Sunday, 13 September 2026 06:10:42 PM
# మిట్స్‌లో ‘ఎకో బప్పా మోరియా 3.0’ వినాయక చవితి వేడుకలు. # మట్టి వినాయక విగ్రహాలు, మొక్కల పంపిణీ # వివాహా నిశ్చితార్థ వేడుకల్లో శ్రీరామ్ చినబాబు # పుంగనూరు లో అసూరి బాలాజీ ఆధ్వర్యంలో ఘనంగా మాజీ సీఎం నల్లారి కిరణ్ కుమార్ రెడ్డి బ్రదర్స్ లకు జన్మదిన వేడుకలు # తక్షణమే స్పందించి ఆత్మహత్య చేసుకోవాలి అనుకొన్న యువతి ని కాపాడిన పోలీసులు # జాతీయ లోక్అదాలతో 71 కేసులు పరిష్కారం # తంబళ్లపల్లెలో 'విఘ్నం'లఘు చిత్రం ప్రారంభం # వినాయక చవితి పండుగ నేపథ్యంలో సోమవారం గ్రీవెన్స్ రద్దు - జిల్లా ఎస్పీ ధీరజ్ కునుబిల్లి # మట్టి వినాయక విగ్రహాలను పూజిద్దాం - సబ్ కలెక్టర్ చల్లా కల్యాణి # ట్రాక్టర్ ఢీకొని ఇద్దరికి తీవ్ర గాయాలు # తంబళ్లపల్లె సమస్యల పై అధికారులు దృష్టి సారించండి-ప్రజా దర్బార్ లో మాజీ ఎమ్మెల్యే జి శంకర్ యాదవ్ # ప్రజల సమస్యల పరిష్కారానికి ఐకమత్యంతో పనిచేయండి - మాజీ ఎమ్మెల్యే జి.శంకర్ యాదవ్ # మిట్స్ లో హెచ్‌ఆర్ కెరీర్స్ & ఏఐ ఆధారిత డిజిటల్ మార్కెటింగ్ ట్రెండ్స్ పై అతిధి ఉపన్యాస # వినాయక మండపాల నిర్వహణ పై సూచనలు -- డి.ఎస్పీ. బుచ్చిరాజు # ఎంపీ మిథున్ రెడ్డిపై ఉప్పొంగిన అభిమానం - యువనేత హర్షవర్ధన్ రెడ్డి ఆధ్వర్యంలో సేవా కార్యక్రమాలు # పఠాన్ ఖాదర్ ఖాన్ సేవలు స్ఫూర్తిదాయకం - టిడిపి రాష్ట్ర కార్యదర్శి పచ్చిపాల తులసి రామకృష్ణ హర్షం # మంచి చేయడమే కానీ మోసం చేయడం తనకు తెలియదు # ప్రజా శ్రేయస్సుకై పరితపించే నేత ఎంపీ మిథున్ రెడ్డి - వైకాపా రాష్ట్ర కార్యదర్శి ఎస్.ఏ కరీముల్లా ప్రశంసలు # రాష్ట్రంలో తీవ్ర కరువు ను కేంద్ర విపత్తుగా పరిగణిస్తూ కరువు ప్యాకేజీని ప్రకటించాలి - BKMU జిల్లా కార్యదర్శి తోపు కృష్ణప్ప # హ్యూమన్ రైట్స్ ముసుగు లో ఘరానా మోసాలు

మదనపల్లి పద్మశాలి సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో ప్రథమ కార్తీక వన భోజనం

