Monday, 14 September 2026 10:57:46 PM
# బిజెపి సీనియర్ నాయకుడు శ్రీనాథ్ రెడ్డి మృతి పార్టీకి తీరని లోటు # అన్నగారిన వర్గాల అభ్యున్నతికి బిజెపి తోనే సాధ్యం - బిజెపి జాతీయ కో కన్వీనర్ విష్ణువర్ధన్ రెడ్డి. # మట్టి వినాయక ప్రతిమలే పర్యావరణానికి శ్రేయస్కరం - వాసవి క్లబ్ అధ్యక్షులు వివి కృష్ణారావు # వినాయక చవితి వేళ ప్రతి ఇంట ఆనందం వెల్లివిరియాలి - కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత ఎస్.రెడ్డి సాహెబ్ ఆకాంక్ష # పర్యావరణ ప్రేమికుడు పఠాన్ ఖాదర్ ఖాన్ - టిడిపి రాష్ట్ర కార్యదర్శి పచ్చిపాల తులసి,శ్రీరామ్ చినబాబు ప్రశంసలు # స్థానిక సంస్థల ఎన్నికల్లో చరిత్ర సృష్టిద్దాం - జనసేన శ్రేణులకు రాందాస్ చౌదరి పిలుపు # గణనాధుడి ఆశీస్సులతో రాష్ట్రం సుభిక్షంగా మారాలి - చంద్రబాబు పాలనలో ఏపీ సస్యశ్యామలం కావాలి - తెలుగుదేశం యువనేత నాగూర్ వలి ఆకాంక్ష # సర్వ విఘ్నాలు తొలగిపోయి జిల్లా సమగ్రాభివృద్ధి సాధించాలి - ప్రజలకు వినాయక చవితి శుభాకాంక్షలు తెలిపిన జిల్లా కలెక్టర్ # మిట్స్‌లో ఆకట్టుకున్న ఎకో బప్పా మోరియా 3.0 వేడుకలు - పర్యావరణ ఆవశ్యకతను తెలియజేసిన విద్యార్థులు # టిడిపిలో డైనమిక్ లీడర్ ఎమ్మెల్యే కిషోర్ కుమార్ రెడ్డి - తెలుగుదేశం సీనియర్ నేత ఆర్.జె వెంకటేష్ # మిట్స్‌లో ‘ఎకో బప్పా మోరియా 3.0’ వినాయక చవితి వేడుకలు. # మట్టి వినాయక విగ్రహాలు, మొక్కల పంపిణీ # వివాహా నిశ్చితార్థ వేడుకల్లో శ్రీరామ్ చినబాబు # పుంగనూరు లో అసూరి బాలాజీ ఆధ్వర్యంలో ఘనంగా మాజీ సీఎం నల్లారి కిరణ్ కుమార్ రెడ్డి బ్రదర్స్ లకు జన్మదిన వేడుకలు # తక్షణమే స్పందించి ఆత్మహత్య చేసుకోవాలి అనుకొన్న యువతి ని కాపాడిన పోలీసులు # జాతీయ లోక్అదాలతో 71 కేసులు పరిష్కారం # తంబళ్లపల్లెలో 'విఘ్నం'లఘు చిత్రం ప్రారంభం # వినాయక చవితి పండుగ నేపథ్యంలో సోమవారం గ్రీవెన్స్ రద్దు - జిల్లా ఎస్పీ ధీరజ్ కునుబిల్లి # మట్టి వినాయక విగ్రహాలను పూజిద్దాం - సబ్ కలెక్టర్ చల్లా కల్యాణి # ట్రాక్టర్ ఢీకొని ఇద్దరికి తీవ్ర గాయాలు

జాతీయ రహదారిపై ఘోర రోడ్డుప్రమాదం - కారును ఢీకొన్న కంటైనర్ : ఇద్దరు దుర్మరణం

Date : 26 November 2025 04:49 PM Views : 253

నమిత న్యూస్ - Andhra Pradesh / Annamayya : జాతీయ రహదారిపై ఘోర రోడ్డుప్రమాదం - కారును ఢీకొన్న కంటైనర్ : ఇద్దరు దుర్మరణం - రెండు కుటుంబాలలో నెలకొన్న విషాదఛాయలు మదనపల్లె : చెన్నై - ముంబై జాతీయ రహదారిపై బుధవారం ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది.ఈ ప్రమాదంలో ఇద్దరు వ్యక్తులు దుర్మరణం చెందారు.దీంతో రెండు కుటుంబాల్లో విషాదఛాయలు అలముకున్నాయి.ములకలచెరువు పోలీసులు తెలిపిన వివరాల మేరకు.మదనపల్లె పట్టణం,సప్తగిరి నగరులో నివాసముంటున్న రిటైర్డ్ ఆర్టీసీ కండక్టర్ వెంకటరమణ (65) నీరుగట్టువారిపల్లిలో నివాసముంటున్న రాజశేఖర్ లు దగ్గరి బంధువులు.అనంతపురం మండలం,సాపిరెడ్డివారిపల్లిలో జరుగుతున్న బంధువుల వివాహానికి వెంకటరమణ,రాజశేఖర్లు మంగళవారం రాత్రి మారుతి స్విఫ్ట్ కారులో బయలుదేరి వెళ్లారు.బుధవారం ఉదయం వివాహమనంతరం తిరిగి అదే కారులో స్వగ్రామానికి బయలుదేరారు.మార్గమధ్యలోని వేపూరికోట,బురకాయలకోట మధ్యలో వీరి కారును అనంతపురం వైపు వెళుతున్న కంటైనర్ ఢీకొంది.ఈ ప్రమాదంలో కారు నుజ్జునుజ్జు కాగా అందులో ఉన్న వెంకటరమణ,రాజశేఖర్లు సంఘటనా స్థలంలోని దుర్మరణం పాలయ్యారు.సమాచారం అందుకున్న ములకలచెరువు పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకొని పరిస్థితిని సమీక్షించారు.మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం మదనపల్లె ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. కాగా రిటైర్డ్ కండక్టర్ వెంకటరమణకు భార్య ఇందిరమ్మ,కుమారుడు నవీన్ కుమార్,హరితలు ఉన్నారు.మరో మృతుడు రాజశేఖరకు భార్య రాధిక,కుమార్తె వైష్ణవి (10వ తరగతి),కుమారుడు కార్తీక్ (ఇంటర్మీడియట్)లు ఉన్నారు. రెండు కుటుంబాల్లో అలముకున్న విషాదం రోడ్డు ప్రమాదంలో దుర్మరణం పాలైన వెంకటరమణ,రాజశేఖర్ కుటుంబాల్లో విషాదం నెలకొంది. తమ కుటుంబ పెద్దలు రోడ్డు ప్రమాదంలో మృతి చెందారని వార్త తెలియగానే కుటుంబ సభ్యులు,బంధువులు పెద్ద ఎత్తున ప్రభుత్వ ఆసుపత్రి చేరుకొని కన్నీటి పర్యంతమయ్యారు.వీరిని ఓదార్చడం ఎవరి తరం కాలేదు.దేవుడా ఎందుకు మాకు ఇంత అన్యాయం చేశావంటూ గుండెలవిసేలా బోరున విలపించారు.ములకలచెరువు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

B.MANI KUMAR

Reporter

Namitha News

మరిన్ని వార్తలు

Copyright © Namitha News 2026. All right Reserved.



Developed By :