నమిత న్యూస్ - Andhra Pradesh / Annamayya : కూటమి ప్రభుత్వం ఇంటిఇంటికి రేషన్ పంపిణీ వాహన వ్యవస్థ ను రద్దుచేయడం పై ఇరవైవేల మంది రోడ్డున పడ్డాం మమ్మల్ని ఆదుకోండి ... కూటమి ప్రభుత్వం మే21న జరిగిన మంత్రివర్గ సమావేశంలో యం.యం.డి వాహన వ్యవస్థను రద్దు చేస్తూ తీసుకొన్న నిర్ణయం తో ఇరవై వేల మంది రోడ్డున పడ్డామని , చాలామంది ఎస్సి , ఎస్టీ కార్పోరేషన్ లోన్లు తీసుకున్నామని , వాటిని ఎలా వాయిదాలు చెల్లించాలి , ఎలా కుటుంబాన్ని పోషించాలి అంటూ , మాకు ఎవరూ వాహనాలను ఉరకనే ఇవ్వలేదు , మేము కష్టపడినదానికే 30%ఇస్తున్నారు , వాహనానికి నెలవారీ కంతులు చెల్లించుకొంటున్నాం . మాకు జనవరి 2027వరకూ అగ్రిమెంట్ ఉన్నా ముందుగానే రద్దుపరుస్తూ తీసుకొన్న నిర్ణయాన్ని పునః పరిశీలించాలని స్థానిక సబ్ కలెక్టర్ మేఘస్వరూప్ కు వినతిపత్రం సమర్పించిన యం.డి.యస్. వాహన యూనియన్ నాయకులు .
Reporter
Namitha News