Sunday, 13 September 2026 07:40:52 PM
# మిట్స్‌లో ‘ఎకో బప్పా మోరియా 3.0’ వినాయక చవితి వేడుకలు. # మట్టి వినాయక విగ్రహాలు, మొక్కల పంపిణీ # వివాహా నిశ్చితార్థ వేడుకల్లో శ్రీరామ్ చినబాబు # పుంగనూరు లో అసూరి బాలాజీ ఆధ్వర్యంలో ఘనంగా మాజీ సీఎం నల్లారి కిరణ్ కుమార్ రెడ్డి బ్రదర్స్ లకు జన్మదిన వేడుకలు # తక్షణమే స్పందించి ఆత్మహత్య చేసుకోవాలి అనుకొన్న యువతి ని కాపాడిన పోలీసులు # జాతీయ లోక్అదాలతో 71 కేసులు పరిష్కారం # తంబళ్లపల్లెలో 'విఘ్నం'లఘు చిత్రం ప్రారంభం # వినాయక చవితి పండుగ నేపథ్యంలో సోమవారం గ్రీవెన్స్ రద్దు - జిల్లా ఎస్పీ ధీరజ్ కునుబిల్లి # మట్టి వినాయక విగ్రహాలను పూజిద్దాం - సబ్ కలెక్టర్ చల్లా కల్యాణి # ట్రాక్టర్ ఢీకొని ఇద్దరికి తీవ్ర గాయాలు # తంబళ్లపల్లె సమస్యల పై అధికారులు దృష్టి సారించండి-ప్రజా దర్బార్ లో మాజీ ఎమ్మెల్యే జి శంకర్ యాదవ్ # ప్రజల సమస్యల పరిష్కారానికి ఐకమత్యంతో పనిచేయండి - మాజీ ఎమ్మెల్యే జి.శంకర్ యాదవ్ # మిట్స్ లో హెచ్‌ఆర్ కెరీర్స్ & ఏఐ ఆధారిత డిజిటల్ మార్కెటింగ్ ట్రెండ్స్ పై అతిధి ఉపన్యాస # వినాయక మండపాల నిర్వహణ పై సూచనలు -- డి.ఎస్పీ. బుచ్చిరాజు # ఎంపీ మిథున్ రెడ్డిపై ఉప్పొంగిన అభిమానం - యువనేత హర్షవర్ధన్ రెడ్డి ఆధ్వర్యంలో సేవా కార్యక్రమాలు # పఠాన్ ఖాదర్ ఖాన్ సేవలు స్ఫూర్తిదాయకం - టిడిపి రాష్ట్ర కార్యదర్శి పచ్చిపాల తులసి రామకృష్ణ హర్షం # మంచి చేయడమే కానీ మోసం చేయడం తనకు తెలియదు # ప్రజా శ్రేయస్సుకై పరితపించే నేత ఎంపీ మిథున్ రెడ్డి - వైకాపా రాష్ట్ర కార్యదర్శి ఎస్.ఏ కరీముల్లా ప్రశంసలు # రాష్ట్రంలో తీవ్ర కరువు ను కేంద్ర విపత్తుగా పరిగణిస్తూ కరువు ప్యాకేజీని ప్రకటించాలి - BKMU జిల్లా కార్యదర్శి తోపు కృష్ణప్ప # హ్యూమన్ రైట్స్ ముసుగు లో ఘరానా మోసాలు

జిఆర్టీ హైస్కూల్ కరస్పాండెంటుగా జగన్మోహన్

సీనియర్ సిటిజన్స్ ఆధ్వర్యంలో ఘనసన్మానం - హాజరైన అసోసియేషన్ అధ్యక్షులు డాక్టర్ ఎన్.మునిగోపాల కృష్ణ

