Friday, 19 June 2026 04:59:14 PM
# ప్రతి డంపింగ్ యార్డ్ ఓ బృందావనం కావాలి - ఎంపీడీవో ఉషారాణి # ఎస్.ఐ.ఆర్. సర్వే పారదర్శకంగా పూర్తి చేయాలి - ఆర్వో మాధవ కృష్ణారెడ్డి # విజన్ యాక్షన్ ప్లాన్ యూనిట్ పనితీరు బాగుంది - తహసీల్దార్ శ్రీనివాసులు # గ్రామ పంచాయతీల అభివృద్ధిపై శిక్షణా తరగతులు # డాక్టర్ బి.ఆర్. అంబేద్కర్ స్ఫూర్తితో ప్రతి బిడ్డను చదివించండి # మొండివారిపల్లి రహదారి సమస్య పరిష్కరించండి # టెలికాం అడ్వజరి మెంబరు గా బాధ్యతలు స్వీకరించిన వైసీపీ నేత షరీఫ్‌ # రాష్ట్ర వ్యాప్తంగా 43 మoది వైద్యుల డిస్మిస్ # మైక్రో మొబిలిటీ ఈ-ట్రైక్ ను ఆవిష్కరణ చేసిన మిట్స్ విద్యార్థులు # మాజీ సియం జగన్ ఈ నెల 28వ తేదీ మదనపల్లి పర్యటనకు అనుమతి ఇవ్వండి - నిసార్ అహమ్మద్ # ఘనంగా బి.సి.వై అధినేత జన్మదిన వేడుకలు, విజయంతం గా జాబ్ మేళా # విజయోత్సవ సభ కు పుంగనూరు తెలుగు తమ్ముళ్ల బైక్ ర్యాలీ # మొలకల చెర్వు ఉపాధ్యాయురాలి మృతి పై ఘటనపై మంత్రి లోకేష్ దిగ్భ్రాంతి # ఈ ప్రభుత్వ పాఠశాల కు బలే డిమాండ్ # మునిసిపాలిటీ పరిధిలోని సచివాలయాల్లో సర్వే డేటా ప్రదర్శన # మదనపల్లి లో 2ఏండ్ల నమ్మకం - సూపరిపాలన జిల్లా స్థాయి విజయోత్సవ సభ # తంబళ్లపల్లి టిడిపి ఇంచార్జ్ జి. శంకర్ ...? # పీలేరు సీఐ గా వెంకటేశ్వర్లు బాధ్యతల స్వీకరణ # కాంట్రాక్టు నర్సు ల వేతనాలు చెల్లించాలని విజయవాడ లో నిరసన తెలిపిన నర్సులు # సోలార్ విద్యుత్తుతో ప్రతి ఇంటికి ఆదాయ వనరులు

ఈతకు వెళ్లి బావిలో మునిగి యువకుడు మృతి

Date : 26 April 2026 07:03 PM Views : 87

నమిత న్యూస్ - Andhra Pradesh / Annamayya : ఈతకు వెళ్లి విషాదం… బావిలో మునిగి యువకుడు మృతి అన్నమయ్య జిల్లా మదనపల్లె మండలంలో ఆదివారం విషాదకర సంఘటన చోటుచేసుకుంది. చీకిలబైలు గ్రామం సమీపంలో ఈతకు వెళ్లిన యువకుడు ప్రమాదవశాత్తు బావిలో మునిగి మృతిచెందాడు. ఫైర్ ఆఫీసర్ శివప్ప తెలిపిన సమాచారం మేరకు వివరాలు... చీకులపల్లి సమీపంలోని సుబ్బిరెడ్డి బావిలో స్నేహితులతో కలిసి ఈతకు వెళ్లి హరినాథ్ కుమారుడు కె. యశ్వంత్ (21), ప్రమాదవశాత్తు నీటిలో గల్లంతయ్యాడు. ఇది గమనించిన సహచరులు ఆందోళనతో కేకలు వేయగా, స్థానికులు వెంటనే స్పందించి సమాచారం అందించడంతో అగ్నిమాపక సిబ్బంది ఘటనాస్థలికి చేరుకుని గాలింపు చర్యలు చేపట్టి యశ్వంత్ మృతదేహాన్ని బయటకు తీశారు. అనంతరం మృతదేహాన్ని పోలీసులకు అప్పగించారు. ఈ సంఘటనతో గ్రామంలో విషాద ఛాయలు అలుముకున్నాయి.

B.MANI KUMAR

Reporter

Namitha News

మరిన్ని వార్తలు

Copyright © Namitha News 2026. All right Reserved.



Developed By :