నమిత న్యూస్ - Andhra Pradesh / Annamayya : తంబళ్లపల్లె అక్టోబర్ 28 : తంబళ్లపల్లె మండలం లోని సమస్యలపై అధికారులు పరిష్కారానికి కృషి చేయాలని ఎంపీడీవో ఉపేందర్ రెడ్డి సూచించారు. సోమవారం ఆయన నూతనంగా వచ్చిన కార్యదర్శులు, సచివాలయ ఉద్యోగులతో జరిగిన సమీక్షలో ఆయన మాట్లాడుతూ సచివాలయ పరిధిలోని అధికార యంత్రాంగం ప్రతి నెల ఒకటో తేదీన పెన్షన్లు పంపిణీ కార్యక్రమం తో పాటు గ్రామాలలో పారిశుద్ధ్యం, తాగునీరు, వీధిలైట్లు, మౌలిక సదుపాయాలపై ఎప్పటికప్పుడు గుర్తించి పరిష్కారానికి సంబంధిత అధికారులు , ప్రజా ప్రతినిధులు, అధికార పార్టీ నాయకుల సహకారంతో కృషి చేయాలని కోరారు. పల్లెపండగలో మంజూరైన సిసి రోడ్ల నిర్మాణాలు తో పాటు పక్క గృహాల నిర్మాణాలు వేగవంతం చేయడానికి సహకరించాలన్నారు. ఈ సమీక్షలో ఈఓ ఆర్ డి దిలీప్ కుమార్ నాయక్,మండల స్థాయి అధికారులు, కార్యదర్శులు, సచివాలయ సిబ్బంది పాల్గొన్నారు.
Reporter
Namitha News