Tuesday, 15 September 2026 10:38:28 PM
# కట్టుకున్న భార్యను హత్య చేసిన భర్త పడపట్ల రఘు కు జీవిత ఖైదు # టీమ్ క్రేజీ బాయ్స్ ఆధ్వర్యంలో వినాయక చవితి ఉత్సవాలు - హాజరైన జనసేన యువ నాయకుడు శ్రీరామ హరిహరన్ # మదనపల్లి పర్యటన లో రాష్ట్రీయ వాల్మీకి ధర్మ సమాజ్ స్టేట్ యూత్ ప్రెసిడెంట్ # తురకపల్లిలో వైభవంగా వినాయక చవితి వేడుకలు # బిజెపి సీనియర్ నాయకుడు శ్రీనాథ్ రెడ్డి మృతి పార్టీకి తీరని లోటు # అన్నగారిన వర్గాల అభ్యున్నతికి బిజెపి తోనే సాధ్యం - బిజెపి జాతీయ కో కన్వీనర్ విష్ణువర్ధన్ రెడ్డి. # మట్టి వినాయక ప్రతిమలే పర్యావరణానికి శ్రేయస్కరం - వాసవి క్లబ్ అధ్యక్షులు వివి కృష్ణారావు # వినాయక చవితి వేళ ప్రతి ఇంట ఆనందం వెల్లివిరియాలి - కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత ఎస్.రెడ్డి సాహెబ్ ఆకాంక్ష # పర్యావరణ ప్రేమికుడు పఠాన్ ఖాదర్ ఖాన్ - టిడిపి రాష్ట్ర కార్యదర్శి పచ్చిపాల తులసి,శ్రీరామ్ చినబాబు ప్రశంసలు # స్థానిక సంస్థల ఎన్నికల్లో చరిత్ర సృష్టిద్దాం - జనసేన శ్రేణులకు రాందాస్ చౌదరి పిలుపు # గణనాధుడి ఆశీస్సులతో రాష్ట్రం సుభిక్షంగా మారాలి - చంద్రబాబు పాలనలో ఏపీ సస్యశ్యామలం కావాలి - తెలుగుదేశం యువనేత నాగూర్ వలి ఆకాంక్ష # సర్వ విఘ్నాలు తొలగిపోయి జిల్లా సమగ్రాభివృద్ధి సాధించాలి - ప్రజలకు వినాయక చవితి శుభాకాంక్షలు తెలిపిన జిల్లా కలెక్టర్ # మిట్స్‌లో ఆకట్టుకున్న ఎకో బప్పా మోరియా 3.0 వేడుకలు - పర్యావరణ ఆవశ్యకతను తెలియజేసిన విద్యార్థులు # టిడిపిలో డైనమిక్ లీడర్ ఎమ్మెల్యే కిషోర్ కుమార్ రెడ్డి - తెలుగుదేశం సీనియర్ నేత ఆర్.జె వెంకటేష్ # మిట్స్‌లో ‘ఎకో బప్పా మోరియా 3.0’ వినాయక చవితి వేడుకలు. # మట్టి వినాయక విగ్రహాలు, మొక్కల పంపిణీ # వివాహా నిశ్చితార్థ వేడుకల్లో శ్రీరామ్ చినబాబు # పుంగనూరు లో అసూరి బాలాజీ ఆధ్వర్యంలో ఘనంగా మాజీ సీఎం నల్లారి కిరణ్ కుమార్ రెడ్డి బ్రదర్స్ లకు జన్మదిన వేడుకలు # తక్షణమే స్పందించి ఆత్మహత్య చేసుకోవాలి అనుకొన్న యువతి ని కాపాడిన పోలీసులు # జాతీయ లోక్అదాలతో 71 కేసులు పరిష్కారం

మిట్స్ లో ఘనంగా జాతీయ సైన్స్ డే

Date : 28 February 2026 08:38 PM Views : 255

నమిత న్యూస్ - Andhra Pradesh / Annamayya : మదనపల్లె - ఫిబ్రవరి 28 : అంగళ్ళు సమీపంలో గల మిట్స్ డీమ్డ్ టు బి యూనివర్సిటీ నందు ఎన్.ఎస్.ఎస్. విభాగం వారి ఆధ్వర్యంలో నేషనల్ సైన్స్ డే ను ఘనంగా జరుపుకున్నారు. కార్యక్రమంలో యూనివర్సిటీ రిజిస్ట్రార్ డాక్టర్ డి ప్రదీప్ కుమార్, భౌతిక శాస్త్ర విభాగాధిపతి డాక్టర్. చంద్రశేఖర్, యెన్.ఎస్.ఎస్ ఆఫీసర్ రాజేష్ లు సర్ సీవి రామన్ చిత్ర పటానికి పూలమాల వేసి ఆయన ను స్మరించుకున్నారు. కార్యక్రమంలో డాక్టర్ డి ప్రదీప్ కుమార్ మాట్లాడుతూ ఆధునిక భారత విజ్ఞాన శాస్త్రవేత్తల పరిశోధనా ప్రతిభను అంతర్జాతీయస్థాయిలో ఇనుమడింపజేసిన వ్యక్తుల్లో సర్ సీవి రామన్ అగ్రగణ్యుడు అని, ప్రతిష్టాత్మక దేశ పౌర పురస్కారం భారతరత్న అందుకున్న తొలి విజ్ఞాన కెరటం అని అన్నారు. ఈ దినము మన భారతీయ వైజ్ఞానిక ప్రతిభ ప్రపంచానికి తెలిసిన రోజు గా పరిగణిస్తామని, వైజ్ఞానిక రంగంలో నొబెల్ అందుకున్న దేశం మనదే అని అన్నారు. విజ్ఞానం కేవలం పాఠ్యపుస్తకాలకే పరిమితం కాదని, అది మన జీవితాన్ని మార్చగల శక్తి అని ఆయన పేర్కొన్నారు. ప్రశ్నించే మనసు, పరిశోధించే తత్వం, సాధించాలనే పట్టుదల ఉంటే ప్రతి విద్యార్థి శాస్త్రవేత్తగా ఎదగగలడని ఆయన అన్నారు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, అంతరిక్ష సాంకేతికత, పునరుత్పాదక శక్తి వనరులు వంటి రంగాలలో దేశం వేగంగా అభివృద్ధి చెందుతోందని, యువత తమ ప్రతిభను దేశాభివృద్ధికి వినియోగించాలని తెలిపారు. నేషనల్ సైన్స్ డే సందర్బంగా నిర్వహించిన వ్యాస రచన పోటీలలో ప్రతిభ చూపిన విద్యార్థులకు ప్రశంశ పత్రాలను మరియు బహుమతులను అందజేశారు. కార్యక్రమంలో డీన్-స్కూల్ అఫ్ కంప్యూటింగ్ డాక్టర్ చంద్ర ప్రకాష్ గుప్తా, అధ్యాపకులు మరియు విద్యార్థులు పాల్గొన్నారు.

RAVI KUMAR REDDY

Admin

Namitha News

మరిన్ని వార్తలు

Copyright © Namitha News 2026. All right Reserved.



Developed By :