Monday, 14 September 2026 04:46:43 PM
# బిజెపి సీనియర్ నాయకుడు శ్రీనాథ్ రెడ్డి మృతి పార్టీకి తీరని లోటు # అన్నగారిన వర్గాల అభ్యున్నతికి బిజెపి తోనే సాధ్యం - బిజెపి జాతీయ కో కన్వీనర్ విష్ణువర్ధన్ రెడ్డి. # మట్టి వినాయక ప్రతిమలే పర్యావరణానికి శ్రేయస్కరం - వాసవి క్లబ్ అధ్యక్షులు వివి కృష్ణారావు # వినాయక చవితి వేళ ప్రతి ఇంట ఆనందం వెల్లివిరియాలి - కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత ఎస్.రెడ్డి సాహెబ్ ఆకాంక్ష # పర్యావరణ ప్రేమికుడు పఠాన్ ఖాదర్ ఖాన్ - టిడిపి రాష్ట్ర కార్యదర్శి పచ్చిపాల తులసి,శ్రీరామ్ చినబాబు ప్రశంసలు # స్థానిక సంస్థల ఎన్నికల్లో చరిత్ర సృష్టిద్దాం - జనసేన శ్రేణులకు రాందాస్ చౌదరి పిలుపు # గణనాధుడి ఆశీస్సులతో రాష్ట్రం సుభిక్షంగా మారాలి - చంద్రబాబు పాలనలో ఏపీ సస్యశ్యామలం కావాలి - తెలుగుదేశం యువనేత నాగూర్ వలి ఆకాంక్ష # సర్వ విఘ్నాలు తొలగిపోయి జిల్లా సమగ్రాభివృద్ధి సాధించాలి - ప్రజలకు వినాయక చవితి శుభాకాంక్షలు తెలిపిన జిల్లా కలెక్టర్ # మిట్స్‌లో ఆకట్టుకున్న ఎకో బప్పా మోరియా 3.0 వేడుకలు - పర్యావరణ ఆవశ్యకతను తెలియజేసిన విద్యార్థులు # టిడిపిలో డైనమిక్ లీడర్ ఎమ్మెల్యే కిషోర్ కుమార్ రెడ్డి - తెలుగుదేశం సీనియర్ నేత ఆర్.జె వెంకటేష్ # మిట్స్‌లో ‘ఎకో బప్పా మోరియా 3.0’ వినాయక చవితి వేడుకలు. # మట్టి వినాయక విగ్రహాలు, మొక్కల పంపిణీ # వివాహా నిశ్చితార్థ వేడుకల్లో శ్రీరామ్ చినబాబు # పుంగనూరు లో అసూరి బాలాజీ ఆధ్వర్యంలో ఘనంగా మాజీ సీఎం నల్లారి కిరణ్ కుమార్ రెడ్డి బ్రదర్స్ లకు జన్మదిన వేడుకలు # తక్షణమే స్పందించి ఆత్మహత్య చేసుకోవాలి అనుకొన్న యువతి ని కాపాడిన పోలీసులు # జాతీయ లోక్అదాలతో 71 కేసులు పరిష్కారం # తంబళ్లపల్లెలో 'విఘ్నం'లఘు చిత్రం ప్రారంభం # వినాయక చవితి పండుగ నేపథ్యంలో సోమవారం గ్రీవెన్స్ రద్దు - జిల్లా ఎస్పీ ధీరజ్ కునుబిల్లి # మట్టి వినాయక విగ్రహాలను పూజిద్దాం - సబ్ కలెక్టర్ చల్లా కల్యాణి # ట్రాక్టర్ ఢీకొని ఇద్దరికి తీవ్ర గాయాలు

