నమిత న్యూస్ - Andhra Pradesh / Annamayya : పుంగనూరు - జూన్ 18 : అన్నమయ్య జిల్లా పుంగనూరు పట్టణం కొత్తయిండ్లు లో ఉన్న మునిసిపల్ హైస్కూల్లో తమ పిల్లలను చేర్పించేందుకు తల్లిదండ్రులు క్యూ కట్టారు. పట్టణంలో మున్సిపల్ హై స్కూల్ లోని విద్యార్థులు ప్రతీ సంవత్సరం చదువు లో మంచి ప్రతిభ, మంచి ఫలితాలు సాధిస్తూ మంచి పేరున్న హైస్కూల్ గా మారింది. ఎంపీలు, ఎమ్మెల్యేలు సైతం సిఫారసు చేసేవారు. ఇంతటి పేరొందిన పాఠశాలలో తమ పిల్లలను చేర్పించేందుకు తల్లిదండ్రులు మొగ్గుచూపుతుండటం తో అడ్మిషన్లు నాటి నుండీ 6-10వ తరగతి వరకు 171 మంది అడ్మిషన్లు తీసుకున్నారని హెచ్.యం. ఉషారాణి తెలిపారు
Reporter
Namitha News