Monday, 14 September 2026 10:47:33 PM
# బిజెపి సీనియర్ నాయకుడు శ్రీనాథ్ రెడ్డి మృతి పార్టీకి తీరని లోటు # అన్నగారిన వర్గాల అభ్యున్నతికి బిజెపి తోనే సాధ్యం - బిజెపి జాతీయ కో కన్వీనర్ విష్ణువర్ధన్ రెడ్డి. # మట్టి వినాయక ప్రతిమలే పర్యావరణానికి శ్రేయస్కరం - వాసవి క్లబ్ అధ్యక్షులు వివి కృష్ణారావు # వినాయక చవితి వేళ ప్రతి ఇంట ఆనందం వెల్లివిరియాలి - కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత ఎస్.రెడ్డి సాహెబ్ ఆకాంక్ష # పర్యావరణ ప్రేమికుడు పఠాన్ ఖాదర్ ఖాన్ - టిడిపి రాష్ట్ర కార్యదర్శి పచ్చిపాల తులసి,శ్రీరామ్ చినబాబు ప్రశంసలు # స్థానిక సంస్థల ఎన్నికల్లో చరిత్ర సృష్టిద్దాం - జనసేన శ్రేణులకు రాందాస్ చౌదరి పిలుపు # గణనాధుడి ఆశీస్సులతో రాష్ట్రం సుభిక్షంగా మారాలి - చంద్రబాబు పాలనలో ఏపీ సస్యశ్యామలం కావాలి - తెలుగుదేశం యువనేత నాగూర్ వలి ఆకాంక్ష # సర్వ విఘ్నాలు తొలగిపోయి జిల్లా సమగ్రాభివృద్ధి సాధించాలి - ప్రజలకు వినాయక చవితి శుభాకాంక్షలు తెలిపిన జిల్లా కలెక్టర్ # మిట్స్‌లో ఆకట్టుకున్న ఎకో బప్పా మోరియా 3.0 వేడుకలు - పర్యావరణ ఆవశ్యకతను తెలియజేసిన విద్యార్థులు # టిడిపిలో డైనమిక్ లీడర్ ఎమ్మెల్యే కిషోర్ కుమార్ రెడ్డి - తెలుగుదేశం సీనియర్ నేత ఆర్.జె వెంకటేష్ # మిట్స్‌లో ‘ఎకో బప్పా మోరియా 3.0’ వినాయక చవితి వేడుకలు. # మట్టి వినాయక విగ్రహాలు, మొక్కల పంపిణీ # వివాహా నిశ్చితార్థ వేడుకల్లో శ్రీరామ్ చినబాబు # పుంగనూరు లో అసూరి బాలాజీ ఆధ్వర్యంలో ఘనంగా మాజీ సీఎం నల్లారి కిరణ్ కుమార్ రెడ్డి బ్రదర్స్ లకు జన్మదిన వేడుకలు # తక్షణమే స్పందించి ఆత్మహత్య చేసుకోవాలి అనుకొన్న యువతి ని కాపాడిన పోలీసులు # జాతీయ లోక్అదాలతో 71 కేసులు పరిష్కారం # తంబళ్లపల్లెలో 'విఘ్నం'లఘు చిత్రం ప్రారంభం # వినాయక చవితి పండుగ నేపథ్యంలో సోమవారం గ్రీవెన్స్ రద్దు - జిల్లా ఎస్పీ ధీరజ్ కునుబిల్లి # మట్టి వినాయక విగ్రహాలను పూజిద్దాం - సబ్ కలెక్టర్ చల్లా కల్యాణి # ట్రాక్టర్ ఢీకొని ఇద్దరికి తీవ్ర గాయాలు

మిట్స్ లో ఏ.ఐ. & సిలికాన్ ఆధారిత సాంకేతిక ఆవిష్కరణలు, ఎంట్రప్రెన్యూర్‌షిప్ పై వర్క్ షాప్

