Thursday, 16 April 2026 06:47:25 PM
# త్వరలో గ్రామ పంచాయతీ ఎన్నికలు # వైఎస్సార్ సిపి పుంగనూరు నియోజకవర్గం ఎంప్లాయిస్ & పెన్షనర్స్ వింగ్ ప్రెసిడెంట్ గా పుంగనూరు వరదా రెడ్డి # మిట్స్ కు 2026–27 సంవత్సరానికి “యూనివర్సల్ హ్యూమన్ వ్యాల్యూస్" నోడల్ సెంటర్‌ గా గుర్తింపు # మిట్స్ లో ఘనంగా జాతీయ స్థాయి సాంకేతిక సింపోజియం "మేకొనన్స్ - 2K26" # మద్యం తరలిస్తున్న వాహనం తో పాటు సీజ్ # చెత్త డంపింగ్ ను అడ్డుకుంటే కఠిన చర్యలు - తహసీల్దార్ శ్రీనివాసులు # ఇంటర్ పరీక్షా ఫలితాల్లో తంబళ్లపల్లి విద్యార్థుల ప్రతిభ # స్వచ్ఛ ఆంధ్ర కార్యక్రమానికి పెద్దపీట వేయండి # అంబేద్కర్ జన్మదిన సందర్భంగా అన్నదానం # 22 ఏ చుక్కల భూముల సమస్యలకు శాశ్వత పరిష్కారం చూపాలి # జలధార - జలహారతి పనులను ఆకస్మిక తనిఖీ చేసిన కలెక్టర్ # టీడీపీ జాతీయ వర్కింగ్ ప్రెసిడెంట్ గా నారా లోకేష్ ఎన్నిక తో ఆత్మకూరు లో సంబరాలు # డాక్టర్ బాబా సాహెబ్ అంబేద్కర్ ఆదర్శప్రాయుడు - తాహాసిల్దార్ శ్రీనివాసులు # విద్యుత్ సమస్యలు ఎప్పటికప్పుడు పరిష్కారం - ఏ.ఈ. సురేంద్ర # టిడిపి ఆధ్వర్యంలో ఘనంగా అంబేద్కర్ జయంతి వేడుకలు # డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ దీనజన బాంధవుడు - డాక్టర్ వెంకట్ # అణగారిన వర్గాల ఆత్మబంధువు డాక్టర్ బి.ఆర్.అంబేద్కర్ - క్రైమ్ బ్రాంచ్ సిఐ చంద్రశేఖర్,ఈయు గౌరవాధ్యక్షులు నాగూర్ వలి # మిట్స్ లో ఘనంగా డాక్టర్ బి.ఆర్. అంబేద్కర్ 135వ జయంతి # కుల నిర్మూలనతోనే సామాజిక సమానత్వం సాధ్యం - సిపిఎం జిల్లా కార్యదర్శి పోతగాళ్ల శ్రీనివాసులు # నవ భారత రాజ్యాంగ రూపశిల్పి డాక్టర్ బి.ఆర్. అంబేద్కర్ అడుగుజాడలే ఆదర్శం కావాలి - ఎమ్మెల్యే షాజహాన్ భాష