Date : 16 November 2025 07:20 PM Views : 204

నమిత న్యూస్ - Andhra Pradesh / Annamayya : మదనపల్లి పద్మశాలి సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో ప్రథమ కార్తీక వన భోజనం - శ్రీ మృత్యుంజయశ్వర శివాలయం నందు ప్రత్యేక పూజలు - భక్త మార్కండేయ చరిత్ర హరికథ - సాంస్కృతిక కార్యక్రమాలు విజేతలకు బహుమతులు - సంఘం గౌరవ అధ్యక్షులు గుత్తికొండ త్యాగరాజు, అధ్యక్షులు గుత్తి శ్రీరాములు మదనపల్లి నవంబర్ 17, ( బి. శ్రీనివాసులు రెడ్డి తరణం విలేఖరి ) : మదనపల్లి పద్మశాలి సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో ప్రథమ కార్తీక వన భోజన కార్యక్రమం ఆధ్యాత్మిక పండుగ వాతావరణంలో నిర్వహించమని సంఘం గౌరవ అధ్యక్షులు గుత్తికొండ త్యాగరాజు, అధ్యక్షులు గుత్తి శ్రీరాములు తెలిపారు. ఆదివారం స్థానిక అమ్మ చెరువు మిట్ట భరతమాత స్ఫూర్తి కేంద్రం గుట్టపై వెలసిన శ్రీ మృత్యుంజయేశ్వర శివాలయం నందు ప్రత్యేక పూజలు, భక్త మార్కండేయ చరిత్ర హరికథ నిర్వహించడం జరిగింది. ఇందులో భాగంగా కార్తీక వనభోజన కార్యక్రమానికి మదనపల్లి పద్మశాలి సంక్షేమ సంఘం గౌరవ అధ్యక్షులు గుత్తికొండ త్యాగరాజు, అధ్యక్షులు గుత్తి శ్రీరాములు, ప్రధాన కార్యదర్శి సామల చిన్న వెంకటసుబ్బయ్య, ఉపాధ్యక్షులు ఆమంచి మురళి జింక ఆనంద, కార్యదర్శులు భీమిశెట్టి శంకరనారాయణ, జక్కా రమేష్, సహాయక కోశాధికారి పలవర సురేష్, ప్రచార కార్యదర్శులు గుర్రం ఆదెప్ప, పుత్తా రాజేష్, మరియు కార్యవర్గ సభ్యులు, గౌరవ సలహాదారుల సంయుక్త ఆధ్వర్యంలో కార్తీక వనభోజన కార్యక్రమం కన్నుల పండుగగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి పట్టణ నలవైపుల నుంచి పద్మశాలీలు పెద్ద సంఖ్యలో హాజరై స్వామివారిని దర్శించుకుని కృపాకటాక్షానికి పాత్రులు కావడం జరిగింది. ఇందులో భాగంగా ఆలయంలో ఉదయం స్వామి వారికి అభిషేకం, భక్తులకు అల్పాహారం, అనంతరం పద్మశాలి సంక్షేమ సంఘం ఆత్మీయ సమావేశం, భాగవతరణి హేమావతి చే భక్త మార్కండేయ చరిత్ర హరికథ కాలక్షేపం, మధ్యాహ్నం కార్తీక వనభోజనాలు, సాంస్కృతిక కార్య క్రమాలు, విజేతలకు బహుమతి ప్రధానం, రాత్రి రఘునాథ స్వామి శిష్య బృందం చే భజనలు కొనసాగాయి. ఈ సందర్భంగా సంఘం గౌరవ అధ్యక్షులు గుత్తికొండ త్యాగరాజు, అధ్యక్షులు గుత్తి శ్రీరాములు మాట్లాడుతూ మదనపల్లి పట్టణంలో శ్రీ మృత్యుంజయేశ్వర శివాలయం నందు ప్రథమ కార్తీక వనభోజనం కార్య క్రమాన్ని ఏర్పాటు చేయడం,ఈ కార్య క్రమానికి కుల బాంధ వులు పెద్ద ఎత్తున తరలివచ్చి జయ ప్రదం చేయడం పట్ల హర్షం వ్యక్తం చేశారు. అదేవిధంగా పద్మశాలి సంక్షేమ సంఘాన్ని బలోపేతం చేయడం తో పాటు, హక్కులను సాధించుకోవడానికి కలిసికట్టుగా ముందుకు వెళ్దామని పిలుపు నిచ్చారు. కార్తీక మాసంలో కుల బాంధవులంతా సమావేశమై శ్రీ మృత్యుంజయేశ్వర ఆలయ ప్రాంగణంలో కార్తీక్ వనభోజన కార్యక్రమాన్ని నిర్వహించుకోవడం, అభివృద్ధిపై చర్చించు కోవడం కార్తీకదీపం వెలిగించి దైవ కృపకు పాత్రలు కావడం, ఆధ్యాత్మిక వాతావరణం లో వేడుకలు జరుపు కోవడం ఎంతో సంతోషంగా ఉందని పేర్కొన్నారు. రానున్న రోజుల్లోనూ ఇదే తరహాలో సంఘాన్ని అభివృద్ధి చేసుకోవడం తో పాటు, యువతలో ఆధ్యాత్మిక భావనలను పెంపొందించి సన్మార్గంలో నడిపించ డానికి ఇలాంటి కార్య క్రమాలు ఎంతో దోహద పడతాయని పేర్కొన్నారు. ఈ సందర్భంగా నిర్వహించిన సాంస్కృతిక కార్యక్రమాలు ఆహుతులను ఎంతగానో అలరించాయి అన్నారు. పిల్లల్లో దాగి ఉన్న ప్రతిభను, సృజనాత్మ కతను వెలికి తీసి ప్రోత్సహించే దిశగా విజేతలకు బహుమతులు అందజేశామని తెలిపారు. ఈ కార్యక్రమం లో సంఘం గౌరవ సలహాదారులు తిరువీధి మురహరి, చేవూరి నాగరాజు, జింకా వెంకటరమణ, గుణి శెట్టి లక్ష్మీనారాయణ, చెన్నా భాస్కర్, కార్యవర్గ సభ్యులు బోగా గోపాలరావు, మంచి మధు, చెన్నా ఆది నారాయణ, ఇంజమూరి విశ్వనాధ్, పొలంకి రెడ్డెప్ప, గుత్తి రాజా, సుధా రెడ్డి శేఖర్, ఉట్ల శంకర నారాయణ, జనగం కృష్ణ తో పాటు కమిటీ సభ్యులు, పద్మశాలి కుటుంబ సభ్యులు పాల్గొన్నారు.

B.MANI KUMAR

Reporter

Namitha News

మరిన్ని వార్తలు

Copyright © Namitha News 2026. All right Reserved.



Developed By :