నమిత న్యూస్ - Andhra Pradesh / Annamayya : సెప్టెంబర్ 2027 నాటికి సంపూర్ణ అక్షరాస్యతే లక్ష్యం - అంతర్జాతీయ అక్షరాస్యత దినోత్సవం వేళ అధికారుల స్పష్టం - వయోజన విద్యశాఖ ఆధ్వర్యంలో మానవహారం,ర్యాలీ మదనపల్లె : సెప్టెంబర్ 2027 నాటికి జిల్లాలో సంపూర్ణ అక్షరాస్యతే లక్ష్యమని అధికారులు స్పష్టం చేశారు.మంగళవారం అక్షరాస్యత దినోత్సవాన్ని పురస్కరించుకొని అన్నమయ్య జిల్లా వయోజన విద్యాశాఖ ఆధ్వర్యంలో పట్టణంలోని ఎంఎల్ఎల్ ఆసుపత్రి వెనుక వైపు ఉన్న ప్రభుత్వ బాలికల ఉన్నత పాఠశాల నందు మానవహారం,ర్యాలీ నిర్వహించారు.ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా ఎంపీడీవో తాజ్ మస్రూర్,ఎంఈఓ ప్రభాకర్ రెడ్డి,డిఆర్ డిఏ ఏపీఎం ఖిజర్ ఖాన్,మెప్మా సిఎంఎం మధుసూదన్ రెడ్డి,పాఠశాల ప్రదానోపాధ్యయుడు శంకర్,వయోజన విద్య నోడల్ ఆఫీసర్ సుబ్రహ్మణ్యం రెడ్డి,సూపర్వైజర్లు రాజా,బాలకృష్ణారెడ్డి,చంద్రశేఖర్ రెడ్డి,గుణకర్ రెడ్డిలు పాల్గొన్నారు.15-59 మధ్య వయస్సు గల డ్వామా,డిఆర్ డిఏ,మెప్మా శాఖల నందు గ్రూపు సభ్యులలో గల నిరక్షరాస్యులను గుర్తించి గ్రూపులలోని అక్షరాస్యులనే వాలంటీర్ టీచర్లుగా ఎంపిక చేసి 100 గంటలు ప్రాథమిక,డిజిటల్ క్లాసులు,ఆడియో,వీడియాల ద్వారా అక్షరాస్యతను కల్పిస్తుందని తెలిపారు.గతంలో రాష్ట్ర అక్షరాస్యత 73 శాతం నుండి 2025-26న వయోజన విద్యాశాఖకు 25 లక్షల లక్ష్యాన్ని నిర్దేశించి 95 శాతం ఉత్తీర్ణత సాధించి 83 శాతానికి చేరిందన్నారు.మన జిల్లాలో 2025-26లో 72,549 మందిని అక్షరాస్యులుగా చేయడం జరిగిందని వయోజన విద్య నోడల్ ఆఫీసర్ తెలిపారు.2026-27కు గాను 66,618 మంది లక్ష్యాన్ని ఇచ్చారని,వీరిని గుర్తించి రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేకంగా రూపొందించిన అక్షర ఆంధ్ర యాప్ ద్వారా వెల్ఫేర్ ఎడ్యుకేషన్ అసిస్టెంట్లతో రిజిస్ట్రేషన్ పూర్తయిందని తెలిపారు.ఇందులో భాగంగా అంతర్జాతీయ అక్షరాస్యత దినోత్సవ ఆవశ్యకతను తెలియజేసి ర్యాలీ,మానవహారం నిర్వహించి అక్షర ప్రతిజ్ఞ చేయించారు.అక్షరాస్యత దినోత్సవం పురస్కరించుకొని నిర్వహించిన క్రీడలు మరియు వ్యాసరచన పోటీలలో విజేతలకు అతిథులు చేతుల మీదుగా బహుమతులను ప్రదానం చేశారు.ఈ కార్యక్రమంలో ఉపాధ్యాయులు,పాఠశాల సిబ్బంది పాల్గొన్నారు
Reporter
Namitha News