Wednesday, 29 July 2026 08:17:16 AM
# మదనపల్లి లో మానవీయ ఘటన # పంచాయతీల విద్యుత్ బిల్లులు చెల్లింపుకు సహకరించండి - విద్యుత్ ఏ .ఈ సురేంద్ర # కడ పల్లి లో ఘోర రోడ్డు ప్రమాదం, ముగ్గురు మృతి, 5 గురికి గాయాలు # మదనపల్లె డీఎస్పీ గా బాధ్యతలు చేపట్టిన బుచ్చిరాజు # "ఇంటింటికి తెలుగుదేశం" కార్యక్రమానికి ఘన శ్రీకారం చుట్టిన పల్లా శ్రీనివాసరావు # భవన నిర్మాణ కార్మికులు సంక్షేమ బోర్డు కార్డులు రెన్యువల్ చేసుకోండి # ఈవీఎం గోడౌన్ల వద్ద పటిష్టమైన భద్రత ఉండాలి - జిల్లా కలెక్టర్ నిశాంత్ కుమార్ # అన్నమయ్య జిల్లా ను వెంటనే కరవు జిల్లాగా ప్రకటించాలి – సిపిఐ # విజయవంతంగా వ్యవసాయ కార్మిక సంఘం సమావేశం # మల్లయ్య కొండలో వైభవంగా తొలి ఏకాదశి పూజలు # ఉపాధి హామీ లో కొబ్బరి మొక్కలు నాటుకోండి - ఎంపీడీవో ఉషారాణి # తొలి ఏకాదశి పూజ కార్యక్రమం లో పాల్గొన్న కార్ల మల్లికార్జు # ATM ను ఎత్తుకువెళ్లిన దొంగలు # ఉచిత ఎముకల శాంధ్రత పరీక్ష శిభిరం ను ప్రజలు సద్వినియోగం చేసుకోండి # విజవంతం గా మెగా పేటీఎం 4.ఓ సమావేశం.. # ప్రతి విద్యార్థిని ఉన్నతంగా తీర్చిదిద్దడమే ప్రభుత్వ ధ్యేయం # కుక్కరాజుపల్లి డంపింగ్ యార్డ్ ను తనిఖీ చేసిన ఎంపిడిఓ. # పెద్దేరు ప్రాజెక్టును సందర్శించిన హైడ్రాలజీ అధికారులు. # వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా సర్వసభ్య సమావేశాన్ని జయప్రదం చేయండి - జిల్లా కార్యదర్శి కృష్ణప్ప # ఆత్మకూరులో డాక్యుమెంట్ రైటర్స్ ఆందోళన

SIR ప్రక్రియ పారదర్శకంగా, ప్రజలకు ఇబ్బందులు లేకుండా, బి.ఎల్.ఓ. లు తప్పనిసరిగా ఇంటింటి సర్వే నిర్వహించాలి – నిసార్ అహమద్

అల్ పార్టీ మీటింగ్ లో జాయింట్ కలెక్టర్ కు వినతిపత్రం సమర్పించిన నిసార్ అహమ్మద్

Date : 25 June 2026 01:36 PM Views : 156

నమిత న్యూస్ - Andhra Pradesh / Annamayya : మదనపల్లి - జూన్ 25 : అన్నమయ్య జిల్లా కలెక్టర్ కార్యాలయంలో స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ (SIR) కార్యక్రమంపై వివిధ రాజకీయ పార్టీల ప్రతినిధులతో నిర్వహించిన జిల్లా స్థాయి సమావేశంలో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ మదనపల్లె నియోజకవర్గ సమన్వయకర్త శ్రీ ఎస్. నిసార్ అహమద్, వైఎస్సార్‌సీపీ మేధావుల ఫోరం రాష్ట్ర కార్యదర్శి శ్రీ వి.ఎస్. రెడ్డి పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఎస్. నిసార్ అహమద్ మాట్లాడుతూ, ఎన్నికల సంఘం మార్గదర్శకాల ప్రకారం బీఎల్‌వోలు ప్రతి ఇంటికి వెళ్లి ప్రత్యక్షంగా ఎన్యూమరేషన్ నిర్వహించాల్సి ఉండగా, కొందరు బీఎల్‌వోలు ప్రజలను సచివాలయాలకు రమ్మని ఒత్తిడి తెస్తున్నట్లు తమ దృష్టికి వచ్చిందన్నారు. ఇటువంటి పరిస్థితులను నివారించేందుకు బీఎల్‌వోలు ఇంటింటి సర్వే నిర్వహించిన సమయంలో తప్పనిసరిగా జియో ట్యాగింగ్ విధానాన్ని అమలు చేయాలని సూచించారు. తద్వారా సర్వే నిజంగా ఇంటి వద్దే జరిగిందని నిర్ధారించుకునే అవకాశం ఉంటుందని పేర్కొన్నారు. అలాగే ప్రస్తుతం రైతులు, వ్యవసాయ కూలీలు వ్యవసాయ పనుల్లో నిమగ్నమై ఉన్న నేపథ్యంలో, ప్రజలకు అనుకూలమైన సమయాల్లోనే ఇంటింటి సర్వే చేపట్టాలని, ప్రజలకు ఇబ్బందులు కలగకుండా ఎన్నికల ప్రక్రియను నిర్వహించాలని కోరారు. వి.ఎస్. రెడ్డి మాట్లాడుతూ, ఎన్నికల జాబితాల పరిశీలనలో కీలకమైన DSE (Demographically Similar Entries) జాబితాను అన్ని గుర్తింపు పొందిన రాజకీయ పార్టీలకు అందుబాటులో ఉంచాలని కోరారు. తద్వారా రాజకీయ పార్టీలు కూడా జాబితాలను పరిశీలించి, నిజమైన ఓటర్ల హక్కులు పరిరక్షించేందుకు సహకరించే అవకాశం ఉంటుందని తెలిపారు. ఈ మేరకు జాయింట్ కలెక్టర్ శివ్ నారాయణ్ శర్మ కు వినతిపత్రం సమర్పించారు. ఈ సమావేశంలో వివిధ రాజకీయ పార్టీల ప్రతినిధులు పాల్గొన్నారు

B.MANI KUMAR

Reporter

Namitha News

మరిన్ని వార్తలు

Copyright © Namitha News 2026. All right Reserved.



Developed By :