నమిత న్యూస్ - Andhra Pradesh / Annamayya : విశ్వం లో అట్ట హాసంగా ఆగమన 2కే 25 విశ్వం ఇంజనీరింగ్ కళాశాల లో ఘనంగా ఆగమన 2కే 25 నిర్వహించినట్లు కళాశాల ప్రిన్సిపాల్ డా. డి. రమణా రెడ్డి తెలిపారు. కళాశాల చైర్మన్ శ్రీ. ఎం. ప్రభాకర్ రెడ్డి మాట్లాడుతూ ఈ సంవత్సరం నుండి వినూత్న మార్పులు ఉంటాయని అవి టీచింగ్, ప్లేసెమెంట్, అకాడమిక్ లో కూడా చాలా క్వాలిటీ తీసుకొస్తామని, ఇంకా విద్యార్థులు అన్నివిధాలా కాలేజీ కి సహకరించి, మీరు కూడా భవిష్యత్ లో మంచి క్యారీర్ లో నిలిచి కాలేజీ కి రోల్ మోడల్స్ ఉండాలని పిలుపు నిచ్చారు. కళాశాల ప్రిన్సిపాల్ డా. డి. రమణా రెడ్డి మాట్లాడుతూ బి. టెక్ ప్రథమ సంవత్సరం 2025 విద్యార్థులు కు ద్వితీయ సంవత్సరం విద్యార్థులు ఫ్రెషర్స్ డే నిర్వహించి తద్వారా విద్యార్థుల మధ్య స్నేహ సంబంధాలు బాగా ఉండాలని అకాడమిక్స్ లో మంచి ఉతీర్నత సాధించాలని, సీనియర్స్ ను గౌరవించి వారి సలహాలను తీసుకోవాలి అని తెలిపారు. వైస్ ప్రిన్సిపాల్ టి. ఎస్. గౌస్ భాషా మాట్లాడుతూ బి.టెక్ మొదటి సంవత్సరం విద్యార్థులు మంచి క్రమం శిక్షణ తో విద్యా విధానం ఇంకా ప్రస్తుత పోటీ ప్రపంచం లో మీ స్థాయిని పెంచుకోవాలని తెలిపారు. ఈ కార్యక్రమం లో కళాశాల చైర్మన్ శ్రీ. ఎం. ప్రభాకర్ రెడ్డి, ప్రిన్సిపాల్ డా. డి. రమణా రెడ్డి, వైస్. ప్రిన్సిపాల్. టి ఎస్. గౌస్ బాషా, ఆర్. అండ్. డి డైరెక్టర్, డా. బి. డి. వెంకటరమణ, డీన్స్ హెస్. ఓ. డీస్, అధ్యాపకులు, విద్యార్థులు పాల్గొన్నారు.
Reporter
Namitha News