సీఐ తల్లి స్వర్ణకుమారిని హత్య చేసిన నిందితుడు అరెస్ట్

మృతురాలిని పూడ్చిపెట్టిన ప్రదేశంలోనే పోస్టుమార్టం

Date : 09 October 2024 06:56 PM Views : 115

నమిత న్యూస్ - Andhra Pradesh / Annamayya : సిఐ తల్లి స్వర్ణకుమారి హత్య నమ్మించి... వృద్ధురాలిని హతమార్చాడు.. సీఐ తల్లి స్వర్ణ కుమారి ని హత్య చేసిన నిందితులను అరెస్టు చేసిన మదనపల్లి పోలీసులు.. ఒంటరిగా ఉన్న స్వర్ణ కుమారికి చేదోడు వాదోడుగా ఉన్న వెంకటేష్ ఆరోగ్యం కుదుట పరచడానికి తీసుకువెళ్ళి దారుణంగా హతమార్చడం జరిగిందని అన్నమయ్య జిల్లా SP విద్యాసాగర్ నాయుడు పేర్కొన్నారు. స్వర్ణ కుమారి వద్ద ఉన్న నగదు, నగల కోసం ఆశపడి ఆమెకున్న అనారోగ్యాన్ని ఆసరాగా చేసుకొని ఆరోగ్యం కుదుట పరుస్తానని చెప్పి మరో వ్వక్తితో కలిసి హతమార్చాడని బుధవారం మదనపల్లె డిఎస్పీ కార్యాలయంలో జరిగిన విలేఖరుల సమావేశంలో వివరాలు వెల్లడించారు. 12 రోజుల తర్వాత అదృశ్యం కేసు మిస్టరీని మదనపల్లె పోలీసులు చేదించి నిందితులను అదుపులోకి తీసుకున్నారని మృతురాలని పూడ్చిపెట్టిన ప్రదేశంలోనే పోస్టుమార్టం నిర్వహించి హత్య కేసు నమోదు చేశారని, పేరం స్వర్ణకుమారి (62) మృతిపై జిల్లా SP తెలిపారు. స్వర్ణకుమారి జగన్ కాలనీలో ఇంటిని నిర్మించుకుని అక్కడ నివాసం ఉంటోంది. అదే ప్రాంతంలో మేడికుర్తికి చెందిన సురేంద్ర, యల్లమ్మ దంపతులు నివాసముంటున్నారు.‌ వీరికి కుమారుడు వెంకటేష స్వర్ణకుమారికి చేదోడు వాదోడుగా ఉంటూ అప్పుడప్పుడు పనుల్లో సహాయ పడేవాడు. ఈ క్రమంలో స్వర్ణకుమారి వద్ద ఉన్న నగదు, నగలపై ఆశపడ్డాడు. ఎలాగైనా వాటిని కొట్టేయాలని పథకం పన్నాడు. స్వర్ణకుమారి అప్పుడప్పుడు తనకు ఆరోగ్యం బాగోలేదని వెంకటేష్‌తో చెబుతుండేది. దీన్ని ఆసరాగా చేసుకున్న వెంకటేష్ స్థానిక గజ్జలకుంటలో ఉన్న అనిల్ తోకలిసి నగదు, నగలు దోచుకునేందుకు పథకం పన్నాడు. నాటు వైద్యం చేసి మంత్రించేవారు తెలుసని, అక్కడికి వెళ్తే ఆరోగ్యం నయమౌతుందని స్వర్ణ కుమారిని వెంకటేష్ నమ్మించాడు. ఈ క్రమంలో గత నెల 28 వ తేదీన తన ద్విచక్ర వాహనంలో స్వర్ణకుమారిని ఎక్కించుకొని గజ్జలకుంటలో ఉన్న అనీల్ ఇంటికి వెళ్లాడు. అనిల్ ఇంట్లో స్వర్ణకుమారి పూజలో నిమగ్నమైన సమయంలో సుత్తితో ఆమె తలపై మోది హత్య చేశారు. ఆమె ఒంటిపై ఉన్న నగలను దోచుకుని స్థానికంగా ఉన్న‌ ఓ ప్రైవేటు పైనాన్స్ బ్యాంకులో తాకట్టు పెట్టి సొమ్ము చేసుకున్నారు. అనంతరం ఆమె మృతదేహాన్ని ఓ గోనె సంచిలో వేసి, ఆరోజు రాత్రి నీరుగట్టవారిపల్లి సమీపంలోని స్మశాన వాటికలో అప్పటికే ఓ శవాన్ని పూడ్చి ఉన్న చోట గుంతను తవ్వి అందులో గోనె సంచితో పాటే మృతదేహాన్ని వేసి కప్పెట్టేసి అక్కడి నుంచి పరారయ్యారు. నేరుగా తిరుపతికి వెళ్లి రేణిగుంటలో విమానం ద్వారా బెంగళూరుకు చేరుకొని బెంగళూరు నుంచి రాజస్థాన్ పరారయ్యారు. తల్లి అదృశ్యం కావడంతో కుమారుడు నాగేంద్ర అక్టోబర్ 1 వ తేదీన మదనపల్లె తాలూకా పోలీసులకు ఫిర్యాదు చేయడంతో అదృశ్యం కేసు నమోదు చేసిన పోలీసులు వివిధ కోణాల్లో దర్యాప్తును ప్రారంభించి నిందితులను అదుపులోకి తీసుకున్నారు. వారిచ్చిన సమాచారంతో మంగళవారం నీరుగట్టవారిపల్లి స్మశాన వాటికలో మృతదేహాన్ని వెలికి తీసి అక్కడే పోస్ట్ మార్టం నిర్వహించి మృతదేహాన్ని కుమారుడు నాగేంద్ర ప్రసాద్ కు అప్పగించారని తెలిపారు...

B.MANI KUMAR

Reporter

Namitha News

మరిన్ని వార్తలు

Copyright © Namitha News 2026. All right Reserved.



Developed By :