నమిత న్యూస్ - Andhra Pradesh / Annamayya : తంబళ్లపల్లె జూన్ 6 : తంబళ్లపల్లె మండల కేంద్రం ఎన్టీఆర్ విగ్రహం వద్ద సోమవారం తెలుగుదేశం పార్టీ జెండా ఆవిష్కరణ కార్యక్రమాన్ని తంబళ్లపల్లె నియోజకవర్గం తెలుగుదేశం పార్టీ ఇంచార్జ్ దాసరిపల్లి జయచంద్ర రెడ్డి ప్రారంభిస్తారని మండల టిడిపి అధ్యక్షుడు రెడ్డప్పరెడ్డి, మండల మహిళా నాయకురాలు సిద్ధమ్మ విలేకరులకు తెలిపారు. ఈ జెండా ఆవిష్కరణతో పాటు మండల కేంద్రంలో జయ చంద్రారెడ్డి సారధ్యంలో భారీ ర్యాలీ జరుగుతుందని ఈ కార్యక్రమానికి మండలంలోని తెలుగుదేశం పార్టీ సీనియర్ నాయకులు, మాజీ ప్రజా ప్రతినిధులు, నాయకులు, కార్యకర్తలు, అభిమానులు పెద్ద ఎత్తున పాల్గొనాలని వారు ఓ ప్రకటనలో కోరారు.
Admin
Namitha News