మదనపల్లె ను ఐటి కారిడార్ గా తీర్చిదిద్దెలా కృషి చేయాలి

రాయల్ యూత్ సొసైటీ అధ్యక్షులు రేగడి ప్రసాద్ కుమార్ డిమాండ్

Date : 22 February 2026 11:30 AM Views : 301

నమిత న్యూస్ - Andhra Pradesh / Annamayya : యువత, విద్యార్థులు, మహిళలకు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వ సబ్సిడీ పథకాలను అందించాలి - మదనపల్లె ను ఐటి కారిడార్ గా తీర్చిదిద్దెలా కృషి చేయాలి - రైతుల ప్రయోజనాల కోసం శీతల గిడ్డంగులు, పల్ప్ యూనిట్లు నెలకొల్పాలి - అసెంబ్లీ సమావేశాల్లో ఎమ్మెల్యే మాట్లాడి అభివృద్ధి కి బాటలు వేయాలి - రాయల్ యూత్ సొసైటీ అధ్యక్షులు రేగడి ప్రసాద్ కుమార్ డిమాండ్ - అన్నమయ్య జిల్లాకు మదనపల్లె పేరు చేర్చడం అంటే బలిజలను చులకన చేయడమే మదనపల్లె ఫిబ్రవరి 21, గత నాలుగు ఏళ్ళ గా మదనపల్లె జిల్లా కోసం బలిజ సేవా సమితి ఆధ్వర్యంలో రాజీ లేని పోరాటం చేయడం జరిగిందని, అది జరగక పొగ అన్నమయ్య జిల్లా కేంద్రాన్ని మదనపల్లె కు మార్చడం జరిగిందని రాయల్ యూత్ సొసైటీ రాష్ట్ర అధ్యక్షులు రేగడి ప్రసాద్ కుమార్ అన్నారు. శనివారం రాయల్ యూత్ సొసైటీ కార్యాలయం లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశం లో ఆయన మాట్లాడుతూ అన్నమయ్య జిల్లా పేరును శ్రీకృష్ణదేవ రాయల జిల్లాగా పెట్టాలని కోరుతూ బిసి రాష్ట్ర మంత్రి జనార్దన్ రెడ్డికి, ఆరోగ్య శాఖ మంత్రి సత్య కుమార్ కు టిడిపి రాజంపేట పార్లమెంట్ అధ్యక్షులకు, కూటమీ పార్టీల నాయకులకు, మదనపల్లి ఎమ్మెల్యే కి వినతి పత్రాలు ఇవ్వడం జరిగిందని గుర్తు చేశారు. అయితే బలిజల విజ్ఞప్తిని పరిగణలోకి తీసు కోకుండా అన్నమయ్య జిల్లాకు మదనపల్లె అన్నమయ్య జిల్లాగా మార్చడం అంటే బలిజ సామాజిక వర్గాన్ని చులకన చేయడమే అన్నారు. జిల్లా కేంద్రమైన మదనపల్లె నందు మహిళలు, యువత, విద్యార్థులు, నిరు ద్యోగులకు ఉద్యోగ మరియు ఉపాధి కల్పన కోసం ప్రస్తుతం కొనసాగుతున్న అసెంబ్లీ సమావేశాల్లో ఎమ్మెల్యే షాజహాన్ బాషా మాట్లాడి సబ్సిడీ రుణాలు అందించే గట్టి ప్రయత్నం చేయాలని కోరారు. మదనపల్లి డివిజన్ లో అత్యధికంగా రైతులు టమోటా పంట సాగు చేసుకుంటున్నారని, అయితే సరైన గిట్టుబాటు ధరల రేఖ మద్దతు ధరలు అందక రైతులు అప్పులు ఊబిలో చిక్కుకుపోతున్నారని, అంతే కాకుండా మామిడి, పూలు, కూరగాయలు, ఉద్యానవన పంటలు సాగు రైతులు వున్నారని, వారి కోసం ప్రభుత్వం వెంటనే శీతల గిడ్డంగులను నిర్మించాలని డిమాండ్ చేశారు. అదే విధంగా చేనేత రంగానికి కేంద్రంగా మదనపల్లె వృద్ధి చెందుతున్న నేపథ్యంలో మహిళలు, నేతన్నలకు చిన్న తరహా పరిశ్రమలు, హ్యాండ్లూమ్స్, పవర్ లూమ్స్ ఏర్పాటుకు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ఎం ఎస్ ఎం ఈ కింద సబ్సిడీ రుణాలు అందే విధంగా చర్యలు తీసుకోవాలని కోరారు. కాగా సాంకేతిక పరిజ్ఞానంలో వస్తున్న విప్లవాత్మక మార్పులతో మదనపల్లె ను ఐటి హబ్ గా ఏర్పాటు చేసేందుకు యువతకు విద్యార్థులకు ప్రత్యేక నైపుణ్య శిక్షణ కార్యక్రమాలను విదేశాలు ఇతర రాష్ట్రాల్లో అందించే చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. ఈ అంశాలపై శాసనసభ సమావేశాలు ముగిసే లోపు ఎమ్మెల్యే అసెంబ్లీలో ప్రస్తావించి వీటిపై ప్రభుత్వం స్పందించే విధంగా ఒప్పించాలని కోరారు. అలాగే ముఖ్యమంత్రి, విద్యాశాఖ మంత్రి, ఉపముఖ్యమంత్రి దృష్టికి తీసుకు వెళ్లాలన్నారు. అదేవిధంగా రైతన్నకు అండగా నిలిచేందుకు పల్ప్ తయారీ యూనిట్లను నెలకొల్పా లన్నారు. యువత, విద్యార్థులు, రైతులు కు ఉపాధి అవకాశాలు సన్నగిళ్లడం తో వ్యసనాలకు బానిసై కుటుంబాలకు దూర మవుతున్నారని గుర్తు చేశారు. స్వల్ప కాలంలో ఆదాయం పెంపొందించే విధంగా నియోజక వర్గంలో చేతివృత్తులు, స్వయం ఉపాధి రంగాల్లో యువతను, నిరు ద్యోగులను ప్రోత్సహించాలని అప్పుడే అభివృద్ధి సాధ్యమన్నారు. నియోజక వర్గం, జిల్లా కేంద్రంలో దీర్ఘకాలిక ప్రయోజనాలను పరిగణలోనికి తీసుకుంటూనే యువతను మహిళలను రైతాంగాన్ని నిరుద్యోగులను ఆదుకునే గట్టి ప్రయత్నాలు చేపట్టాలని కోరారు.

B.MANI KUMAR

Reporter

Namitha News

మరిన్ని వార్తలు

Copyright © Namitha News 2026. All right Reserved.



Developed By :