నమిత న్యూస్ - Andhra Pradesh / Annamayya : అర్హులైన పేదలందరికీ పట్టణాల్లో 2 సెంట్లు,గ్రామాల్లో 3 సెంట్లు ఇవ్వాలి సూపర్ సిక్స్ హామీలు అమలు చేయాలి సిపిఐ నాయకులు డిమాండ్ అర్హులైన పేదలందరికీ పట్టణాలలో 2 సెంట్లు,గ్రామీణ ప్రాంతాల్లో 3 సెంట్లు చొప్పున ఇళ్ళ స్థలాలు ఇవ్వాలని, ఇంటి నిర్మణానికి 5 లక్షలు ఇవ్వాలని,"సూపర్ సిక్స్" హామీలు అమలు చేయాలని మదనపల్లి సబ్ కలెక్టర్ కార్యాలయం వద్ద సిపిఐ ఆధ్వర్యంలో నిరసన వ్యక్తం చేయడం జరిగింది. ఈ సందర్భంగా సిపిఐ జిల్లా కార్యవర్గ సభ్యులు సాంబ శివ, కృష్ణప్ప,నియోజవర్గ కార్యదర్శి కె మురళి మాట్లాడుతూ కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి ఏడాది కావస్తున్నా ఎన్నికల్లో ఇచ్చిన ఒక్క హామీ కూడా అమలు చేయలేదన్నారు. పేదలకు ఇచ్చిన ఇంటి స్థలాల హామీని తుంగలో తొక్కుతున్నారని,సచివాలయాల పైన కూటమి నాయకుల పెత్తనం పెరుగుతుందన్నారు. ఎన్నికల ప్రచారంలో కూటమి ప్రభుత్వం మదనపల్లిని జిల్లాగా ప్రకటిస్తామని, కడప బెంగుళూరు రైల్వే లైన్ మదనపల్లి మీదుగానే కొనసాగిస్తామని, బిటి కళాశాలను యూనివర్సిటీగా చేస్తామని హామీలు ఇచ్చారని, అధికారంలోకి వచ్చిన తర్వాత ఇచ్చిన హామీలన్నీ తుంగలో తొక్కి,ప్రభుత్వ మెడికల్ కళాశాలను పి 4 విధానంలో మార్చారని, మదనపల్లి ప్రభుత్వ ఆసుపత్రిని ప్రైవేటు వ్యక్తులకు అప్పగించే ప్రయత్నం చేస్తున్నారని అన్నారు. ఇప్పటికైనా కూటం ప్రభుత్వం స్పందించి ఇల్లు లేని పేదలందరికీ పట్టణ ప్రాంతాల్లో 2 సెంట్లు, గ్రామీణ ప్రాంతాల్లో 3 సెంట్లు ఇళ్ళ స్థలాలలు ఇవ్వాలని, మదనపల్లి జిల్లా గా ప్రకటించాలని, బిటి కళాశాలను యూనివర్సిటీగా ప్రకటించాలని,కడప బెంగుళూరు రైల్వే లైను పనులు వెంటనే ప్రారంభించాలని,మదనపల్లి ప్రభుత్వ ఆసుపత్రిని ప్రభుత్వ రంగంలోనే కొనసాగించాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో సిపిఐ నాయకులు చంద్ర,సూరి,దేవా,తిరుమల,మస్తాన్,వాసు తదితరులు పాల్గొన్నారు.
సూపర్ సిక్స్ హామీలు అమలు చేయాలి సిపిఐ నాయకులు డిమాండ్
Reporter
Namitha News