వైసిపి పాలనలోనే.... ఎంపి మిథున్ రెడ్డి నియోజకవర్గ అభివృద్ధిలో తనదైన ముద్ర వేశారు... మదనపల్లె మెడికల్ కాలేజ్, అభివృద్ధి, చిప్పిలి, బండకాడపల్లి సమ్మర్ స్టోరేజ్ ట్యాంక్, రోడ్ల విస్తరణ, కొత్తగా రోడ్ల ఏర్పాటుపై స్పష్టమైన హామీ ఇవ్వని మంత్రుల పర్యటన హార్సిలీహిల్స్ చూడడానికి, జనంలేని మీ నాయకుడి ప్రమాణ స్వీకారం చూడడానికి వచ్చారా... అంటూ మదనపల్లె వైసిపి సమన్వయకర్త నిసార్ అహమ్మద్ అహమ్మద్ వ్యంగ్యాస్త్రాలు సంధించారు. శనివారం మదనపల్లె రూరల్ కురవంక పంచాయతీ భువనేశ్వరి ఆలయం సమీపంలో కోటి సంతకాల రచ్చబండ నిర్వహించారు. ఈ సందర్భంగా నిసార్ అహమ్మద్ మదనపల్లెలో మంత్రుల పర్యటనపై విమర్శలు గుప్పించారు. కూటమి మంత్రుల మదనపల్లె పర్యటనలో మదనపల్లె అభివృద్ధి విస్మరించారని, స్పష్టమైన హామిలు ఇవ్వని మంత్రులను ప్రశ్నించలేని కూటమి నాయకులు సిగ్గుపడాలని ఎద్దేవా చేశారు. మెడికల్ కాలేజ్ పైన వైద్య ఆరోగ్య శాఖమంత్రి సత్య కుమార్ యాదవ్ ప్రకటన చేస్తారని ఆశిస్తే ఆయన మాత్రం జగన్మోహన్ రెడ్డి, వైసిపి ప్రభుత్వ ముక్కు నేలకు రాయాలని చెప్పడం విడ్డురంగా వుందని, మెడికల్ కాలేజ్ పిపిపి విధానాన్ని రద్దు చేస్తామని చెప్పని నువ్వు ఏమీ రాస్తావు అని ప్రశ్నించారు. మదనపల్లె కేంద్రంగా జరిగిన కిడ్ని రాకెట్ పై ఏమి చర్యలు, హాస్పిటల్ సీజ్ చేస్తారా, సిట్, సిఐడి, సిబిఐ విచారణ చేస్తామని ప్రకటించకుండా జారుకోవడం నీకే చెల్లింది. కిడ్ని రాకెట్ సంబంధాలు ఇంక ఎవరికి వున్నాయి, గుట్ట ఎమీ అనే విషయాలు చెప్పారా అని ప్రశ్నించారు. పౌర సరఫరాల శాఖ మంత్రి పార్టీకి చెందిన వ్వక్తి ప్రమాణ స్వీకారం చేస్తే వచ్చారు తప్ప ఆయన సివిల్ సప్లై పైన మాట మాత్రం మాట్లాడక పోవడం దురదృష్టకరం అన్నారు. వైసిపి పాలనలో రేషన్ బియ్యం ఇంటివద్దనే ఇచ్చేవారని, ఎంతో బాగుండేదని అన్నారు. మదనపల్లె పట్టణం అభివృద్ధి, రోడ్ల దుస్థితిపై ఎలాంటి ప్రకటనలు చేయకపోవడం వారు కేవలం టూర్ పైన వచ్చారా, మార్కెట్ కమిటీ చైర్మన్, పాలకమండలి ప్రమాణ స్వీకారం తప్ప ప్రజలకు ఉపయోగపడింది శూన్యం, ప్రజాధనం వృధా పర్యటనగా అభివర్ణించారు. మరోవైపు మెడికల్ కాలేజ్ మదనపల్లెకు వైసిపి ప్రభుత్వం తెచ్చి నిర్మాణం చేపడితే, కూటమి ప్రభుత్వం ప్రయివేటీకరణ చేయడానికి ప్రయత్నం చేస్తోందని, ప్రభుత్వమే నిర్వహించాలని డిమాండ్ చేశారు. మదనపల్లెతో మంచి సత్సంబంధాలు కలిగి వైద్య ఆరోగ్య శాఖ మంత్రి సత్య కుమార్ యాదవ్ పిపిపి విధానాన్ని రద్దు చేస్తామని ప్రకటించే దమ్ముందా అని సవాలు విసిరారు. మదనపల్లె మెడికల్ కాలేజ్ కు 29 కోట్లు ఖర్చు చేసారని, పులివెందులలో మెడికల్ కాలేజ్ పూర్తి చేశారని, ముక్కు నేలకు రాయాలనే మీరు పిపిపి విధానం రద్దు చేస్తామని ఎందుకు ప్రకటించలేదని నిలదీశారు. మదనపల్లె పట్టణంలో రోడ్లు వేస్తాం, బహుదా పై బ్రిడ్జ్ కడతాం, సిటిఎం రోడ్డు రూపురేఖలు మార్చివేస్తాం అనే వారు చెట్లు కొట్టి వేసి చోద్యం చూస్తున్నారని విమర్శలు గుప్పించారు. మదనపల్లె నుంచి బెంగుళూరు, రామసముద్రం, నిమ్మనపల్లె రోడ్లు గుంతలు తెలి వాహనదారులు ఇబ్బందులు పడుతున్నా పట్టించుకోకుండా వున్నారని విమర్శలు గుప్పించారు. ఏదైనా అభివృద్ధి జరిగిందంటే అది కేవలం రాజంపేట పార్లమెంటు సభ్యులు పివి మిథున్ రెడ్డి ద్వారానే అని స్పష్టం చేశారు. మదనపల్లె అభివృద్ధి కోసం మెడికల్ కాలేజ్, కేంద్రీయ విశ్వవిద్యాలయం, జిల్లా హాస్పిటల్ అభివృద్ధి, బిటి కాలేజ్ అన్నింటా ఎంపి మిథున్ రెడ్డి ముద్ర వుందని వివరించారు. మదనపల్లె అభివృద్ధికి దోహదం చేయని మంత్రుల పర్యటనపై కూటమి నాయకులు సిగ్గు పడాలని అన్నారు. ఈ కార్యక్రమంలో పెద్ద సంఖ్యలో వైసిపి నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.
Reporter
Namitha News