Date : 14 June 2026 10:17 PM Views : 119

నమిత న్యూస్ - Andhra Pradesh / Annamayya : జిఆర్టీ హైస్కూల్ కరస్పాండెంటుగా జగన్మోహన్ - సీనియర్ సిటిజన్స్ ఆధ్వర్యంలో ఘనసన్మానం - హాజరైన అసోసియేషన్ అధ్యక్షులు డాక్టర్ ఎన్.మునిగోపాల కృష్ణ మదనపల్లె : పట్టణంలోని బెంగళూరు రోడ్డు నందు గల జిఆర్టి ఇంగ్లీష్ మీడియం హైస్కూల్ నూతన కరస్పాండెంట్ జగన్మోహన్ ఆయన సతీమణిని సీనియర్ సిటిజన్స్ ఘనంగా సన్మానించారు.ఆదివారం ఆంధ్రప్రదేశ్ సీనియర్ సిటిజన్స్ వెల్ఫేర్ అసోసియేషన్ అధ్యక్షులు డాక్టర్ ఎన్.మునిగోపాల కృష్ణ,సెక్రటరీ కరుణాకర్,కోశాధికారి కుమార స్వామి,ఉపాధ్యక్షులు జగన్మోహన్,శకుంతలమ్మ,మహిళా ప్రతినిధి సరస్వతమ్మ,ఆర్గనైజర్ ఎన్.వి నాయుడు,ముఖ్య సలహాదారులు డాక్టర్ గొల్లపూడి తిరుపతిరావు,ప్రముఖ నవలా రచయిత టీఎస్ఏ కృష్ణమూర్తి, జాయింట్ సెక్రెటరీ వి.ఎం నాగరాజల సంయుక్త ఆధ్వర్యంలో మదనపల్లెలో జిఆర్టి ఇంగ్లీష్ మీడియం హైస్కూల్ నందు ఆంధ్రప్రదేశ్ సీనియర్ సిటిజన్స్ వెల్ఫేర్ అసోసియేషన్ సమావేశం జరిగింది.ఈ సమావేశంలో అధ్యక్షుడు డాక్టర్ మునిగోపాలకృష్ణ మాట్లాడుతూ సీనియర్ సిటిజన్స్ అసోసియేషన్ ఉపాధ్యక్షుడు జగన్మోహన్ ను స్కూల్ యాజమాన్యం (బిటిసి ట్రస్ట్)తరపున అతన్ని కరస్పాండెంటుగా నియించడం జరిగిందని స్పష్టం చేశారు.ఈ శుభ సందర్భంగా జగన్మోహన్,అతని సతీమణి రెడ్డి జ్ఞానాంబికను శాలువ,పూలమాల,జ్ఞాపికతో ఘనంగా సన్మా నించారు. ఈ కార్యక్రమానికి ఢిల్లీ యూని వర్సిటీ మాజీ ప్రొఫెసర్ డాక్టర్ చంద్రశేఖర్,రిటైర్డ్ డిస్ట్రిక్ట్ అడ్మినిస్ట్రేటివ్ ఆఫీసర్ ధనలక్ష్మి,జాయింట్ సెక్రెటరీ వి.ఎం నాగరాజ,ప్రముఖ సినీ నటుడు నాగభూషణం,దివాకర్,శ్రీనివాసులు,తిమ్మయ్య,సురభి హేమలత,జిల్లా గ్రంధాలయ అధికారిణి వసంత కుమారిలు హాజరయ్యారు.సన్మాన గ్రహీత జగన్మోహన్ ఇదే పాఠశాలలో విద్యార్థిగా చదువుకొని,అదే పాఠశాలలో ఉపాధ్యాయుడిగా పనిచేయడంతో పాటు,తిరిగి ఇదే పాఠశాలలో హెడ్మాస్టరుగా సేవలు అందించి పదవీ విరమణ చేశారు.పదవీ విరమణ అనంతరం అయన ట్రస్ట్ సభ్యులుగా,కార్యదర్శిగా సేవలు అందించారు.జగన్మోహన్ సేవలను గుర్తించిన బెసెంట్ సెంటినరీ ట్రస్ట్ యాజమాన్యం జగన్ మోహన్ ను గిరిరావు దివ్యజ్ఞాన పాఠశాలకు కరస్పాండెంట్ గా నియమిస్తూ ఆదేశాల విడుదల చేశారు. ఈ సందర్బంగా నూతన కరస్పాండెంట్ జగన్మోహన్ మాట్లాడుతూ జిఆర్టి స్కూల్లో తన ప్రస్థానాన్ని గుర్తు చేసుకొని ఉద్వేగానికి లోనయ్యారు.సాధారణ స్థాయి నుండి జి.ఆర్.టి ఇంగ్లీష్ మీడియం పాఠశాలకు కరస్పాం డెంట్గా నేడు బాధ్యతలు చేపట్టడం చాలా గర్వంగా ఉందని ఆనంద భాష్పాల మధ్య తన అభిప్రాయాన్ని తెలియజేశారు.దీని వెనక తన కష్టం స్వయం కృషి ఎంతో ఉందని పేర్కొన్నారు.అనంతరం శకుంతలమ్మ వెంకటేశ్వర స్వామి ప్రతిమను జగన్మోహన్ దంపతులకు బహుకరించారు.డాక్టర్ గొల్లపూడి తిరుపతి రావు,డాక్టర్ చంద్రశేఖర్,టిఎస్ఏ కృష్ణమూర్తి,బియ్యం నాగరాజు,ప్రముఖ సినీ నటుడు నాగభూషణం,దివాకర్,శకుంతలమ్మ,సరస్వతిలు జగన్మోహన్ సేవలను కొనియాడుతూ కరస్పాండెంట్ గా బాధ్యతలు చేపట్టినందుకు హృదయ పూర్వక అభినందనలు తెలియ జేశారు.

B.MANI KUMAR

Reporter

Namitha News

మరిన్ని వార్తలు

Copyright © Namitha News 2026. All right Reserved.



Developed By :