Date : 02 February 2026 05:19 PM Views : 197

నమిత న్యూస్ - Andhra Pradesh / Annamayya : మదనపల్లి - ఫిబ్రవరి 02 : అంగళ్లు సమీపంలో గల మిట్స్ డీమ్డ్ టు బీ యూనివర్సిటీ నందు కంప్యూటర్ సైన్స్ అండ్ ఇంజనీరింగ్ (డేటా సైన్స్) విభాగం వారు ఏఐసిటిఈ (అఖిల భారత సాంకేతిక విద్యా మండలి), న్యూ ఢిల్లీ వారి సహకారంతో కృత్రిమ మేధస్సు, సిలికాన్ ఆధారిత సాంకేతిక ఆవిష్కరణలు, ఎంట్రప్రెన్యూర్‌షిప్ & రీసెర్చ్ అవకాశాలు అనే అంశంపై మూడు రోజుల జాతీయ స్థాయి వర్కుషాప్ ను నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిధిగా ఐఐటీ మద్రాస్ ఆర్&డి అడ్వైజర్ ప్రొఫెసర్ దండు రాధాప్రసాదరాజు పాల్గొన్నారు. కార్యక్రమంలో ఆయన మాట్లాడుతూ ఇంజినీరింగ్ కళాశాలలు కేవలం బోధనకే పరిమితం కాకుండా, వినూత్న పరిశోధనల ద్వారా సమాజ సమస్యలకు పరిష్కారాలు చూపాల్సిన అవసరం ఉందని తెలిపారు. ముఖ్యంగా యువ అధ్యాపకులు మరియు విద్యార్థులు స్టార్టప్‌లు, పేటెంట్లు, మరియు పరిశోధన ప్రాజెక్టుల వైపు దృష్టి సారిస్తే, జాతీయ స్థాయిలో నిధులు పొందే అవకాశాలు విస్తృతంగా ఉన్నాయని అన్నారు. కార్యక్రమంలో భారత రక్షణ పరిశోధన మరియు అభివృద్ధి సంస్థ డీఆర్‌డీఓ, రక్షణ మంత్రిత్వ శాఖలో మాజీ శాస్త్రవేత్త ప్రొఫెసర్ కె.ఎస్. భానుమతి మరియు ఎస్ ఓ సి టెక్నాలజీస్ ప్రైవేట్ లిమిటెడ్, ప్రతినిధి డాక్టర్ వీణ ఎస్ చక్రవర్తి లు పాల్గొని పరిశ్రమల్లో డిజిటల్ టెక్నాలజీ సహాయంతో ఉత్పత్తి నాణ్యత పెంచడం, తయారీ సమయం తగ్గించడం, ఖర్చులు నియంత్రించడం మరియు పర్యావరణహిత తయారీ విధానాలు అమలు చేయడంలో కీలక పాత్ర పోషిస్తుందని తెలిపారు. మరియు సిలికాన్ టెక్నాలజీల పాత్ర అత్యంత కీలకమని, ముఖ్యంగా ఆరోగ్యం, పరిశ్రమలు, రక్షణ, ఆటోమేషన్ మరియు స్మార్ట్ పరికరాల రంగాల్లో వీటి వినియోగం వేగంగా పెరుగుతోందని తెలిపారు. విద్యార్థులు ఈ ఆధునిక సాంకేతికతల్లో నైపుణ్యం సాధిస్తే అంతర్జాతీయ స్థాయిలో ఉద్యోగ అవకాశాలు లభిస్తాయని పేర్కొన్నారు. కార్యక్రమంలో ప్రిన్సిపాల్ డాక్టర్ పి.రామనాథన్, విభాగాధిపతి డాక్టర్ ఎస్ కుసుమ, కోఆర్డినేటర్ డాక్టర్ కే.నిర్మల దేవి, అధ్యాపకులు మరియు విద్యార్థులు పాల్గొన్నారు.

RAVI KUMAR REDDY

Admin

Namitha News

మరిన్ని వార్తలు

Copyright © Namitha News 2026. All right Reserved.



Developed By :

A PHP Error was encountered

Severity: Core Warning

Message: Module 'igbinary' already loaded

Filename: Unknown

Line Number: 0

Backtrace: