నమిత న్యూస్ - Andhra Pradesh / Annamayya : రాష్ట్ర మంత్రులను మర్యాదపూర్వకంగా కలిసిన జి.శంకర్ యాదవ్ మదనపల్లె : అన్నమయ్య జిల్లా రాయచోటిలో శనివారం నిర్వహించిన ప్రజాచేరువ కార్యక్రమానికి రోడ్లు భవనాల శాఖ మంత్రి,అన్నమయ్య జిల్లా ఇంచార్జి మంత్రి బిసి జనార్ధన్ రెడ్డి,రవాణా,క్రీడా శాఖ మంత్రి మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి,ఆంధ్రప్రదేశ్ విద్యుత్ శాఖ మంత్రి గొట్టిపాటి రవికుమార్,జోన్-4 కో-ఆర్డినేటర్ దామచర్ల సత్యలు హాజరయ్యారు.ఈ నేపథ్యంలో తంబల్లపల్లె నియోజకవర్గం ఇంచార్జి,మాజీ శాసనసభ్యులు జి.శంకర్ యాదవ్ మంత్రులను మర్యాదపూర్వకంగా కలిసి వారికి పుష్పగుచ్ఛాలు అందజేసి శాలువాలతో ఘనంగా సత్కరించారు.ముందుగా జి.శంకర్ యాదవ్ ని వారు ఆప్యాయంగా పలకరించి శుభాకాంక్షలు తెలిపారు.అనంతరం ప్రస్తుతం రాజకీయాలపై కాసేపు చర్చించుకున్నారు.వెనుకబడిన తంబళ్లపల్లె నియోజకవర్గం అభివృద్ధికి సహకరించాలని మంత్రులకు శంకర్ యాదవ్ విజ్ఞప్తి చేశారు.పార్టీ అధిష్టానం ఆదేశాల మేరకు ప్రభుత్వ అమలు చేస్తున్న సంక్షేమ పథకాలు,అభివృద్ధి కార్యక్రమాలను ప్రజల్లోకి తీసుకెళ్తామన్నారు.తంబళ్లపల్లిలో టిడిపి పూర్వవైభవానికి శక్తివంచన లేకుండా కృషి చేస్తామని,పార్టీ శ్రేణులకు భరోసా కల్పిస్తామన్నారు.తనకు ఇన్చార్జిగా అవకాశం కల్పించినందుకు ముఖ్యమంత్రి చంద్రబాబుతోపాటు మంత్రులకు ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేస్తున్నానన్నారు.
Reporter
Namitha News